Saturday, 19 July 2025

అమ్మవారికి మొదటి వేతనం

కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న  #చదువులతల్లికి హృదయ నీరాజనం..
#నజ్దిక్_సింగారం వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ చింతపల్లి మంజుల రాంరెడ్డి గార్ల కుమారుడు ప్రభాత్ కిరణ్ గారు #Infosys లో #SoftwareEngineer గా ఉద్యోగం పొందారు.

ఉద్యోగం రాగానే తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని తన మొదటి నెల వేతనాన్ని ఆలయ అభివృద్ధి కోసం #సేవాసమితి సభ్యులకు అందజేయడం జరిగింది.

#BTech పూర్తయ్యాక ఉద్యోగం రావాలని కోరుకున్న వెంటనే అమ్మవారి అనుగ్రహంతో #Infosys లో ఉద్యోగం పొందాను. అందుకే నా మొదటి వేతనాన్ని దేవాలయ అభివృద్ధికి అందించాలని మా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి మొక్కు తీర్చుకుంటూ నా మొదటి నెల వేతనాన్ని(68,000/-) హృదయ పూర్వకంగా సమర్పిస్తున్నాను.

పట్టుదలతో  చదివి అమ్మవారి అనుగ్రహం తోడై ఉద్యోగం పొంది కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్ధతుతో ఉదారంగా, వినమ్రతతో తన మొదటి నెల వేతనాన్ని అమ్మవారి ఆలయానికి సమర్పించిన ప్రభాత్ కిరణ్ గారికి జ్ఞానసరస్వతి సంస్థాన్ తరపున శుభాభినందనలు ..

#ప్రభాత్_కిరణ్ గారు జీవితంలో ఇంకా ఉన్నతస్థాయికి ఎదిగి కీర్తిమంతుడు కావాలని అందరం ఆశిద్దాం .. ఆశీర్వదిద్దాం..
#జ్ఞానసరస్వతిసంస్థాన్.

No comments:

Post a Comment