ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 12 మండలీ సభ్యుల సమావేశం 31.08.2024 రోజున జరిగింది.
మండలీల పటిష్టత కోసం గత రెండు నెలలుగా మండలీల వారిగా సమావేశాలు నిర్వహించుకుని, ఆ మండలి సభ్యుల సంఖ్య, మండలి ద్వారా నిర్వహించే బాధ్యతలు, బాధ్యులు నిర్ణయo
చేసుకోవడం జరిగిoది.
అన్ని మండలీల సంయుక్త సమావేశం Google meet ద్వారా నిర్వహించ బడింది.
ఈ సమావేశంలో గేయ రచయిత, గాయకులు, మంచి వక్త మాన్యశ్రీ అప్పాల ప్రసాద్ గారు కన్వీనర్, సామాజిక సమరసత వేదిక గారు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు.
వారు మాట్లాడుతూ ఈ దేవాలయ నిర్మాణంలో అవలంబిoచిన అంశాలు చిన్న చిన్నవే అయినా అవి సమాజానికి చాలా ప్రేరణాత్మకం, ఆచరణాత్మకo అన్నారు. అలాంటి విషయాలు సమాజం గుర్తించడంలో కొంత ఆలస్యం కావచ్చు, కానీ భవిష్యత్తులో ఒక గొప్ప ఆలయం అవుతుందన్నారు.
ఆలయాలకు వెళ్లి వ్యక్తిగత కోరికలు కోరడం, ఆలయాల నిర్వాహకులలో స్పర్ధలు ఉండడం, అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్న నేటి పరిస్థితుల్లో, ఆలయం ద్వారా ఎన్ని రకాల సేవా కార్యక్రమాలు యోజన బద్దంగా, నియమితంగా చేయవచ్చనేది జ్ఞాన సరస్వతి దేవాలయ నిర్వహణలో చూడవచ్చు అని అన్నారు.
ఆలయ వ్యవ స్థాపకులు సదా వెంకట్ గారు మాట్లాడుతూ ఆలయ నిర్వహణ పటిష్టత కోసం ఏర్పాటు చేసుకున్న మండలీల ద్వారా అన్ని తారతమ్యాలు మరిచి సేవలో ఉండాలి, ఆలయంలో జరిగే ఉత్సవాల నిర్వహణ మండలీల సభ్యుల ద్వారానే నిర్వహించ బడుతుంది కాబట్టి అందరూ తమ అనుకూల సమయం చేసుకోవాలన్నారు.
మoడలీల పటిష్టత కోసం నియమితంగా సమావేశాలునిర్వహించుకోవాలని....
ప్రతీ మండలి నుండి ముగ్గురు సభ్యులచే ఉత్సవ నిర్వహణ మండలి ఏర్పాటు జరుగుతుంది. ఆ విధంగానే శరన్నవరాత్రి ఉత్సవాలు -2024 నిర్వహించ బడుతాయి అన్నారు.
సమావేశంలో అన్ని మండలీల సబ్యులు పాల్గొన్నారు.
:~ జ్ఞానసరస్వతి సంస్థాన్
No comments:
Post a Comment