Monday, 29 May 2023

SEWA @ CARONA

#మానవసేవేమాదవసేవ
శరీరంలో నిరంతరం పనిచేసే గుండెలాగా ప్రతి సేవా కార్యకర్త పనిచేయాలి - #ప్రాంతసేవాప్రముఖ్ శ్రీ #వాసూజి
ప్రతి ఒక్కరు #సేవాదృక్పథం అలవర్చుకోవాలి - 
#జ్ఞానసరస్వతిసేవాసమితి ట్రస్ట్ వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి*
#ఇబ్రహీంపట్నం లోని #వినోభానగర్ #సాధనకుటీర్ లో #ఆత్మీయసమావేశం*
#కరోన మహమ్మారి ఉగ్రరూపం దాల్చకుండా విధించిన లాక్ డౌన్ లో పేద కుటుంబాల ప్రజలు, వలస కార్మికులు ఇబ్బందులు పడకుండా #తెలంగాణ ప్రాంతంలో 2,57,000 కుటుంబాలకు ఏదో ఒక విధంగా సహాయాన్ని #సేవాభారతి అందించింది. #రంగారెడ్డిజిల్లా #ఇబ్రహీంపట్నం, #మంచాల, #యాచారం మండలాల్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి #సేవాభారతి మరియు #జ్ఞానసరస్వతసేవాసమితి ట్రస్ట్ నుండి గ్రామ గ్రామాన సహాయాన్ని అందించారు.
 ఈ కార్యక్రమాలను విజయవంతం చేయుటలో #150మందిసేవకులు 
#40రోజుల పాటు తమ సమయాన్ని అందించారు. వారందరికి శనివారం #ఆత్మీయసమావేశం #ఇబ్రహీంపట్నం లోని #వినోభానగర్ #సాధనకుటీర్ లో ఏర్పాటు చేశారు. సమావేశంలో పాల్గొన్న సేవకులు, కార్యకర్తలు తమ అనుభవాలను పంచుకున్నారు. 
*ఈ సందర్భంగా #ప్రాంతసేవాప్రముఖ్ శ్రీ #వాసూజి మాట్లాడుతూ 2,57,000 కుటుంబాలకు నిత్యవసర సరుకులు, భోజనాలు వండి ప్రతి ఇంటికి, ప్రతి రోజు అందించడం జరిగింది. #గ్లోవ్స్, #శానిటైజర్లు, #మాస్కులు పంపిణీ చేశామన్నారు. #బీపీ, షుగర్ ఉన్న వారికి మందులను నగరాలకు వెళ్లి తీసుకొచ్చి 2565 చోట్ల ఇచ్చామన్నారు. కొందరికి ఉచితంగా ఇచ్చాము. గాంధీఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందికి షెల్టర్ రూమ్స్ ఏర్పాటు చేసి సేవా భారతి తరపున హోటల్ రూమ్స్ భోజనాలు ఏర్పాటు చేశాము. ఏకం, యునైటెడ్ మరియు యూసీ సంస్థల సహకారంతో గాంధీ ఆసుపత్రిలో 35 లక్షల విలువైన, నిజామాబాద్ లో 25లక్షల విలువైన పీపీఈ కిట్లను, గాంధీ ఆసుపత్రిలో, నిజామాబాద్ లో శానిటేషన్ టన్నల్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోగ నిరోధకా శక్తి పెరగడం కోసం కాడా కషాయం 1,25,000మందికి ప్రతి రోజు అందించాం. వలస కార్మికులకు భోజనం, చెప్పులు, ఓఆర్ యెస్, నీటి వసతి, 385 బస్సులలో నాగ్ పూర్, శ్రీకాకుళం లాంటి దూర ప్రదేశాలు వెళ్ళడానికి ఏర్పాట్లు చేశాం. శ్రామిక్ రైళ్లలో వెళ్లే కార్మికులకు కార్యకర్తల కుటుంబాల ద్వారా భోజనం తయారుచేసి ఒకే రోజు 50వేల మందికి అందించాం*. 

సేవ ఆపత్కాలంలోనే కాకుండా సహజ స్వభావంగా మారాలన్నారు. శరీరంలో నిరంతరం పనిచేసే గుండెలాగా ప్రతి #సేవాకార్యకర్త పనిచేయాలన్నారు. మన జీవన విధానం, మర్చిపోని కొన్ని పూర్వ ఆహారపు అలవాట్లు మాత్రమే ఇంతవరకు మనను రక్షిస్తున్నాయన్నారు*.
 *జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్ వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి, ఆ పరంపరను కొనసాగిద్దామనే  ఆశయ స్పూర్తితో దేవాలయం ద్వారా అన్ని ఉచిత సేవలు అందించబడుతున్నాయి. 
మన దేశంలో కొన్ని #దేవాలయాలు అనేక సేవా కార్యక్రమాలతో పాటు నిత్య #అన్నదానం చేస్తున్నాయి.
 ఆ ప్రేరణతో #జ్ఞానసరస్వతిదేవాలయం కేంద్రంగా కరోనా ఆపత్కాలంలో అవసరార్ధులను గుర్తించి సుమారు 900 మందికి నిత్యావసరాల కిట్లు అందించబడ్డాయి. అంత మంది అవసరార్థులకు ఆపద కాలంలో అండగా ఉండడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నామని అన్నారు.

 #ఇబ్రహీంపట్నం, #మంచాల, #యాచారం మండలాల్లోని 50 గ్రామాల్లో #సేవాభారతి ద్వారా 2100 మందికి #మాస్కులు, నిత్యావసర కిట్లు 948 కుటుంబాలకు, 175 మందికి 31 రోజులు అంబలి, ఒక స్థలంలో 200మందికి 32 రోజులు, ఇంకో స్థలంలో 2000మందికి 4 రోజులు కాడా కషాయం అందించబడ్డాయి*.
 ప్రతి ఒక్కరు సేవా దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ విభాగ్ సేవా ప్రముఖ్ 
సిద్ది రాఘవేందర్ గారు , మహేశ్వరం బాగ్ సహకార్యవాహ రమేష్ గారు , జిల్లా సహ బౌద్ధిక్ ప్రముఖ్ భాస్కర్ గారు, #జ్ఞానసరస్వతిసేవాసమితి ట్రస్ట్ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి మరియు ఆయా మండలాల సేవాప్రముక్ లు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త కరోనా ఆపత్కాలంలో అవసరార్థులను గుర్తించి ఆదుకోవడంలో తాము గొప్ప అనుభూతిని పొందామనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
;~ #జ్ఞానసరస్వతిసేవాసమితి & #సేవాభారతి_వీరపట్నం*

Sunday, 28 May 2023

స్వామి పరిపర్ణానందతో team GST

On this Day @ 29.05.2017.

దైవ భక్తితో పాటు దేశ భక్తి భారతీయులందరికీ తప్పక ఉండాలని నొక్కి చెబుతూ , ధర్మం కోసం ధార్మిక చైతన్యం కలిగిస్తున్న నేటి వివేకానంద పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానందని కలిసి "శ్రీసరస్వతీ మహా యజ్ఞానికి" ఒకరోజు సమయం అడిగి ఆశీస్సులు తీసుకున్న జ్ఞానసరస్వతి దేవాలయం ట్రస్ట్ సభ్యులు మరియు యజ్ఞ కమీటీ సభ్యులు. నిండు మనస్సుతో ఆశీర్వదించిన స్వామీజీ. 
 దేవాలయం website:www.gnanasaraswathitemplenwp.in ని ప్రారంబించిన స్వామీజీ.
విద్యార్థుల వికాసంకోసం _విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మించిన విధానం, ఆలయం కేంద్రంగా జరుగుతున్న  కార్యక్రమాల వివరణ విని అభినందించిన స్వామీజీ.
#SwamiParipoornananda  #GSTempalNWP

Tuesday, 23 May 2023

కళా నైపుణ్యం...

అద్బుతం..
ఆ కాళా నైపుణ్యం..
మరయంత్రంతో పోటీగా మనిషి హస్తం... ఇంకా అంటే అంతకు ఎక్కువే..
అచ్చువేసినట్టే అమ్మవారి విగ్రహం..

ఆ విగ్రహంలో అమ్మవారు ఆవహిస్తే అచ్చంగా ఆమే రూపమే.. అది మహా అద్బుతమే..

అ స్థలంలో #అమ్మవారివిహ్రహo   వేయించాలనే ఆలోచన వచ్చినప్పుడే...
వేస్తే ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అనుకున్నాo...
ఆ శిల్పికి ఒకటికి 10 మార్లు వేయాల్సిన బొమ్మ చిత్రం చూపించి జాగ్రత్తలు చెప్పాము. అవి జాగ్రత్తలు అనేకంటే భయపెట్టడం అనొచ్చోమో😀. అంతలా జాగ్రత్త చేప్పాము..  
ఇక ఆ విగ్రహం తయారు చేయడం మెదలు పెట్టీన రోజు నుండి ప్రతీ రెండు రోజులకు వస్తున్న మార్పులు గమనిస్తూన్నాము.
ఆ విగ్రహం పూర్తయ్యాక కొంత సంతోషం,  మనం చెప్పిన మాదిరిగానే అచ్చం అలాగే చేశాడు శిల్పి..
ముఖ్యంగా #ముఖవర్చస్సు మీద కొoత ఆందోళన ఉండేది ఎలా చేస్తారో అని.. అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ విగ్రహం బాగా వేశారు. ఒక్క ముఖమేమిటీ ప్రతీ చిన్న విషయo పట్ల జాగ్రత్త పడి #అమ్మవారివిగ్రహo చేశారు..

ఆ తరువాత ఆ విగ్రహనికి వేయాల్సిన రంగులూ మనమే నిర్ణయం చేసాము. ఆ చిత్రం కేవలం ఈ ఆలయo వారికే చెందింది. 
ఎప్పుడు రంగులు పూర్తి చేస్తారా అన్నంత ఆతృత ఉండేది...

ఎట్టకేలకూ #విగ్రహం చేయడం సంపూర్ణం.  విగ్రహం బాగ రావడo మాత్రమే కాదు,  రంగులూ బాగా వేశారు..
ఆలయ గర్బగుడిలో వెలసిన అమ్మవారిని దర్శించుకునే కంటే ముందే, గుడి మెట్ల దగ్గరే ఈ #అమ్మవారు #దర్శనం ఇస్తుంది..
ఇంతా చెప్పి ఇదెక్కడా అని అడిగేంత అవాకాశం ఏమీ ఇవ్వను..

*ఇది మన #జ్ఞానసరస్వతిదేవాలయం, #నందివనపర్తి అలయంలో...
అందర

ఇంత #శ్రద్ధతో, చాలా ఓపికగా తమ అద్భుత కళా నైపుణ్యంతో అమ్మవారి విగ్రహాన్ని అందించిన ఆ  కళాకారుల కళను గౌరవిస్తూ, వారిని అబినందిద్దాం, ప్రోత్సహిదాం.
బోలో #సరస్వతిమాతకిజై🙏🏼.

;~ సదా వెంకట్.

Sunday, 21 May 2023

హనుమాన్ జన్మతిథి మహోత్సవo-2017

శ్రీ భక్తాంజనేయ సహిత శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం.
హనుమజ్జయంతిని పురస్కరించుకొని బైక్ ర్యాలీ_ #BIKERALLY   ద్వారా నందివనపర్తి గ్రామ పరిధి లోని అన్ని ఆంజనేయ ఆలయాల సందర్శన..   @ కొమ్మోనిబావి, గంటోనిబావి, బొల్లిగుట్ట తండా, కరిద్ధొని బావి, పిల్లిపల్లి మరియు అయ్యవారిగూడ.
#HANUMAJJAYANTHI
హనుమజ్జయంతిని పురస్కరించుకొని బైక్ ర్యాలీ ద్వారా నందివనపర్తి గ్రామ పరిధి లోని కొమ్మోనిబావి, గంటోనిబావి, బొల్లిగుట్ట తండా, కరిద్ధొని బావి, పిల్లిపల్లి మరియు అయ్యవారిగుడ లలోని అన్ని హనుమాన్ దేవాలయాలను సందర్షించడం జరిగింది.

గణపతి పూజ, ఆకు పూజ, పవమాన హోమం మరియు పూర్ణాహుతి..

ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, గ్రామ మరియు అనుబంధ గ్రామాల ప్రజలు మరియు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు..

ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు.

Wednesday, 17 May 2023

సంకల్ప ద్వజ ఆవిష్కరణ

#జ్ఞానసరస్వతి_  #సంకల్పభవన్ పై #సంకల్పద్వజ ఆవిష్కరణ*

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0isST7Z8BPhqWKQxd5xfd7hEpLxsEeZTBk1AQDRpgu5Yk2yawJP7PKpBLC4t89hfBl&id=100006723364953&mibextid=Nif5oz

   సంవత్సరంలో 3 పర్యాయాలు:  @ బాల్య దశ, యవ్వన దశ, ప్రౌడ దశలలో చేయాల్శిన ఆచరణలు చేస్తూ ధర్మానికి, సమాజానికి రక్షణగా ఉంటామని #సంకల్పం చేసి సంకల్ప ద్వజ ఆవిష్కరణ చేయాలని మన #ఆశయం..

ఆంజనేయుడే ఆదర్శంగా #జ్ఞానసరస్వతి #సంకల్పభవన్ పై యువతకోసం #సంకల్పధ్వజ ఆవిష్కరణ

సకల #శాస్త్రకోవిదుడు, సకల #గుణసంపన్నుడు, ఆపద్భాందవుడు, #విజయుడు... అన్నింటికీ మించి #ధర్మానికిదాసుడు ఆ #ఆంజనేయస్వామి.

#హనుజ్జయంతి సందర్భంగా *ఆంజనేయుడే మనకు ఆదర్శం అంటూ,  తమ జీవితంలో అన్ని రకాలుగా  ఎదుగుతూ అవసర సమయాల్లో సమాజానికి, ధర్మానికి రక్షణగా ఉంటామని యువత  సంకల్పం తీసుకుని  #సంకల్పద్వజ ఆవిష్కరణ జరుపాలనేది మన నిర్ణయం*. 

*మొదటి సారిగా పూజ్యశ్రీ  #విద్యారణ్యభారతిస్వామీజి  కరకమలములచే #వసంతపంచమి సందర్భంగా ఆవిషృతమై ,రెండవ సారి  #శ్రీహనుమజ్జయంతి సందర్భంగా స్వామీజిచే ఆవిషృతం కావడం మనందరికి ఆనందదాయకం. 

#కరోనా లాక్ డౌన్ కారణంగా కార్యక్రమం గొప్పగా చేయలేకున్న, ఉన్నంతలో గొప్పగా చేయగలిగాం.  *దైవానుగ్రహానికి ధన్యులం,సహకరించిన ప్రకృతికి #శిరసాప్రణామాలు.

:~ #శ్రీజ్ఞానసరస్వతిదేవాలయం*,
 *#జ్ఞానసరస్వతిసేవాసమితిట్రస్ట్*. నందివనపర్తి

Tuesday, 16 May 2023

మొక్కను బ్రతికిద్దాం @ GST _2012


శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ సహిత శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతీ దేవాలయం-నందివనపర్తి  :    
స్వస్తిశ్రీ నందనానామ సం!ర  వైశాక బహుళ దశమి, మంగళవారం... 
హనుమజ్జయంతి - 2012   సందర్బంగా విద్యార్తులచే మొక్కలు నాటే కార్యక్రమం ..  జ్ఞానసరస్వతీ  సేవా సమితి - నందివనపర్తి.

Wednesday, 10 May 2023

హనుమాన్ జయంతి _2018 @ GST

Good Initiative by #YOUTH
Congratulations to All.

సకలశాస్త్ర విశారదుడు, నిస్వార్థ సేవకుడు, బుద్ధిశాలి, చిరంజీవి,  వాక్చాతుర్యంలో, సమయస్ఫూర్తిలో ప్రజ్ఞావంతుడు, క్లిష్ట కార్యాలు నిర్వహించుటలో గొప్పసమర్థుడు, అతిబలవంతుడు  ఆ ఆంజనేయుడి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన  Gnana Saraswathi Temple Nandiwanaparthy యువతకు శుభాభినందనలు.
యువత ద్వారా ఒక మంచి ప్రయత్నం.
కేవలం యువతతో "హనుమజ్జయంతి ఉత్సవకమిటి" ఏర్పాటు చేసి కార్యక్రమం నిర్వహణ చేయడం శుభపరిణామం.
మీ ప్రయత్నం సఫలీకృతం.
భక్తుడిగా పరిచయమై భగవంతునితో సమానంగా పూజలందుకునే  ఆ అంజనేయుడి నిత్య ఆరాధన ఏ ఊరిలో అయితే  జరుగుతదో ఆ ఊరు నిత్యఉత్సాహంతో ఉంటుంది అని చెప్పిన మాట.  ఆ స్ఫూర్తితో ఊరి యువత ఊరి ఉపకారం కోరి ఉన్న సమయం, సంపదలో కొంత సమర్పణ చేయడం నిజంగా స్ఫూర్తిదాయకమే.  
అంతే కాక ఆ ఊరి పరిదిలో... 
తండాల్లో, చిన్న చిన్న గూడాల్లో తమకు అభయుడిగా..
 రాల్లల్లో వెలసిన/చెక్కిన ఆ అభయాంజనేయుడి విగ్రహాలను(  5 కిలోమీటర్ల చుట్టుకొలతలో ఉన్న  9 విగ్రహాలు)కుల, వర్గ & రాజకీయాలకు అతీతంగా  ఆత్మీయంగా సందర్శించి మనస్పూర్తిగా ధన్యవాదాలు సమర్పించిన యువత నిజంగా ప్రేరణదాయులే.
నిజాయితితో జరిగే ఏ ఉద్యమానికైనా, కార్యానికైనా ప్రకృతి తప్పక సహకరిస్తుంది అంటారు. 
మన ద్వారా జరిగే పనిలో అది కాపాడుకోవడమే మన పని.