Sunday, 13 October 2024

శరన్నవరాత్రి ఉత్సవాలు - 2024 సంపూర్ణం.

శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.*
*దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు _2024 సంపూర్ణం.*

*అందరికీ శుభాకాంక్షలు,💐, శుభాభినoదనలు.*

*ఆలయంలో గత పుష్కర కాలంగా నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి అనుగ్రహంతో, పూజ్యశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ దివ్య  ఆశీస్సులతో  ప్రతీ సంవత్సరం కొత్త ఉత్సాహంతో జరుగుతున్నాయి.*

*ఈ ఉత్సవాలకు తమ సమయ సమర్పణ ద్వారా ఉత్సవాలను దిగ్విజయం చేసిన, శరన్నవరాత్రి ఉత్సవ మండలి_2024 లోని  వివిధ మండలీల సభ్యులకు శుభాభినందనలు.*

*ప్రతీ మూడేళ్లకు అమ్మవారు మనకు కొత్త శక్తినిచ్చి, కొత్త బాధ్యతలు అప్పజెప్పుతుంది.*

*2022లో పుష్కర బ్రహ్మోత్సవాలు పూర్తయిన సందర్బంగా ఆలయ ఉత్సవాలను సామాజికంగా, సామూహికంగా నిర్వహించాలనే ఆదేశం అందినట్టు అనిపించింది.  అమ్మవారి నిత్య పూజలతో పాటు ఈ సంవత్సరం విశేష కార్యక్రమాలు @ *అన్నపూజ, సామూహిక లలితా పారాయణం, చండీ హోమంతో  పాటు, సామూహిక బతుకమ్మ,   సంకల్ప ద్వజావిష్కరణ, విశేష ఆయుధ పూజ, డ్రగ్స్ నిర్మూలన కోసం సంకల్పం చేసి మైసాసుర మర్ధిని ద్వారా రాక్షస దహనం*, పెద్దల సందేశాలు వంటి ఉత్సవాలు ఘనంగా చేసుకున్నాం. 
గత సంవత్సరoలో వివిధ పర్వదినాలలో అమ్మవారికి  అలంకరించిన చీరల వేలం (వాటి ద్వారానే ఇక్కడ ఉత్సవాలు నిర్వహించ బాడుతాయి)

*ఈ ఉత్సవాలలో బాగస్తులై, వ్యవస్థలో పాల్గొన్న వారికి, ఆర్థిక సహకారం అంచించిన వారికి, గత పుష్కర కాలంగా అందిస్తున్న సహకారం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సహకారం అందించిన నందినాథ క్షేత్ర         గ్రామ పంచాయతి అధికారులకు, సిబ్బందికి ఆలయం తరపున శుభాభినందనలు*. ధన్యవాదాలు.
*ఈ ఉత్సవాలలో పాల్గొన్న  వివిధ గ్రామాల భజన మండలీలకు, లలితా పారాయణ  మాతృ మండలి బృందాలకు, సేవాతత్పరులందరికీ  శుభాకాంక్షలు💐 శుభాభినందనలు.*

*తొమ్మిది రోజుల పాటు నిర్విరామంగా నిర్వహించిన బతుకమ్మ, దాండియా కార్యక్రమాల నిర్వహించిన యువజన విభాగం, సాంస్కృతిక విభాగం వారికి శుభాబినందనలు.*

*అమ్మవారి ప్రసాదంగా చీరల వేలంలో పాల్గొని, ఉత్సవాలు ఘనంగా  నిర్వహణ జరగడంలో భాగస్తులయిన చీరల వేలం పాట భాగస్తులకు శుభాకాంక్షలు💐*.

*తమ అక్షర చైతన్యం ద్వారా ఆలయంలో జరిగే కార్యక్రమాలను సమాజానికి తెలియ పరిచిన పాత్రికేయ మిత్రులకు, అవసరం రీత్యా  తమ సహకారాలు అందించిన పోలీసు శాఖవారికి, విద్యుత్ శాఖవారికి  శుభాభినందనలు.*

*వచ్చే సవత్సవం జరిగే ఉత్సవాల నిర్వహణకు మరింత శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటూ🙏🏼🙏🏼*..

భవదీయ.
సదా వెంకట్,
Founder & Managing trustee,
:~ జ్ఞానసరస్వతి సంస్థాన్ & జ్ఞానసరస్వతి సేవాసమితి.

No comments:

Post a Comment