Friday, 27 September 2024

పాత్రికేయ మిత్రులకు

*యాచారం మండల పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు💐, ప్రత్యేక అభినందనలు*...
*మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే సదాశయ స్పూర్తితో గత 15సం.రాలుగా జ్ఞానసరస్వతి దేవాలయం కేంద్రంగా ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించి బడుతున్నాయి*..

*అలాoటి కార్యక్రమాలను తమ అక్షర చైతన్యం ద్వారా సమాజానికి చేరవేస్తూ మీ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.*
*మరో బాసర నందివనపర్తి, విద్యార్థుల ఆలయం, విద్యార్థి సమేత అని ఇలా అనేక రకాల అద్భుత హేడింగ్ లతో తమ కలం ద్వారా ఆలయ విశేషాలను సమాజానికి చేరవేశారు, చెరవేస్తున్నారు.*

*ఈ ఆలయం నిర్మాణం  ఒక గొప్ప ఆశయంతో, వినూత్న పద్ధతిలో జరిగింది. అదే విధంగా నిర్వహణ కూడా ఒక నిర్ధిష్ట ప్రణాళికతో, నిరంతర క్రతువుగా కొనసాగుతున్న విషయ మీకూ తెలిసిందే.*
*ఆలయంలో అన్ని సేవలు ఇప్పటికీ, ఎప్పటికీ ఉచితంగా అందించ బడుతున్నాయి. ప్రతీ కార్యక్రమ్రం కూడా విశేష పరమార్థంతో నిర్వహించ బడుతున్నది.*

*అలాంటి ఉత్సవాల్లో భాగంగా ప్రతీ సoవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించ బడుతున్నాయి.*
*గత రెండు సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు విశేషంగా జోడించబడి అధ్బుతంగా నిర్వహించ బడుతున్నాయి*.
*అందులో అన్ని వర్గాల వారిని ఆదరిస్తూ @ పిల్లలు, మహిళలు, పెద్దలు, యువకులు, భజన కళాకారులను సమ్మిళితం చేస్తూ ఉత్సవాలు నిర్వహించ బడుతున్నాయి. సందర్భాన్ని బట్టి సమాజంలో పెద్దలను అతిథులుగా ఆహ్వానిoచబడుతారు.*
*దసరా ఉత్సవాలు -2024.*

*ఈ సారి విశేషంగా సుమారు 500 మంది మాతృ శక్తితో సాముహిక బతుకమ్మకు - ఇంటింటి హారతి,డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని పాఠశాల విద్యార్థులు, కళాశాల  యువతతో రాక్షస దహనం వoటి కార్యక్రమాలు నిర్వహించ బడుతున్నాయి*.

కావున *నిరంతర క్రతువుగా  నిస్వార్థ సేవతో జరిగే ఈ  చైతన్య కార్యక్రమాలు ఇతర గ్రామాల వారికి తెలిసే విధంగా, వారికి స్ఫూర్తిని, చైతన్య పరిచే విధంగా తమ అక్షర చైతన్యంతో సమాజానికి తెలపాలని ఆకాంక్షిస్తున్నాను.*

*నవరాత్రి ఉత్సవ వివరాల కరపత్రం,విశేష కార్యక్రమాల వివరాలు మరియు ఇతర సమాచారం GSS ప్రచార మండలి సబ్యులు మీకు అందిస్తారు* సహకరించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
భవదీయ 
సదా వెంకట్,
(B.A., LLB., PGDCJ)
Founder & Managing Trustee,
జ్ఞానసరస్వతి సంస్థాన్ & జ్ఞానసరస్వతి సేవాసమితి.
(శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం).

No comments:

Post a Comment