Monday, 6 April 2026

GSF 2008 to 2026

https://youtu.be/5SYPk-vEf9c?si=LEj2F6oYhKTtrJ-9
🌼 జ్ఞానసరస్వతి ఫౌండేషన్ – 18 ఏళ్ల ప్రస్థానం🌼

🎉 సమ్మేళనం – కృతజ్ఞతల వేదిక.

18 సంవత్సరాల క్రితం ఒక  చిన్న సంకల్పంగా ప్రారంభమైన జ్ఞానసరస్వతి ఫౌండేషన్ (GSF),                         ఎన్నో ఒడుదుడుకులు, ఆర్థిక పరిమితులు మధ్య కూడా తన ఆశయాన్ని విడిచిపెట్టకుండా విజయవంతంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

👉 ఈ ప్రస్థానం ఒక సత్యాన్ని నిరూపించింది:
అన్ని బలాల కంటే గొప్పది సంకల్ప బలం” అనే వాక్కులకు ప్రత్యక్ష ఉదాహరణ GSF కార్యం.

💫 మా నమ్మకం.

ఒక వ్యక్తి సంకల్పానికి 
దైవానుగ్రహం తోడై…
ప్రకృతి కరుణ చూపితే
సహచరుల, సహృదయుల 
సహకారం ఉంటే ఏ కార్యమూ అసాధ్యం కాదని  చెప్పటానికి ఒక సాక్ష్యంగా GSF కార్యం నిలిచింది.

🔥 మా ప్రయాణం.

 నిబద్ధతతో ఫలితాలు ఆలస్యమైనా…
నిరాశకు లోనుకాకుండా…
స్థిరత్వంతో ముందుకు సాగితే నిజాయితీకి ప్రపంచం తలవంచుతుందనేది పెద్దల మాట..
అదే స్పూర్తిగా “నిజాయితీగా జరిగే ప్రతి ఉద్యమానికి, ప్రతీ కార్యానికి ప్రకృతి తలవంచి సహకరిస్తుంది అని నమ్మి, దానిని నిత్య నినాదంగా మార్చుకుని,
 మాటల్లోనే కాదు… 
ఆచరణలో సాధ్యమని 
GSF పని నిరూపించిందని  భావిస్తున్నాం

📚 మా లక్ష్యం.
🎯 గ్రామీణ విద్యార్థుల సంపూర్ణ వికాసం.

ప్రారంభమైన సంవత్సరం నుండి ప్రతీ ఆరేళ్లకు ఒకసారి మా శక్తిని, స్థాయిని పెంచి, కార్యాలు చేయించింది ప్రకృతి.
అలా
📌 2008–2014 లలో ప్రారంభం దేశభక్తి గేయాల పోటీలు, ప్రతిభా పురస్కారాలు, SSC విద్యార్థులకు సంకల్ప దివస్ లు, ప్రశిక్షణ శిబిరాలు,  బడిపండగ_ ఊరి పండగ పేరున వార్షికోత్సవాలు, etc.

📌 2014–2020 లలో 
10వ తరగతి విద్యార్థులకు లక్ష్యం శిబిరాలు, ప్రతిభావంతులకు 
సరైన సమయంలో చేయూత 
అనే నినాదంతో  సాధన శిబిరాలు,  సాధన కుటీర్ ప్రారంభం..
సాద్రి పేరున మహిళా విభాగం ప్రారంభం....

📌 2020–2026  కరోనాతో పాటు కాల పరీక్షలను తట్టుకుని నిలబడి, స్థిరపడ్డ సమయం.. 
*భారతమాత విగ్రహావిష్కరణ*,
*SAC పేరుతో నూతన ఆవిష్కరణ, స్పోర్ట్స్ శిబిరాలు నిర్వహణ*.

ఆయా కార్యకార్యాలకు సరిపడా శక్తి, యుక్తులు, సహాయకులు, కార్యకర్తలను కూడా ప్రకృతి ప్రసాదించడం మహా అద్భుతం..

*కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ, అదే ఆశయాన్ని అచంచలంగా నిలుపుకుంటూ ముందుకు సాగడం — మా గర్వం*.

🌱 ప్రకృతి మీద సంపూర్ణ విశ్వాసం..

“మన ఆశయం నిజమైతే,
ఆ ఆశయం కోసం దృఢంగా చివరివరకు మన పనిలో మనం నిలబడితే
ఎవరిని ఎప్పుడు కలపాలో, ఎవరిని జరపాలో  ప్రకృతి  నిర్ణయిస్తుంది అనే వాక్కులకు సజీవ సాక్ష్యంగా సాధన కుటీర్..

సంకల్పించిన కార్యం కోసం సాగుతున్న ఈ ప్రయాణంలో సరైన సమయంలో సరైన వ్యక్తులు కలవడం —
ఒక అజ్ఞాత శక్తి నడిపిస్తున్నదనే మా నమ్మకం.

💪 *మా బలం*

👉🏻 చేతిలో రూపాయి లేకపోయినా…
సంకల్పం ఉన్న చోట…
 ఏ కార్యమూ ఆగలేదు!

🙏 ఈ ప్రస్థానంలో సంపద సమర్పణ చేసిన సహృదయులకు,  నిస్వార్థంగా సేవలందించిన ప్రతి కార్యకర్తకు వందనం.

🏡 *సాధన కుటీర్* –
పల్లె ప్రతిభకు వేదికగా నిలిచిన పవిత్ర శక్తివంతమైన స్థలం, పల్లె ఆణిముత్యాల ప్రగతి కేంద్రం, ప్రకృతి ప్రసాదిత వరం సాధన కుటీర్.

⚠️ కరోనా సమయంలో జరిగిన అక్రమ దాడి, కూల్చివేత
మా ఆత్మస్థైర్యాన్ని పరీక్షించింది,
కానీ —
🔥మమ్మలి మళ్లీ నిలిపింది... నిజాయితీగా జరిగే ప్రతీ కార్యానికి ప్రకృతి తలవంచి సహకరిస్తుంది అని నమ్మి చేస్తున్న  కార్యాన్ని ప్రపంచానికి చూపింది, అపనిందలను గాలిలో కలిపి మా మార్గాన్ని మరింత దృఢంగా  మార్చింది.


💪 
ఈ పునర్నిర్మాణంతో మరింత బలంగా నిలిచా o అని భావించవచ్చు.
సమాజ హితం కోరి, నిజాయితీగా జరిగే ప్రతీ కార్యానికి వచ్చి ప్రతీ అడ్డంకి, ఆపద ఆ కార్యాన్ని మరింత బలంగా చేయడానికే అని నమ్మి నిలబడగలిగాo.  అంతేకాక వచ్చిన ఆపద కాలంలో మన వారు, ఎవరు, మన వాళ్ళుగా ఉన్న పరాయి వాళ్ళు ఎవరు అని చూపించాయి..

🙏 *అందరికీ కృతజ్ఞతలు*

✔️ *ఆపద సమయంలో అండగా నిలిచిన వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు*

✔️ *కష్టాలు కలిగించిన వారికి, ఆ కష్టాలలో పక్కకు జరిగిన వారికి కూడా కృతజ్ఞతలు.*

 ఎందుకంటే… 
*వారివల్లే మేము ఇంకా దృఢంగా మారగలిగాo*. 

🚀 ముందుకు…

మరింత నిబద్ధతతో…
మరింత విశ్వాసంతో…
పల్లె ఆణిముత్యాల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడం GSF లక్ష్యం.

🎉 *సమ్మేళనం – కృతజ్ఞతల వేదిక.*

18 ఏళ్ల ప్రయాణంలో భాగమైన ప్రతి హృదయాన్ని గౌరవించేందుకు
ఒక మహత్తర సమ్మేళనం నిర్వహించనున్నాము.

*GSF_SAC ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులకు నిరంతర సాధన శిబిరాలలో బాగంగా జరిగే వేసవి శిబిర సమయoలో ఈ సమ్మేళనం అనుకున్నాం.*

📢 *వివరాలు త్వరలో GSF టీమ్ ద్వారా తెలియజేయబడతాయి.అందరం మన మన అనుకూలతను చేసుకుందాo*..

💐పల్లె ఆణిముత్యాల ప్రతిభ ప్రపంచానికి చాటాలనే సదృడ సంకల్పంతో,  సదాశయ స్పూర్తితో, ఒక మహా యజ్ఞంలా సాగుతున్న ఈ పవిత్ర కార్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న ప్రతీ హృదయానికి మరోసారి ధన్యవాదాలు🙏..

:~ సదా వెంకట్,
*ఫౌండర్ & మేనేజింగ్ ట్రస్టీ*,
*జ్ఞానసరస్వతి ఫౌండేషన్*

Thursday, 26 February 2026

అమ్మవారికి హంస వాహనం కోసం ఈ వారంలో సందర్శించిన పాఠశాలలు

శ్రీమాత్రే నమః

వారాహి మాతా టీం ద్వారా ఈవారంలో విద్యార్థులకు Stickers అందించిన పాఠశాలలు..

1. నాగార్జున హై స్కూల్ 
2. శాస్త్రా గ్రామర్ హై స్కూల్ 
3. శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ 
4. ఇండియన్ పబ్లిక్ స్కూల్ 

*అందించిన stickers - 638*


టీం కచ్ఛపి ద్వారా వెళ్లిన పాఠశాలలు

1. సంకల్ప్ ఇంటర్నేషనల్ స్కూల్  
2. పల్లవి మోడల్ స్కూల్ 

*అందించిన Stickers - 465*


~*జ్ఞానసరస్వతి సంస్థాన్*

Friday, 5 December 2025

*ధ్వజస్తంభం కోసం కాలేజీ విద్యార్థుల విరాళo

అమ్మాదీవించు - కదిలాము సేవాదళమై..

కాళేజి పిల్లల పైసలడగటానికై 
నీ ముంగిట ద్వజస్థంభమే నిలపటానికై....
అమ్మా దీవించు - కదిలాము సేవాదళమై
అడగటానికి మేమైతే సిగ్గుపడటం లేదు..
అనుగ్రహించు వారిని.. ఇచ్చి ఎదగడానికి ..
అమ్మాదీవించు - కదిలాము సేవాదళమై...
ద్వజస్థంభమే కాదది స్ఫూర్తికేంద్రమవ్వాలని,
పల్యాణిముత్యాల ఆసరకై శ్రద్దకేంద్రమవ్వాలని..
అమ్మాదీవించు - కదిలాము సేవాదళమై...
( సంకల్పం... జ్ఞానసరస్వతీ దేవాలయంలో ప్రతిస్థించే ద్వజస్థంభం కళాశాల విద్యార్థుల విరాళాలతో సమకూర్చాలనేది సంకల్పం.. 2015 జనవరి, వసంతపంచమి రోజున ప్రతిష్ఠా మహోత్సవం జరపాలని నిర్ణయించబడింది. విరాళాలకోసం కళాశాలకు బయలుదేరే ముందు అమ్మదీవెనలు.. పెద్దల ఆశీస్సులు కోరుతూ ... బయలుదేరుదాం... దీవించు - కదిలాము సేవాదళమై!

Wednesday, 15 October 2025

హంస వాహన tms GOOGEL MEET

*జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.*
హంస వాహన team Incharges GOOGLE MEET* 
*అమ్మవారి హంస వాహనం కోసం విద్యార్థుల విరాళాల భాగస్వామ్యం ఆశిస్తూ*
మండల వారిగా సంప్రదించిన బృందాల వివరాలు

1. *వారాహి మాత* బృందం నుండి యాచారం మండలం నుండి ఇప్పటివరకు వెళ్లిన పాఠశాలలు :: 20

Private Schools - 05
Govt. Schools - 15

*విద్యార్థులకు అందించిన stickers :: 3108/-*


02. *వరదాయిని వాణి* బృందం నుండి కందుకూరు మండలం మరియు హైదరాబాద్ లో ఇప్పటివరకు వెళ్లిన పాఠశాలలు :: 31

Private Schools - 07
Govt. Schools - 24

*విద్యార్థులకు అందించిన Stickers :: 4545*

3. *వాగ్దేవి మాత* బృందం నుండి ఇప్పటివరకు వెళ్లిన పాఠశాలలు :: 08

Private Schools - 04
Govt. Schools - 04

*విద్యార్థులకు అందించిన stickers :: 2100*


*ఇప్పటివరకు 3 బృందాలు కలిపి విద్యార్థులకు అందించిన stickers - 9753*

మిగతా బృందాలు Oct చివరి వరకు తమ మండలాలలో పూర్తి చేయాలని నిర్ణయం.

*అదే విధంగా వివిధ ప్రైవేటు పాఠశాలలు, Corporate పాఠశాలకు వెళ్లేందుకు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయం*.

* *హంస వాహన సంకల్పంలో సుమారు 30 వేలకు పైగా పాఠశాల విద్యార్థులను బ్యాగులను చేసే ప్రయత్నంలో హంస వాహన  బృందాలు* 
* భక్తులు,ఆలయ  శ్రేయోభిలాషులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు ఇతర ప్రముకులు తమకు అనుకూలంగా ఉన్న విద్యాసంస్థలకు ఈ సంకల్పాన్ని చేర వేసేందుకు మీ వంతుగా సహకరించగలరని ఆశిస్తున్నాము.
* వివరాలకు: జలంధర్ +919177000412.
:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్*

Tuesday, 14 October 2025

హంస వాహన _ వాగ్దేవి మాత బృందం

*జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.*
అమ్మవారి హంస వాహనం కోసం విద్యార్థుల విరాళాల భాగస్వామ్యం ఆశిస్తూ...    

#వాగ్దేవిమాత బృందం నుండి 

1. Rose Buds High School, బాగాంబర్ పేట్
2. రాంచంద్ Girls High School
3. సత్యసాయి విద్యావిహార్, DD కాలనీ
4. Navya High School, అంబర్ పేట్
పాఠశాలలకు వెళ్లడం జరిగింది. విద్యా సంస్థలకు CONCEPT  వివరించి, విద్యార్థులకు 520 హంస వాహన Stickers ఇవ్వడం జరిగింది.
:~ #జ్ఞానసరస్వతిసంస్థాన్.

హంసవాహన_వారాహిమాత బృందం

ఈరోజు వారాహి మాత టీం నుండి
1)ZPHS, చింతపట్ల
2)MPUPS, మంతన్ గౌరెల్లి
3)MPUPS, మొండి గౌరెల్లి
4)MPUPS, తక్కళ్ళపల్లి
5)MPUPS, తమ్మలోనిగూడ
6)MPUPS, తాటిపర్తి
వెళ్లడం జరిగింది..
ఈరోజు మొత్తము 410 stickers ఇవ్వడం జరిగింది
ఈరోజు తో యాచారం మండలం పూర్తి అయింది.🙏🙏🙏

Sunday, 12 October 2025

శరన్నవరాత్రి ఉత్సవాల సమీక్ష

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై మండలి సభ్యుల సమీక్షా సమావేశం* 
on 12.10.2025, ఆదివారం @ సంకల్ప భవన్.
దేవి శరన్నవరాత్రులు - 2025  నిర్వహణపై మండలీలు  మరియు వివిధ విభాగాల జరిగిన పనిని సమీక్ష చేయడం జరిగింది.*
ఉత్సవ నిర్వహణకు సహకరించన వ్యవస్థలకు, వ్యక్తులకు ఆలయం ద్వారా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు💐.
ఈ శరన్నవరాత్రులలో జరిగిన లోటుపాట్లను గుర్తించి  మాఘ మాసంలో ప్రారంభమయ్యే శ్యామలా నవరాత్రులను విద్యార్థుల కార్యక్రమాలతో నిరహించే విధంగా మండలీలలను పటిష్ట పరచడం చేయాలని నిర్భయం జరిగింది.

* దేవాలయ నిత్య పూజలు,ఆలయ నిర్వహణ కోసం పోషక మండలి సభ్యులను పెంచాలనే నిర్ణయంతో పాటు...
15 సంవత్సరాల  లోపు చిన్నారులకు సాoప్రదాయబద్దంగా పుట్టినరోజు వేడుకల నిర్వహించడం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది.
ఉత్సవ వ్యవస్థలో పాల్గొన్న వివిధ మండలీల సభ్యుల సంఖ్య - 67. 
  :~ *జ్ఞానసరస్వతి సంస్థాన్*