Saturday, 28 September 2024

గుడి మనదే - బాధ్యత మనదే.

*గుడి మనదే - బాధ్యత మనదే*
 *ప్రతి పని మనదే - ప్రతీ పనిలో మనమే* అంటూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సన్నద్దంలో బాగంగా  ఆలయ సేవలో నిర్వహణ మండలి & బాల సేవక మండలి సభ్యులు..
అన్ని తారతమ్యాలు మరిచి సేవలో ఉండడమే దైవ కార్యం..ఆచరిద్దాం. 
మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం.

దేవీ నవరాత్రులు - 2024 వ్యవస్థ

శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రులు - 2024

 ఏర్పాట్లలో భాగంగా అన్నపూజ, సామూహిక బ్రతుకమ్మ - అఖండ హారతి కార్యక్రమం కోసం *మాతృమండలి  ఇంటింటి ప్రచారం, సామూహిక లలితా పారాయ కుంకుమ, ప్రసాద వితరణ కోసం ప్యాకింగ్.

విశేష కార్యక్రమాల నిర్వహణ కోసం వేదిక/గ్రౌండ్ ని చదును చేయిస్తున్న *GSS యువజన విభాగం సభ్యులు.

Friday, 27 September 2024

పాత్రికేయ మిత్రులకు

*యాచారం మండల పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు💐, ప్రత్యేక అభినందనలు*...
*మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే సదాశయ స్పూర్తితో గత 15సం.రాలుగా జ్ఞానసరస్వతి దేవాలయం కేంద్రంగా ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించి బడుతున్నాయి*..

*అలాoటి కార్యక్రమాలను తమ అక్షర చైతన్యం ద్వారా సమాజానికి చేరవేస్తూ మీ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.*
*మరో బాసర నందివనపర్తి, విద్యార్థుల ఆలయం, విద్యార్థి సమేత అని ఇలా అనేక రకాల అద్భుత హేడింగ్ లతో తమ కలం ద్వారా ఆలయ విశేషాలను సమాజానికి చేరవేశారు, చెరవేస్తున్నారు.*

*ఈ ఆలయం నిర్మాణం  ఒక గొప్ప ఆశయంతో, వినూత్న పద్ధతిలో జరిగింది. అదే విధంగా నిర్వహణ కూడా ఒక నిర్ధిష్ట ప్రణాళికతో, నిరంతర క్రతువుగా కొనసాగుతున్న విషయ మీకూ తెలిసిందే.*
*ఆలయంలో అన్ని సేవలు ఇప్పటికీ, ఎప్పటికీ ఉచితంగా అందించ బడుతున్నాయి. ప్రతీ కార్యక్రమ్రం కూడా విశేష పరమార్థంతో నిర్వహించ బడుతున్నది.*

*అలాంటి ఉత్సవాల్లో భాగంగా ప్రతీ సoవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించ బడుతున్నాయి.*
*గత రెండు సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు విశేషంగా జోడించబడి అధ్బుతంగా నిర్వహించ బడుతున్నాయి*.
*అందులో అన్ని వర్గాల వారిని ఆదరిస్తూ @ పిల్లలు, మహిళలు, పెద్దలు, యువకులు, భజన కళాకారులను సమ్మిళితం చేస్తూ ఉత్సవాలు నిర్వహించ బడుతున్నాయి. సందర్భాన్ని బట్టి సమాజంలో పెద్దలను అతిథులుగా ఆహ్వానిoచబడుతారు.*
*దసరా ఉత్సవాలు -2024.*

*ఈ సారి విశేషంగా సుమారు 500 మంది మాతృ శక్తితో సాముహిక బతుకమ్మకు - ఇంటింటి హారతి,డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని పాఠశాల విద్యార్థులు, కళాశాల  యువతతో రాక్షస దహనం వoటి కార్యక్రమాలు నిర్వహించ బడుతున్నాయి*.

కావున *నిరంతర క్రతువుగా  నిస్వార్థ సేవతో జరిగే ఈ  చైతన్య కార్యక్రమాలు ఇతర గ్రామాల వారికి తెలిసే విధంగా, వారికి స్ఫూర్తిని, చైతన్య పరిచే విధంగా తమ అక్షర చైతన్యంతో సమాజానికి తెలపాలని ఆకాంక్షిస్తున్నాను.*

*నవరాత్రి ఉత్సవ వివరాల కరపత్రం,విశేష కార్యక్రమాల వివరాలు మరియు ఇతర సమాచారం GSS ప్రచార మండలి సబ్యులు మీకు అందిస్తారు* సహకరించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
భవదీయ 
సదా వెంకట్,
(B.A., LLB., PGDCJ)
Founder & Managing Trustee,
జ్ఞానసరస్వతి సంస్థాన్ & జ్ఞానసరస్వతి సేవాసమితి.
(శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం).

Monday, 23 September 2024

కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న చదువులతల్లికి హృదయ నీరాజనం..

కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న  చదువులతల్లికి హృదయ నీరాజనం..

యాచారం వాస్తవ్యులు శ్రీ తడకమళ్ళ లక్ష్మణ్ గారి భార్య, శ్రీమతి తడకమళ్ళ శిరీష గారు ఈ మధ్య వచ్చిన గురుకుల ఉద్యోగాలలో  టి.జి.టి_ ఇంగ్లీష్ గా ఉద్యోగం పొందారు.
తన మొదటి నెల వేతనాన్ని ఆలయానికి  సమర్పించారు.

ఆమె మాటల్లో......

జ్ఞానసరస్వతి సేవాసమితి మాతృమండలి సభ్యురాలుని అయినా నాకు అన్ని కార్యక్రమాలకు హాజరు కావడంతో అమ్మవారిపై ప్రీతికరమైన భావన ఏర్పడింది. ప్రభుత్వ ఉపాధ్యురాయురాలుని కావాలనేది నా ఆశయం. అందులో భాగంగానే 
నోటిఫికేషన్ రాగానే నా కోరికను అమ్మవారి ముందుంచి నా ప్రయత్నాన్ని మొదలుపెట్టాను. ఉద్యోగం రాగానే మా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని నా మొదటి నెల వేతనాన్ని ఆలయ అభివృద్ధి కోసం సేవాసమితి సభ్యులకు అందజేయడం జరిగింది.

ఇక్కడి ఆలయ నిర్మాణ సంకల్పం మరియు ఆలయం ద్వారా నిరంతరంగా కొనసాగుతున్న విద్యా మహయజ్ఞానికి
 నేను సైతం తోడవ్వాలని అమ్మవారి మొక్కు తీర్చుకుంటూ "" నా మొదటి నెల వేతనాన్ని(53,299/)""  హృదయ పూర్వకంగా సమర్పిస్తున్నాను. ఇందుకోసం నన్ను ప్రొత్సహించిన మా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు..
ఆ అమ్మవారి అనుగ్రహం ముందు ముందు కూడా ఇలాగే ఉండాలని వేడుకుంటున్నాను. 
____________________~___________~___________
కృషి పట్టుదలతో  చదివి అమ్మవారి అనుగ్రహం తోడై ఉద్యోగం పొంది కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్ధతుతో ఉదారంగా, వినమ్రతతో తన మొదటి నెల వేతనాన్ని అమ్మవారి ఆలయానికి సమర్పించిన శ్రీమతి శిరీష గారికి జ్ఞానసరస్వతి సేవాసమితి  తరపున శుభాభినందనలు ..

శిరీష గారు జీవితంలో ఇంకా ఉన్నతస్థాయికి ఎదిగి కీర్తిమంతురాలు కావలని అందరం ఆశిద్దాం .. ఆశీర్వదిద్దాం..

#GNANA SARASWATHI SEVASAMITHI Trust.

Sunday, 22 September 2024

శరన్నవరాత్రి ఉత్సవ మండలి - 2024

*శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రులు - 2024 కోసం జ్ఞానసరస్వతి సేవాసమితి ఉత్సవ మండలి సమావేశం*
*03.10.2024 నుండి ప్రారంభమయ్యే శరన్నవరాత్రులలో జరిగే నిత్య కార్యక్రమాలు మరియు విశేష కార్యక్రమాల నిర్వహణ కోసం, మండలీలో సభ్యులయి ఉండి మరియు ఆలయ వ్యవస్థలో నిస్వార్థంగా ఉన్న కార్యకర్తలకు  భాద్యతలు అప్పగింత.*
:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్*

Sunday, 15 September 2024

సేవా తత్పరులకు స్వాగతం.

*సేవా సత్పరులకు సాదర స్వాగతం*
*మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే సంకల్పంతో నిర్మితమైనది నందివనపర్తిలోని శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం.*

*ఆలయం చిన్నది - ఆశయo గొప్పది అనే సదాశయ స్ఫూర్తితో అనేక ఉత్సవాలు, సేవా కార్యక్రమాలు నిరoతరం నిర్వహించ బడుచున్నాయి.*

అందులో భాగంగా ప్రతీ సంవత్సరం నిర్వహించే *దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది జ్ఞానసరస్వతి సంస్థాన్.*

*ఆలయ నిర్మాణం, నిర్వహణ కోసం ఏర్పాటు చేసుకున్న 145 మంది సభ్యులున్న వివిధ మండలీల నుండి 36మందితో  ^శ్రీ శరన్నవరాత్రి ఉత్సవ మండలి-2024^ ఏర్పాటు చేయబడింది..*
*https://gnanasaraswathitemplenwp.blogspot.com/2024/09/2024.html?m=1*

ఈ మండలి సభ్యులతో పాటు ఆలయంలో జరిగే ఉత్సవం కోసం సేవలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకునే వారినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
వివరాలకు: +919177000412, +918125995250

*దైవ కార్యంలో, ధర్మకార్యంలో అందరు సమానులే, అందరూ సామాన్యులే...ఆచరిద్దాం*

:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్* & *జ్ఞానసరస్వతి సేవా సమితి.*

Saturday, 14 September 2024

శరన్నవరాత్రి ఉత్సవ మండలి - 2024.

*శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.*
*శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రులు - 2024* 

*అమ్మవారి అనుగ్రహంతో, పూజ్యశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ దివ్య ఆశీస్సులతో,  కార్యకర్తల నిస్వార్థ సేవతో, ఆలయ శ్రేయోభిలాషుల సహకారంతో ప్రతీ సంవత్సవం వైభవంగా నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలు*
     
ఈ ఏడాది కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నది.

*ఆలయ నిర్మాణం & నిర్వహణ కోసం ఏర్పాటు చేసుకున్న వివిధ మండలీల ప్రముఖులు మరియు సహాయకులచే శరన్నవరాత్రి ఉత్సవ మండలి - 2024 ఏర్పాటు చేయబడింది*.

*ఈ మండలి సభ్యుల సమన్వయంతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించ బడుతాయి*.


*మార్గదర్శక మండలి సభ్యులు* 
శ్రీ సదా వెంకట్ గారు.


*సలహా మండలి సభ్యులు*
 
కొంగళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి గారు
పోలోజు బ్రహ్మచారి గారు 
కొండూరు అంజయ్య గారు
ఐలపురం జలంధర్ రెడ్డి గారు.(మొత్తం మండలి సభ్యుల సంఖ్య : 05)
 

*ఉత్సవ మండలి 2024 ప్రముఖ్*
చిన్న జలంధర్ రెడ్డి 

*నిర్వహణ మండలి*
సంగం గణేష్ 
కొండూరు రామనాథం 
రాఘవేందర్ శర్మ
కాలే యాదయ్య
తెలగమల్ల నరేందర్
వెంకట్ రెడ్డి మూడెడ్ల 
(మొత్తం మండలి సభ్యుల సంఖ్య : 11)


*మాతృమండలి*
చెర్ల రుద్రమ్మ 
(ఉత్సవ సహప్రముఖ్)
 వన్నవాడ ప్రేమలత 
నూకం మాధవి  

నాగదీపిక రాణి మేడిపల్లి
(ఉత్సవ సహప్రముఖ్) 
సానేం లావణ్య  
సరస్వతి 

కంబాలపల్లి అనురాధ (ఉత్సవ సహప్రముఖ్)
 భాగ్యమ్మ 
 నిర్మల 
(*మండలి మొత్తం సభ్యుల సంఖ్య :: 49*)

*ఆర్థిక/అకౌంట్స్ విభాగం*
శివకుమార్ రెడ్డి 
(ఉత్సవ సహ ప్రముఖ్)
నూకం హరిప్రసాద్  
*(మండలి సభ్యుల మొత్తం సంఖ్య - 02*)

*విద్యాసంస్థల సమన్వయ విభాగం*

పోలిశెట్టి చంద్రశేఖర్ 
(ఉత్సవ సహ ప్రముఖ్)
(*మొత్తం మండలి సభ్యుల సంఖ్య - 0*)

*ప్రచార - టెక్నికల్ విభాగం*

నిఖిల్  
(ఉత్సవ సహ ప్రముఖ్)
మూడెడ్ల శ్రీనివాస్ రెడ్డి
మేకo అభిలాష్
నూకం నవీన్ కుమార్ 
(*మొత్తం సభ్యుల సంఖ్య - 13*)


*యువజన విభాగం* 
సామ సంతోష్ 
(ఉత్సవ సహ ప్రముఖ్)
పంతం సిద్ధు 
కొండాపురం రాజు 
(*మొత్తం సభ్యుల సంఖ్య : 38*)


*సాంస్కృతిక విభాగం* 

 సతీష్ పోలోజు 
*మొత్తం సభ్యుల సంఖ్య : 02*
*భజన మండలి*

గాజుల దశరథ 
రాంరెడ్డి (*మొత్తం సభ్యుల సంఖ్య - 09*)

*బాల సేవక మండలి*

గుండెమోని సాయి కుమార్ (8th Class)
(*మొత్తం సభ్యుల సంఖ్య - 09*)

*స్వాగత విభాగం*
అన్ని విభాగాల నుండి కొందరు.

ఆలయ అన్ని మండలీల ప్రముఖ్ లు & సహాయకులు ఉత్సవ మండలిలో ఉంటారు. మిగతా సభ్యులు  ఆయా విభాగాల్లో ఉంటారు.
*మొత్తం సభ్యుల సంఖ్య : 145*

:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్ &             *జ్ఞానసరస్వతి సేవాసమితి*

Sunday, 1 September 2024

జ్ఞానసరస్వతి దేవాలయ మండలీల కార్యకర్తల ఆత్మీయ సమావేశం !!

ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన  12 మండలీ సభ్యుల  సమావేశం 31.08.2024 రోజున జరిగింది.

మండలీల పటిష్టత కోసం గత రెండు నెలలుగా మండలీల వారిగా సమావేశాలు నిర్వహించుకుని, ఆ మండలి సభ్యుల సంఖ్య,  మండలి ద్వారా నిర్వహించే బాధ్యతలు, బాధ్యులు నిర్ణయo 
చేసుకోవడం జరిగిoది.

అన్ని మండలీల సంయుక్త సమావేశం Google meet ద్వారా నిర్వహించ బడింది. 

ఈ సమావేశంలో గేయ రచయిత, గాయకులు, మంచి వక్త  మాన్యశ్రీ అప్పాల ప్రసాద్ గారు కన్వీనర్, సామాజిక సమరసత వేదిక గారు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు.

వారు మాట్లాడుతూ ఈ దేవాలయ నిర్మాణంలో అవలంబిoచిన అంశాలు చిన్న చిన్నవే అయినా అవి సమాజానికి చాలా ప్రేరణాత్మకం, ఆచరణాత్మకo అన్నారు. అలాంటి విషయాలు సమాజం గుర్తించడంలో కొంత ఆలస్యం కావచ్చు, కానీ  భవిష్యత్తులో ఒక గొప్ప ఆలయం అవుతుందన్నారు.

ఆలయాలకు వెళ్లి వ్యక్తిగత కోరికలు కోరడం, ఆలయాల నిర్వాహకులలో  స్పర్ధలు ఉండడం, అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్న నేటి పరిస్థితుల్లో, ఆలయం ద్వారా ఎన్ని రకాల సేవా కార్యక్రమాలు  యోజన బద్దంగా, నియమితంగా చేయవచ్చనేది జ్ఞాన సరస్వతి దేవాలయ నిర్వహణలో చూడవచ్చు అని అన్నారు.

ఆలయ వ్యవ స్థాపకులు సదా వెంకట్ గారు మాట్లాడుతూ ఆలయ నిర్వహణ పటిష్టత కోసం ఏర్పాటు చేసుకున్న మండలీల ద్వారా అన్ని తారతమ్యాలు మరిచి సేవలో ఉండాలి, ఆలయంలో జరిగే ఉత్సవాల నిర్వహణ మండలీల సభ్యుల ద్వారానే నిర్వహించ బడుతుంది కాబట్టి అందరూ తమ అనుకూల సమయం చేసుకోవాలన్నారు.

మoడలీల పటిష్టత కోసం నియమితంగా సమావేశాలునిర్వహించుకోవాలని....

ప్రతీ  మండలి నుండి ముగ్గురు సభ్యులచే ఉత్సవ నిర్వహణ మండలి ఏర్పాటు జరుగుతుంది. ఆ విధంగానే శరన్నవరాత్రి ఉత్సవాలు -2024 నిర్వహించ బడుతాయి అన్నారు.

సమావేశంలో అన్ని మండలీల సబ్యులు పాల్గొన్నారు.

:~ జ్ఞానసరస్వతి సంస్థాన్