Sunday, 13 October 2024

బాల సేవక మండలి.

ఙ్ఞానసరస్వతి దేవాలయ *బాల సేవకమండలికి శుభాశీస్సులు*...
 శ్రీశ్రీశ్రీ దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు -2024.

 ఉత్సవాల సందర్భంగా దసరా సెలవులు మొత్తం ఆలయ సేవలో నిమగ్న మయ్యారు...
*తీసుకున్న బాధ్యతను నిండు మనసుతో చేస్తూ మిగతా మండలీలతో పోటా పోటీగా సేవలో పాల్గొన్నారు*.. 
సెలవులన్నీ అమ్మవారి సేవలో గడపిన చిన్నారులకు అందరం ఆశీస్సులు అందిద్దాం.

శరన్నవరాత్రి ఉత్సవాలు - 2024 సంపూర్ణం.

శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.*
*దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు _2024 సంపూర్ణం.*

*అందరికీ శుభాకాంక్షలు,💐, శుభాభినoదనలు.*

*ఆలయంలో గత పుష్కర కాలంగా నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి అనుగ్రహంతో, పూజ్యశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ దివ్య  ఆశీస్సులతో  ప్రతీ సంవత్సరం కొత్త ఉత్సాహంతో జరుగుతున్నాయి.*

*ఈ ఉత్సవాలకు తమ సమయ సమర్పణ ద్వారా ఉత్సవాలను దిగ్విజయం చేసిన, శరన్నవరాత్రి ఉత్సవ మండలి_2024 లోని  వివిధ మండలీల సభ్యులకు శుభాభినందనలు.*

*ప్రతీ మూడేళ్లకు అమ్మవారు మనకు కొత్త శక్తినిచ్చి, కొత్త బాధ్యతలు అప్పజెప్పుతుంది.*

*2022లో పుష్కర బ్రహ్మోత్సవాలు పూర్తయిన సందర్బంగా ఆలయ ఉత్సవాలను సామాజికంగా, సామూహికంగా నిర్వహించాలనే ఆదేశం అందినట్టు అనిపించింది.  అమ్మవారి నిత్య పూజలతో పాటు ఈ సంవత్సరం విశేష కార్యక్రమాలు @ *అన్నపూజ, సామూహిక లలితా పారాయణం, చండీ హోమంతో  పాటు, సామూహిక బతుకమ్మ,   సంకల్ప ద్వజావిష్కరణ, విశేష ఆయుధ పూజ, డ్రగ్స్ నిర్మూలన కోసం సంకల్పం చేసి మైసాసుర మర్ధిని ద్వారా రాక్షస దహనం*, పెద్దల సందేశాలు వంటి ఉత్సవాలు ఘనంగా చేసుకున్నాం. 
గత సంవత్సరoలో వివిధ పర్వదినాలలో అమ్మవారికి  అలంకరించిన చీరల వేలం (వాటి ద్వారానే ఇక్కడ ఉత్సవాలు నిర్వహించ బాడుతాయి)

*ఈ ఉత్సవాలలో బాగస్తులై, వ్యవస్థలో పాల్గొన్న వారికి, ఆర్థిక సహకారం అంచించిన వారికి, గత పుష్కర కాలంగా అందిస్తున్న సహకారం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సహకారం అందించిన నందినాథ క్షేత్ర         గ్రామ పంచాయతి అధికారులకు, సిబ్బందికి ఆలయం తరపున శుభాభినందనలు*. ధన్యవాదాలు.
*ఈ ఉత్సవాలలో పాల్గొన్న  వివిధ గ్రామాల భజన మండలీలకు, లలితా పారాయణ  మాతృ మండలి బృందాలకు, సేవాతత్పరులందరికీ  శుభాకాంక్షలు💐 శుభాభినందనలు.*

*తొమ్మిది రోజుల పాటు నిర్విరామంగా నిర్వహించిన బతుకమ్మ, దాండియా కార్యక్రమాల నిర్వహించిన యువజన విభాగం, సాంస్కృతిక విభాగం వారికి శుభాబినందనలు.*

*అమ్మవారి ప్రసాదంగా చీరల వేలంలో పాల్గొని, ఉత్సవాలు ఘనంగా  నిర్వహణ జరగడంలో భాగస్తులయిన చీరల వేలం పాట భాగస్తులకు శుభాకాంక్షలు💐*.

*తమ అక్షర చైతన్యం ద్వారా ఆలయంలో జరిగే కార్యక్రమాలను సమాజానికి తెలియ పరిచిన పాత్రికేయ మిత్రులకు, అవసరం రీత్యా  తమ సహకారాలు అందించిన పోలీసు శాఖవారికి, విద్యుత్ శాఖవారికి  శుభాభినందనలు.*

*వచ్చే సవత్సవం జరిగే ఉత్సవాల నిర్వహణకు మరింత శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటూ🙏🏼🙏🏼*..

భవదీయ.
సదా వెంకట్,
Founder & Managing trustee,
:~ జ్ఞానసరస్వతి సంస్థాన్ & జ్ఞానసరస్వతి సేవాసమితి.

Saturday, 12 October 2024

ఆయుధ పూజ - 2024

రాక్షసులను సంహరించడానికి  దేవతా మూర్తులు చేబూనిన ఆయుధాలతో పాటు అజ్ఞానాన్ని తరిమి, జ్ఞానాన్ని ప్రసాదించే  జ్ఞానజ్యోతి ఆయుధమే....
నిరుపేదల కడుపు నింపి, వారికి జీవనాన్ని అందించే ప్రతీ పనిముట్టూ ఆయుధమే....
అందుకే వాటిని గౌరవంగా, గర్వంగా పూజనీయ భావనతో పూజించడం నేర్పిన పెద్దలకు ప్రణామాలు...
ఆశ్వీయుజ మాసం మహర్నవమి రోజున అన్ని తరాల వారి ఆయుధాలను, అన్ని రకాల వృత్తుల పనిముట్లను గౌరవంగా పూజిస్తూ ఆయుధ పూజ చేసే ఆనవాయితీ Gnana Saraswathi Temple Nandiwanaparthy 
 జ్ఞానసరస్వతిదేవాలయంలో  కొనసాగుతుంది.

Thursday, 3 October 2024

అమ్మవారి ధీక్ష

ఎంత గొప్ప ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని మనందరికీ తెలుసు..
 అలాగే ప్రారంభమయ్యే ప్రతీ కొత్త పని అనుమానాలు, అవమానాలతో మొదలై చివరకు అభినందనలతో  కొనసాగుతుంది. 
 గత ఏడాది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొంత మంది అనుకొన్నారు... 
వచ్చేసారి నుండి జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా అమ్మవారి దీక్ష తీసుకోవాలి అని.. 
ఇదో ఆ వచ్చే సంవత్సరం రానే వచ్చింది. అనుకున్న ప్రకారంగా కొద్ది మందితో ప్రారంభమైన అమ్మవారి ధీక్ష... 
ఆలయం ద్వారా జరుగుతున్న ఇతర కార్యక్రమాలు, ఉత్సవాలకు అనుగ్రహించిన అమ్మవారు...
 ఈ ధీక్షాదారులను కూడా అనుగ్రహించమని ప్రార్ధిద్దాం..