Sunday, 15 September 2024

సేవా తత్పరులకు స్వాగతం.

*సేవా సత్పరులకు సాదర స్వాగతం*
*మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే సంకల్పంతో నిర్మితమైనది నందివనపర్తిలోని శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం.*

*ఆలయం చిన్నది - ఆశయo గొప్పది అనే సదాశయ స్ఫూర్తితో అనేక ఉత్సవాలు, సేవా కార్యక్రమాలు నిరoతరం నిర్వహించ బడుచున్నాయి.*

అందులో భాగంగా ప్రతీ సంవత్సరం నిర్వహించే *దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది జ్ఞానసరస్వతి సంస్థాన్.*

*ఆలయ నిర్మాణం, నిర్వహణ కోసం ఏర్పాటు చేసుకున్న 145 మంది సభ్యులున్న వివిధ మండలీల నుండి 36మందితో  ^శ్రీ శరన్నవరాత్రి ఉత్సవ మండలి-2024^ ఏర్పాటు చేయబడింది..*
*https://gnanasaraswathitemplenwp.blogspot.com/2024/09/2024.html?m=1*

ఈ మండలి సభ్యులతో పాటు ఆలయంలో జరిగే ఉత్సవం కోసం సేవలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకునే వారినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
వివరాలకు: +919177000412, +918125995250

*దైవ కార్యంలో, ధర్మకార్యంలో అందరు సమానులే, అందరూ సామాన్యులే...ఆచరిద్దాం*

:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్* & *జ్ఞానసరస్వతి సేవా సమితి.*

No comments:

Post a Comment