కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న చదువులతల్లికి హృదయ నీరాజనం..
యాచారం వాస్తవ్యులు శ్రీ తడకమళ్ళ లక్ష్మణ్ గారి భార్య, శ్రీమతి తడకమళ్ళ శిరీష గారు ఈ మధ్య వచ్చిన గురుకుల ఉద్యోగాలలో టి.జి.టి_ ఇంగ్లీష్ గా ఉద్యోగం పొందారు.
తన మొదటి నెల వేతనాన్ని ఆలయానికి సమర్పించారు.
ఆమె మాటల్లో......
జ్ఞానసరస్వతి సేవాసమితి మాతృమండలి సభ్యురాలుని అయినా నాకు అన్ని కార్యక్రమాలకు హాజరు కావడంతో అమ్మవారిపై ప్రీతికరమైన భావన ఏర్పడింది. ప్రభుత్వ ఉపాధ్యురాయురాలుని కావాలనేది నా ఆశయం. అందులో భాగంగానే
నోటిఫికేషన్ రాగానే నా కోరికను అమ్మవారి ముందుంచి నా ప్రయత్నాన్ని మొదలుపెట్టాను. ఉద్యోగం రాగానే మా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని నా మొదటి నెల వేతనాన్ని ఆలయ అభివృద్ధి కోసం సేవాసమితి సభ్యులకు అందజేయడం జరిగింది.
ఇక్కడి ఆలయ నిర్మాణ సంకల్పం మరియు ఆలయం ద్వారా నిరంతరంగా కొనసాగుతున్న విద్యా మహయజ్ఞానికి
నేను సైతం తోడవ్వాలని అమ్మవారి మొక్కు తీర్చుకుంటూ "" నా మొదటి నెల వేతనాన్ని(53,299/)"" హృదయ పూర్వకంగా సమర్పిస్తున్నాను. ఇందుకోసం నన్ను ప్రొత్సహించిన మా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు..
ఆ అమ్మవారి అనుగ్రహం ముందు ముందు కూడా ఇలాగే ఉండాలని వేడుకుంటున్నాను.
____________________~___________~___________
కృషి పట్టుదలతో చదివి అమ్మవారి అనుగ్రహం తోడై ఉద్యోగం పొంది కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్ధతుతో ఉదారంగా, వినమ్రతతో తన మొదటి నెల వేతనాన్ని అమ్మవారి ఆలయానికి సమర్పించిన శ్రీమతి శిరీష గారికి జ్ఞానసరస్వతి సేవాసమితి తరపున శుభాభినందనలు ..
శిరీష గారు జీవితంలో ఇంకా ఉన్నతస్థాయికి ఎదిగి కీర్తిమంతురాలు కావలని అందరం ఆశిద్దాం .. ఆశీర్వదిద్దాం..
#GNANA SARASWATHI SEVASAMITHI Trust.
No comments:
Post a Comment