కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న చదువుల తల్లికి హృదయ నీరాజనం..
కొలన్ గూడ వాస్తవ్యులు కీ.శే మల్లేష్ గారి కుమారుడు శ్రీమతి
జంగమ్మ (నందివనపర్తి ఆడబిడ్డ, కీ.శే ముద్దo రాములు గారి కుమార్తె) గారి తనయుడు శ్రీ వేల్పుల నిశాంత్ కుమార్ గారు కానిస్టేబుల్ గా 6 సం. క్రితం ఉద్యోగం పొందారు. ఉద్యోగ ప్రయత్నంలో అమ్మవారికి మొక్కుకున్న సందర్భంగా, తాను అందుకున్న మొదటి వేతనాన్ని ముడుపుగా భద్రపరిచి నేడు @ 22.06.2026 రోజున వారి కుటుంబ సభ్యులతో కలిసి తన మొదటి నెల వేతనాన్ని ఆలయ అభివృద్ధి కోసం సేవాసమితి సభ్యులకు అందజేయడం జరిగింది.
డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం రావాలని కోరుకున్న వెంటనే అమ్మవారి అనుగ్రహంతో కానిస్టేబుల్ గా ఉద్యోగం పొందాను. అందుకే నా మొదటి వేతనాన్ని దేవాలయ అభివృద్ధికి అందించాలని అమ్మవారి మొక్కు తీర్చుకుంటూ *6 సంవత్సరాల ముందు నా వేతనం 28,000/-.. ఆ డబ్బులకు కొంత మొత్తం కలిపి ప్రస్తుతం నాకు అందుతున్న 38,600/- రూ. ను ఆలయ అభివృద్ధికి అందజేస్తున్నాను* అని తెలిపారు.
____________________~___________~___
పట్టుదలతో చదివి, అమ్మవారి అనుగ్రహం తోడై ఉద్యోగం పొంది కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్ధతుతో ఉదారంగా, వినమ్రతతో తన మొదటి నెల వేతనాన్ని అమ్మవారి ఆలయానికి సమర్పించిన వేల్పుల నిశాంత్ కుమార్ గారికి జ్ఞానసరస్వతి సంస్థాన్ తరపున శుభాభినందనలు ..
నిశాంత్ గారు జీవితంలో మరింత ఉన్నతస్థాయికి ఎదిగి కీర్తిమంతుడు కావాలని ఆశిద్దాం .. ఆశీర్వదిద్దాం..