Wednesday, 10 May 2023

హనుమాన్ జయంతి _2018 @ GST

Good Initiative by #YOUTH
Congratulations to All.

సకలశాస్త్ర విశారదుడు, నిస్వార్థ సేవకుడు, బుద్ధిశాలి, చిరంజీవి,  వాక్చాతుర్యంలో, సమయస్ఫూర్తిలో ప్రజ్ఞావంతుడు, క్లిష్ట కార్యాలు నిర్వహించుటలో గొప్పసమర్థుడు, అతిబలవంతుడు  ఆ ఆంజనేయుడి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన  Gnana Saraswathi Temple Nandiwanaparthy యువతకు శుభాభినందనలు.
యువత ద్వారా ఒక మంచి ప్రయత్నం.
కేవలం యువతతో "హనుమజ్జయంతి ఉత్సవకమిటి" ఏర్పాటు చేసి కార్యక్రమం నిర్వహణ చేయడం శుభపరిణామం.
మీ ప్రయత్నం సఫలీకృతం.
భక్తుడిగా పరిచయమై భగవంతునితో సమానంగా పూజలందుకునే  ఆ అంజనేయుడి నిత్య ఆరాధన ఏ ఊరిలో అయితే  జరుగుతదో ఆ ఊరు నిత్యఉత్సాహంతో ఉంటుంది అని చెప్పిన మాట.  ఆ స్ఫూర్తితో ఊరి యువత ఊరి ఉపకారం కోరి ఉన్న సమయం, సంపదలో కొంత సమర్పణ చేయడం నిజంగా స్ఫూర్తిదాయకమే.  
అంతే కాక ఆ ఊరి పరిదిలో... 
తండాల్లో, చిన్న చిన్న గూడాల్లో తమకు అభయుడిగా..
 రాల్లల్లో వెలసిన/చెక్కిన ఆ అభయాంజనేయుడి విగ్రహాలను(  5 కిలోమీటర్ల చుట్టుకొలతలో ఉన్న  9 విగ్రహాలు)కుల, వర్గ & రాజకీయాలకు అతీతంగా  ఆత్మీయంగా సందర్శించి మనస్పూర్తిగా ధన్యవాదాలు సమర్పించిన యువత నిజంగా ప్రేరణదాయులే.
నిజాయితితో జరిగే ఏ ఉద్యమానికైనా, కార్యానికైనా ప్రకృతి తప్పక సహకరిస్తుంది అంటారు. 
మన ద్వారా జరిగే పనిలో అది కాపాడుకోవడమే మన పని.

No comments:

Post a Comment