చదువుల తల్లి, వాగ్దేవి శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ నిర్మాణానికి సంకల్పం, నిర్మాణ విధానం తెలుసుకొని ఆశ్చర్య ఆనందాన్ని వ్యక్తం చేసిన Dr.Bharavi garu, (Cine Director & Story Writer),
వారితో పాటు ఆలయాన్ని దర్శించుకున్న ప్రముఖ సినీ గేయ రచయిత Dr. Venigalla Rambabu garu, సీనియర్ జర్నలిస్టు శ్రీ తిరునగరి శ్రీనివాస్ గార్లు..
విద్యార్థుల వికాసం కోసం - విద్యార్థుల భాగస్వామ్యంతో 2009 లో నిర్మించబడిన శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయ నిర్మాణం మరియు సంకల్పం గురించి తెలుసుకొని ఒకింత సంభ్రమాశ్చర్యాలకు లోనై దేవాలయం గురించి వారి మాటలలో....
అక్షయమయిన అక్షరజ్ఞానం విద్యార్థులకు అందిస్తూ వారి విద్యాభివృద్ధికి మరియు మానసిక వికాసానికి దోహదపడే నిర్మానాత్మక కార్యక్రమాల నిర్వహణకు స్ఫూర్తి కేంద్రం గా నిలుస్తూ ..
నందివనపర్తి గ్రామంలో కేవలం పాఠశాల స్థాయి విద్యార్తుల విరాళాల తో 2009 లో అమ్మవారి మూలవిగ్రహ ప్రతిష్ట, కళాశాల స్థాయి విద్యార్థుల విరాళాలతో 2015 లో ధ్వజస్తంభం ప్రతిష్ట, అమ్మవారి అలంకరణ ఆభరణాలు వెండి వీణ, వెండి కిరీటం, కర్ణములు.. మొదలైన ఆభరణాలు పూర్తి చేయడం అనే సంకల్పానికి నమస్కరిస్తూ
ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ పని చేస్తున్న సంస్థలు లేవని ఈ సంకల్పాన్ని తమ movies ద్వారా ప్రపంచానికి తెలియచేస్తాం అన్నారు..
గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు సరస్వతి విగ్రహాలు అందించడం మహా గొప్ప విషయం.
అన్ని స్థాయిల విద్యాసంస్థలలో సరస్వతి మాత విగ్రహాలు ఉండాలి అని సంకల్పించి జ్ఞానసరస్వతి సేవాసమితి ద్వారా జరుగుతున్న నిరంతర విద్యా మహాయజ్ఞానికి తమ వంతుగా సహకరిస్తాం..
అందరూ సహకరించి ఒక మహా కార్యంలో బాగస్టులు కావాలి అన్నారు..
No comments:
Post a Comment