Friday, 27 October 2023

మొదటి సంపాదన సమాజానికి

28.10.2013 Activity.
- : స్పూర్తి:- 
మొదటి సంపాదన సమాజ కార్యానికి  సమర్పణ 
 విద్యార్థుల వికాసంకోసం-విద్యార్థుల భాగసామ్యంతో నిర్మితుమవుతున్న జ్ఞానసరస్వతి దేవాలయ నిర్మాణ విదానానికి ప్రభావితుడై  జ్ఞానసరస్వతి దేవాలయ అభివ్రుద్ది పనులకు  తన మొదటి నెల జీతాన్ని సమర్పించుకున్న యాలాల కృష్ణార్ డ్డి.  
గత 6సం ! రాల నుండి దేవాలయం స్పూర్తికేంద్రంగా, జ్ఞానసరస్వతి ఫౌండేషన్ నిర్వహిస్తున్న   కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొంటూ...........   గత సంవత్సరం నవరాత్రులలో దేవాలయాన్ని దర్షించుకుని అమ్మవారికి మొక్కుకున్న కారనంగా - అమ్మవారి అనుగ్రహంతో తనకు  సిండికేట్ బ్యాంకులో  ఉద్యోగం వచ్హినందుకు తన మొదటి నెల జీతాన్ని (16000/-) అమ్మవారికి సమర్పిచుకున్న కరీం నగర్  జిల్లా, సిర్సిల్ల మండలం  బసవాపురం గ్రామస్తుడు  యాలాల తిరుపతిరెడ్డి కుమారుడు  యలాల కృష్ణారెడ్డి తన సోదరుడు మరియు మిత్రబృందంతో కలిసి జ్ఞానసరస్వతి దేవాలయంలో పూజ నిర్వహించి 
ఆలయ ఫౌండర్& మేనెజింగ్ ట్రస్టీ   సదావెంకట్రెడ్డికి సమర్పించాడు .
కార్యక్రమంలో ఆలయ నిర్వహణ మండలి సబ్యుడు రామనాథం , సలహామండలి సబ్యుడు ఇడుకుల్ల యాదయ్య , పూజారి రాఘవేందర్  మరియు   సేవాదల్ సబ్యులు .. శివ,మహెందర్, శివకుమర్, నిఖిల్ తదితరులు  పాల్గొని దాతలకు అభినందనలు తెలుపుతూ
 సన్మానించడం జరిగింది.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0aMgacybj1rqC1vkY9u5nkGDiXTgBomC2MteHtdpx7C9tuxEXqSKcsgqN2n5k74aml&id=100006723364953&mibextid=Nif5oz

Tuesday, 24 October 2023

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు _2023 సంపూర్ణం.

శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు _2023 సంపూర్ణం.
అందరికీ శుభాాంక్షలు💐, శుభాభినoదనలు.

ఆలయంలో గత పుష్కర కాలంగా నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి అనుగ్రహంతో, పూజ్యశ్రీ విద్యారణ్య స్వామీజీ ఆశీస్సులతో  ప్రతీ సంవత్సరం కొత్త ఉత్సాహంతో జరుగుతున్నాయి.

ఈ ఉత్సవాలకు తమ సమయ సమర్పణ ద్వారా ఉత్సవ సమితి_2023 లోని  వివిధ మండలీల సభ్యులకు శుభాభినందనలు.

ప్రతీ మూడేళ్లకు అమ్మవారు మనకు కొత్త శక్తినిచ్చి, కొత్త బాధ్యతలు అప్పజెప్పుతుంది.
2022లో పుష్కర బ్రహ్మోత్సవాలు పూర్తయిన సందర్బంగా ఆలయ ఉత్సవాలను సామాజికంగా, సామూహికంగా నిర్వహించాలనే ఆదేశం అందినట్టు అనిపించింది.  అమ్మవారి నిత్య పూజలతో పాటు ఈ సంవత్సరం విశేష కార్యక్రమాలు @ సామూహిక లలితా పారాయణం, చండీ హోమంతో పాటు విద్యా సంస్థలకు అందించే అమ్మవారి విగ్రహాల పూజ, సామూహిక బతుకమ్మ, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలచే  మైసాసురవధ (విగ్రహ  నిమజ్జనo)తో పాటు విశేష ఆయుధ పూజ, సంకల్ప ద్వజావిష్కరణ, పెద్దల సందేశాలు వంటి ఉత్సవాలు ఘనంగా చేసుకున్నాం.

ఈ ఉత్సవాలలో బాగస్తులై వ్యవస్థలో పాల్గొన్న వారికి, ఆర్థిక సహకారం అంచించిన వారికి,  గత పుష్కర కాలంగా అందిస్తున్న సహకారం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సహకారం అందించిన నందినాథ క్షేత్ర         గ్రామ పంచాయతి అధికారులకు, సిబ్బందికి శుభాభినందనలు.
ఈ ఉత్సవాలలో పాల్గొన్న  వివిధ గ్రామాల భజన మండలీలకు, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు, సేవాతత్పరులందరికీ  శుభాకాంక్షలు💐 శుభాభినందనలు.

అమ్మవారి ప్రసాదంగా చీరల వేలంలో పాల్గొని, ఉత్సవాలు ఘనంగా  నిర్వహణ జరగడంలో భాగస్తులయిన చీరల వేలం పాట భాగస్తులకు శుభాకాంక్షలు💐.

తమ అక్షర చైతన్యం ద్వారా ఆలయంలో జరిగే కార్యక్రమాలను సమాజానికి తెలియ పరిచిన పాత్రికేయ మిత్రులకు, అవసరం రీత్యా  తమ సహకారాలు అందించిన పోలీసు శాఖవారికి, విద్యుత్ శాఖవారికి  శుభాభినందనలు.

వచ్చే సవత్సవం జరిగే ఉత్సవాల నిర్వహణకు మరింత శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటూ🙏🏼🙏🏼..

భవదీయ.
సదా వెంకట్,
Founder & Managing trustee,
:~ జ్ఞానసరస్వతి సంస్థాన్ & జ్ఞానసరస్వతి సేవాసమితి.

Saturday, 14 October 2023

బతుకమ్మ సంబరాలు -2023.

అందరికీ  *ఎంగిలి పువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు*..

*బతుకమ్మ ఉత్సవాలు సాంప్రదాయ బద్దంగా, సంబరంగా జరగాలని ఆశిద్దాం.*

సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. 
నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. 
ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలతో నిండిపోయుంటుంది.
ఈ పండుగలలో ఒకటి 'బతుకమ్మ పండుగ', మరొకటి దసరా (విజయ దశమి). అయితే *బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ.*తెలంగాణ సాంస్కృతిక ప్రతీక.*

రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు అనే పాటలను పాడతారు. *బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ..* 
 ఇలా దేని ప్రత్యేకత దానిదే.. 
తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. *బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం అన్ని కలగలిపి పాటల్లో చూపుతారు.  గత వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు*. 
*ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు. ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు*. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా *పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.*
 *"బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో" పాటల వెనుక ఉండే మర్మం ఇదే.*

ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు (షిత్పొలా పండ్లు అంటారు) కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాని ఆపిల్ అంటారనేది తెలిసినదే. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు

*తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు.* 
############
✓ బతుకమ్మతో యావత్ తెలంగాణ చైతన్య జరిగింది..జరుగుతున్నది.
కానీ ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నది, ఆవేదన చెందుతున్న విషయం ఒకటున్నది...
మన సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడేలా సాగిన *బతుకమ్మ పాటలు, ఆటలు ఇప్పుడు కొన్ని కొత్త పుంతలు తొక్కుతూ... సినిమా పాటలు,DJ డాన్సుల వైపు పోతున్నవని... ఇది మారాలనే ఆశ, ఆరాటం అందరికీ ఉన్నది. ఆ దిశగా అడుగులు వేస్తూ, ఆచరణలో చూపాలని ప్రయత్నంలో చక్కని బతుకమ్మ పాటలతో   సామూహిక బతుకమ్మ నిర్వహణకు సేవా సమితి నిర్ణయించింది.* 
*శ్రుతిలయ కళా బృందం వారిచే, అద్భుత బతుకమ్మ పాటలతో 18.10.2023 రోజున సామూహిక బతుకమ్మ ఉత్సవం జరుగుతున్నది*.

###############
 ✓ *ఈ బతుకమ్మ ఉత్సవానికి తెలంగాణ ఉద్యమంలో తన వాక్చాతుర్యంతో,  నిబద్దత గల తెలంగాణవాదిగా, ప్రచార  మాధ్యమాల ద్వారా ఊరూరా బతుకమ్మ సంబరాలు జరిపిన తెలంగాణ పోరుబిడ్డ... ఇప్పటికీ అంతే స్ఫూర్తితో తెలంగాణ గొoతుకై పోరు సలుపుతున్న తెలంగాణ ఆడబిడ్డ శ్రీమతి. రాణి రుద్రమా దేవి అతిథిగా విచ్చేస్తున్నారు.*
సాగతిద్దాం.
:~ సదా వెంకట్,
*జ్ఞానసరస్వతి సంస్థాన్ & జ్ఞాన సరస్వతి సేవాసమితి*.

Thursday, 12 October 2023

సామూహిక లలితా సహస్ర నామ పారాయణం మరియు అన్నపూజా మహోత్సవం @ శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.

*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*

మాతృశక్తికి సాధన ఆహ్వానం

శ్రీశ్రీశ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు -2023

విశేష కార్యక్రమంగా సామూహిక లలితా సహస్రనామ పారాయణం మరియు అన్నపూజ  మహోత్సవం.
తేదీ.17.10.2023, మంగళవారం, ఉ 11 గం.ల నుండి...

లలితా సహస్రనామం ప్రత్యేకత!
  
ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని జవాబిస్తారు ఆస్తికులు. మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి కదా! అందుకనే *సృష్టికి మాతృ స్వరూపంగా లలితా అమ్మవారిని భావిస్తారు*. 
*ఆ అమ్మవారి మహత్తుని తలచుకునేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామం ఒక గొప్ప సాధనంగా ఎంచుతారు.* నవరాత్రుల సందర్భంగా ఆ లలితా సహస్రనామానికి చెందిన ప్రత్యేకతలు కొన్ని...

- అమ్మవారిని లలితాత్రిపురసుందరిగా పేర్కొంటారు. త్రిపురసుందరి అంటే ముల్లోకాలలలోనూ అందంగా ఉండేది అని అర్థం. 
కానీ త్రిపుర అనే మాటను మూడు కాలాలకు, మూడు స్థితులకు, మూడు శక్తులకూ ప్రతీకగా పేర్కొనవచ్చు. ఉత్తరాదిన ఈ అమ్మవారి ఆరాధన చాలా ప్రముఖంగా ఉండేది. అక్కడి *‘త్రిపుర’ రాష్ట్రానికి అమ్మవారి మీదుగానే ఆ పేరు పెట్టారు.*

- లలితాసహస్రనామం ఆరంభంలోనే ‘ఓం శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ’ అనే నామాలు పలకరిస్తాయి. ఈ మూడు నామాలూ కూడా సృష్టిస్థితిలయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. ఆపై అమ్మవారి వర్ణన, చరిత్ర, మహత్తు అన్నీ క్రమంగా సాగుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం. ఒక నామం నుంచి మరో నామం ఒక సూత్రంలాగా సాగిపోతుంటాయి.

- చాలా సహస్రనామాలలో పునరుక్తి కనిపిస్తుంది. లలితలో ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషం అంటారు. అంతేకాదు! మరియు, ఇంకా లాంటి ఊతపదాలు కూడా ఇందులో ఉండవు. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యాకరణపరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు.

- లలితాసహస్రంలో భండాసుర వధ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. శివుని తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో, మన్మధుడు కాలిబూడిదైపోయిన కథ తెలిసిందే! ఆ భస్మం నుంచి వెలువడినవాడే భండాసురుడు. ముల్లోకాల మీదా యుద్ధాన్ని ప్రకటించి వణికించిన ఆ భండాసురుడు అమ్మవారి చేతిలో హతం కాక తప్పలేదు. మన్మధుని అవశేషం అయిన భండాసురుని ఇహపరమైన కోరికలకు ప్రతీకగా భావించవచ్చు. అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరికను జయించి మోక్షాన్ని సాధించగలమన ఈ స్తోత్రం గుర్తుచేస్తోంది.

- *లలితాసహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానమ్‌, అంగన్యాసమ్‌, కరన్యాసమ్‌, పంచపూజ, ఉత్తరభాగాలను కూడా చదువుతారు. కుదరని పక్షంగా కేవలం సహస్రనామస్తోత్రం వరకూ పఠించినా సరిపోతుంది*. 
ఇక హోమంగానూ, అర్చనగానూ, పారాయణగానూ భక్తులు తమ అభీష్టాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని పఠించగలగడం మరో ప్రత్యేకత.

- సాధారణంగా ఏదన్నా సహస్రనామంలో ఒకేతరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ లలితాసహస్రంలో సగుణ ఆరాధన, నిర్గుణ ఆరాధన, త్రిమూర్తుల ఉపాసన, కుండలినీ జాగృతి... ఇలా అన్ని రకాల మార్గాలూ కనిపిస్తాయి.

- *అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలను పఠించేవారట*. ఆ నామాలను హయగ్రీవుడు, అగస్త్యునికి బోధించగా.... వాటిని వ్యాసుడు బ్రహ్మాండపురాణంలో పొందుపరిచాడు. వ్యాసుని మనం ఆదిగురువుగా భావిస్తాము. ఇక విష్ణుమూర్తికి జ్ఞానస్వరూపమే హయగ్రీవుడు. తమిళురు అగస్త్యుని తొలిసిద్ధునిగా ఆరాధిస్తారు. మరి వీరికే ఆరాధ్యనీయమైన ఈ స్తోత్రం, సామాన్యులకెంత మేలు చేస్తుందో కదా!

- లలిత సహస్రనామం చివరలో ‘శ్రీలలితా రహస్యనామసాహస్ర స్తోత్ర’మని పేర్కొంటారు. అంటే ఇది అర్హులైనవారికి చెప్పాలన్న అర్థం వస్తుంది. ఇందులో పారమార్థికమైన గూఢార్థాలు చాలా ఉన్నాయని మరో అర్థమూ వస్తుంది. *సాధకులకు, ఉపాసకులకు జ్ఞానమార్గాన్ని సూచించే అనేకమైన రహస్యాలు ఇందులో ఉన్నాయని అంటారు.* అమ్మవారి బీజాక్షరాలు, సృస్టిరహస్యాలు, అష్టవిధులు, దశమహావిద్యలకు సంబంధించిన జ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉందని ప్రతీతి.

ఎంత చెప్పుకొన్నా లలిత సహస్రనామా ప్రత్యేకత అంతకంతా మిగిలే ఉంటుంది. ఆ ప్రత్యేకత తెలిసినా తెలియకున్నా... ఆ నామాలను శ్రద్ధగా పఠించినా, విన్నా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది.

సామాన్యులు కూడా అమ్మవారి అనుగ్రహం కోసం లలితా సహస్రనామ పారాయణం చేసే విధంగా *శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం ద్వారా శ్రీ విద్యారణ్య స్వామీజీ ఆశీసులతో, ప్రతీ శుక్రవారం సామూహిక పారాయణం Online లో జరుగుతూ 140 వారాలు పూర్తి చేసుకున్నది.*
*అదేవిధంగా చిన్నారులకు కూడా పారాయణం నేర్పించి, సామూహిక పారాయణం జరుగుతున్నది.*
ఆ స్ఫూర్తితో అత్యంత శక్తివంతమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో అందరూ   ప్రత్యక్షంగా సామూహిక లలితా సహస్ర నామ పారాయణం చదవాలనే ఉద్దేశ్యంతో *17.10.2023 రోజున కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఆలయ పరిసర ప్రాంతాలు, భాగ్యనగర్ నుండి సుమారు 516 మంది మాతృ మూర్తులు ఈ పారాయణంలో  పాల్గొనాలి అనే సంకల్పంతో ప్రయత్నం జరిగింది.*  అందుకు తగిన విధంగా ఏర్పాట్లలో ఆలయ సేవా సమితి, మాతృ మండలి నిమగ్నమై ఉన్నది.
ఈ కార్యక్రమానికి మనందరికీ సుపరిచి తురాలైన  *ప్రముఖ సామాజిక,
 ఆధ్యాత్మిక వేత్త శ్రీమతి. భారతీయo సత్యవాణి గారు అతిథిగా పాల్గొని సందేశం ఉంటుంది. 
*అన్నపూజ*:  అన్నo పరబ్రహ్మ స్వరూపం అనేది మనందరికీ తెలిసిన విషయమే..
ఆ విశేషతను ఆచచర దిశగా సాగుతూ ఆలయం ద్వారా గత కొంత కాలంగా *రోజు పిడికెడు బియ్యం*  ఆనే నినాదంతో మాతృమూర్తుల ద్వారా బియ్యం సేకరణ జరిగి అన్నపూజ రోజున ఆలయంలో అందిస్తారు.
అలా సేకరణ జరిగిన బియ్యం అన్న ప్రసాదానికి, అవసరారద్దుల సేవకై అందించబడుతున్నాయి. 
కావున అవకాశం ఉన్న మాతృమూర్తులు, చిన్నారులు ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.

భవదీయ.
:~ సదా వెంకట్.
~: *జ్ఞానసరస్వతి సంస్థాన్ & *జ్ఞాన సరస్వతి సేవాసమితి*





సినీ రచయిత @ GS Temple

చదువుల తల్లి, వాగ్దేవి  శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ నిర్మాణానికి  సంకల్పం, నిర్మాణ విధానం  తెలుసుకొని ఆశ్చర్య ఆనందాన్ని వ్యక్తం చేసిన  Dr.Bharavi garu, (Cine Director & Story Writer),
వారితో పాటు ఆలయాన్ని దర్శించుకున్న ప్రముఖ సినీ గేయ రచయిత Dr. Venigalla Rambabu garu, సీనియర్ జర్నలిస్టు శ్రీ తిరునగరి శ్రీనివాస్ గార్లు..
విద్యార్థుల వికాసం కోసం - విద్యార్థుల భాగస్వామ్యంతో 2009 లో నిర్మించబడిన శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయ నిర్మాణం మరియు సంకల్పం గురించి తెలుసుకొని ఒకింత సంభ్రమాశ్చర్యాలకు లోనై  దేవాలయం గురించి వారి మాటలలో....

అక్షయమయిన అక్షరజ్ఞానం విద్యార్థులకు అందిస్తూ వారి విద్యాభివృద్ధికి మరియు మానసిక వికాసానికి దోహదపడే నిర్మానాత్మక కార్యక్రమాల నిర్వహణకు స్ఫూర్తి కేంద్రం గా నిలుస్తూ ..

నందివనపర్తి గ్రామంలో కేవలం పాఠశాల స్థాయి విద్యార్తుల విరాళాల తో 2009 లో అమ్మవారి మూలవిగ్రహ ప్రతిష్ట, కళాశాల స్థాయి విద్యార్థుల విరాళాలతో 2015 లో ధ్వజస్తంభం ప్రతిష్ట, అమ్మవారి అలంకరణ ఆభరణాలు వెండి వీణ, వెండి కిరీటం, కర్ణములు.. మొదలైన ఆభరణాలు పూర్తి చేయడం అనే సంకల్పానికి నమస్కరిస్తూ   
ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ పని చేస్తున్న సంస్థలు లేవని ఈ సంకల్పాన్ని తమ movies ద్వారా ప్రపంచానికి తెలియచేస్తాం అన్నారు..
గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు సరస్వతి విగ్రహాలు అందించడం మహా గొప్ప విషయం.

అన్ని స్థాయిల విద్యాసంస్థలలో సరస్వతి మాత విగ్రహాలు ఉండాలి అని సంకల్పించి జ్ఞానసరస్వతి సేవాసమితి ద్వారా జరుగుతున్న నిరంతర  విద్యా మహాయజ్ఞానికి తమ వంతుగా సహకరిస్తాం..
అందరూ సహకరించి ఒక మహా కార్యంలో బాగస్టులు కావాలి  అన్నారు..

Saturday, 7 October 2023

సంకల్ప భవన్ @ 2017

Post of 08.10.2017
ఆలయం చిన్నదే .. ఆశయం గొప్పది..
అక్షర స్వీకారం  చేయించిన/ చేసిన నాడే  జీవిత ఎదుగుదలకు మనస్పూర్తిగా సంకల్పం జరగాలి.. ఆ సంకల్పమే ఆ చిన్నారి ఎదుగుదలకు  మహా సంకల్పం కావాలి.
అంతరాలు లేని అమ్మ సరస్వతి  అనుగ్రహం అతి సామాన్యునికీ అందాలి. అందరు ఉన్నతంగా  ఎదగాలి. ఉన్నంతలో కొంత సమాజహితం కోసం సమర్పణ జరగాలి.... అందుకు చిన్ననాడే, ఆ పసి మస్యిష్కాలల్లో భీజం నాటాలి. అందుకు అమ్మఒడి తొలి వేదిక అయితే గుడి మెట్లు ఆ వేదికకు వెడుకకగా నిలవాలి...  అప్పుడే ఆ చిన్నారి సంస్కారవంతమైన వ్యక్తిగా ఎదిగి సమాజంలో నిలకడగా ఉండగలడు.. 
  అలాంటి మార్పును కాంక్షిస్తూ విద్యార్థుల వికాసం కోసం నిర్మితమవుతున్న జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి "సంకల్ప్ సదన్"  నిర్మాణానికి సంకల్పించింది....  
మా హమే శక్తి దే...
"సంకల్ప్ సదన్" నిర్మాణ్ నిర్మాణాత్మక్ బనానేకా,  బచ్చే అక్షర్ స్వీకర్ కర్తేహి సంకల్ప్ లేనా హై కీ జీవన్ సాకార్ కర్నేకా.. 
అక్షర్ స్వీకార్ కే సాతీ సంస్కార్ సహిత్ జీవన్ గతీ పానేకా.. సంకల్ప్ సదన్ మే సంకల్ప్ సాకార్ హోనేకా.
మా హైసా శక్తి హమే దే.

Thursday, 5 October 2023

శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు _2023.

ఆహ్వానం !!

శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు _2023.                        

(ఆశ్వీయుజ పాడ్యమి 15.10.2023 నుండి 23.10.2023 వరకు) @ శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.