Monday, 6 October 2025

ఆలయానికి మొదటి వేతనం

కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న  చదువులతల్లికి హృదయ నీరాజనం..  
ఆరుట్ల వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ తాడూరి భార్గవి వెంకట్ రెడ్డి (గౌతమి విద్యాలయం, నందివనపర్తి) గార్ల కుమార్తె తేజస్వి గారు QUADYSTER (United States Of America) లో Software Engineer గా ఉద్యోగం పొందారు. ఉద్యోగం రాగానే తేజస్వి గారు వారి కుటుంబ సభ్యుల ద్వారా తన మొదటి నెల వేతనం నుండి 1,01,116/- ఆలయ అభివృద్ధి కోసం సేవాసమితి సభ్యులకు అందజేయడం జరిగింది.

M.S, USA లో పూర్తయ్యాక ఉద్యోగం రావాలని కోరుకున్న వెంటనే అమ్మవారి అనుగ్రహంతో ఉద్యోగం పొందాను. అందుకే నా మొదటి వేతనం నుండి 1,01,116/- ను దేవాలయ అభివృద్ధికి అందించాలని మా  తల్లిదండ్రుల ద్వారా అమ్మవారి మొక్కు తీర్చుకుంటూ హృదయపూర్వకంగా సమర్పిస్తున్నాను.
కృషి, పట్టుదలతో  చదివి అమ్మవారి అనుగ్రహం తోడై ఉద్యోగం పొంది కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్ధతుతో ఉదారంగా, వినమ్రతతో తన మొదటి వేతనం నుండి కొంత భాగాన్ని అమ్మవారి ఆలయానికి సమర్పించిన తేజస్వి గారికి జ్ఞానసరస్వతి సంస్థాన్ తరపున శుభాభినందనలు ..  
తేజస్వి గారు జీవితంలో ఇంకా ఉన్నతస్థాయికి ఎదగాలని కావాలని అందరం ఆశిద్దాం .. ఆశీర్వదిద్దాం..
జ్ఞానసరస్వతి సంస్థాన్

No comments:

Post a Comment