Monday, 29 May 2023

SEWA @ CARONA

#మానవసేవేమాదవసేవ
శరీరంలో నిరంతరం పనిచేసే గుండెలాగా ప్రతి సేవా కార్యకర్త పనిచేయాలి - #ప్రాంతసేవాప్రముఖ్ శ్రీ #వాసూజి
ప్రతి ఒక్కరు #సేవాదృక్పథం అలవర్చుకోవాలి - 
#జ్ఞానసరస్వతిసేవాసమితి ట్రస్ట్ వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి*
#ఇబ్రహీంపట్నం లోని #వినోభానగర్ #సాధనకుటీర్ లో #ఆత్మీయసమావేశం*
#కరోన మహమ్మారి ఉగ్రరూపం దాల్చకుండా విధించిన లాక్ డౌన్ లో పేద కుటుంబాల ప్రజలు, వలస కార్మికులు ఇబ్బందులు పడకుండా #తెలంగాణ ప్రాంతంలో 2,57,000 కుటుంబాలకు ఏదో ఒక విధంగా సహాయాన్ని #సేవాభారతి అందించింది. #రంగారెడ్డిజిల్లా #ఇబ్రహీంపట్నం, #మంచాల, #యాచారం మండలాల్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి #సేవాభారతి మరియు #జ్ఞానసరస్వతసేవాసమితి ట్రస్ట్ నుండి గ్రామ గ్రామాన సహాయాన్ని అందించారు.
 ఈ కార్యక్రమాలను విజయవంతం చేయుటలో #150మందిసేవకులు 
#40రోజుల పాటు తమ సమయాన్ని అందించారు. వారందరికి శనివారం #ఆత్మీయసమావేశం #ఇబ్రహీంపట్నం లోని #వినోభానగర్ #సాధనకుటీర్ లో ఏర్పాటు చేశారు. సమావేశంలో పాల్గొన్న సేవకులు, కార్యకర్తలు తమ అనుభవాలను పంచుకున్నారు. 
*ఈ సందర్భంగా #ప్రాంతసేవాప్రముఖ్ శ్రీ #వాసూజి మాట్లాడుతూ 2,57,000 కుటుంబాలకు నిత్యవసర సరుకులు, భోజనాలు వండి ప్రతి ఇంటికి, ప్రతి రోజు అందించడం జరిగింది. #గ్లోవ్స్, #శానిటైజర్లు, #మాస్కులు పంపిణీ చేశామన్నారు. #బీపీ, షుగర్ ఉన్న వారికి మందులను నగరాలకు వెళ్లి తీసుకొచ్చి 2565 చోట్ల ఇచ్చామన్నారు. కొందరికి ఉచితంగా ఇచ్చాము. గాంధీఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందికి షెల్టర్ రూమ్స్ ఏర్పాటు చేసి సేవా భారతి తరపున హోటల్ రూమ్స్ భోజనాలు ఏర్పాటు చేశాము. ఏకం, యునైటెడ్ మరియు యూసీ సంస్థల సహకారంతో గాంధీ ఆసుపత్రిలో 35 లక్షల విలువైన, నిజామాబాద్ లో 25లక్షల విలువైన పీపీఈ కిట్లను, గాంధీ ఆసుపత్రిలో, నిజామాబాద్ లో శానిటేషన్ టన్నల్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోగ నిరోధకా శక్తి పెరగడం కోసం కాడా కషాయం 1,25,000మందికి ప్రతి రోజు అందించాం. వలస కార్మికులకు భోజనం, చెప్పులు, ఓఆర్ యెస్, నీటి వసతి, 385 బస్సులలో నాగ్ పూర్, శ్రీకాకుళం లాంటి దూర ప్రదేశాలు వెళ్ళడానికి ఏర్పాట్లు చేశాం. శ్రామిక్ రైళ్లలో వెళ్లే కార్మికులకు కార్యకర్తల కుటుంబాల ద్వారా భోజనం తయారుచేసి ఒకే రోజు 50వేల మందికి అందించాం*. 

సేవ ఆపత్కాలంలోనే కాకుండా సహజ స్వభావంగా మారాలన్నారు. శరీరంలో నిరంతరం పనిచేసే గుండెలాగా ప్రతి #సేవాకార్యకర్త పనిచేయాలన్నారు. మన జీవన విధానం, మర్చిపోని కొన్ని పూర్వ ఆహారపు అలవాట్లు మాత్రమే ఇంతవరకు మనను రక్షిస్తున్నాయన్నారు*.
 *జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్ వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి, ఆ పరంపరను కొనసాగిద్దామనే  ఆశయ స్పూర్తితో దేవాలయం ద్వారా అన్ని ఉచిత సేవలు అందించబడుతున్నాయి. 
మన దేశంలో కొన్ని #దేవాలయాలు అనేక సేవా కార్యక్రమాలతో పాటు నిత్య #అన్నదానం చేస్తున్నాయి.
 ఆ ప్రేరణతో #జ్ఞానసరస్వతిదేవాలయం కేంద్రంగా కరోనా ఆపత్కాలంలో అవసరార్ధులను గుర్తించి సుమారు 900 మందికి నిత్యావసరాల కిట్లు అందించబడ్డాయి. అంత మంది అవసరార్థులకు ఆపద కాలంలో అండగా ఉండడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నామని అన్నారు.

 #ఇబ్రహీంపట్నం, #మంచాల, #యాచారం మండలాల్లోని 50 గ్రామాల్లో #సేవాభారతి ద్వారా 2100 మందికి #మాస్కులు, నిత్యావసర కిట్లు 948 కుటుంబాలకు, 175 మందికి 31 రోజులు అంబలి, ఒక స్థలంలో 200మందికి 32 రోజులు, ఇంకో స్థలంలో 2000మందికి 4 రోజులు కాడా కషాయం అందించబడ్డాయి*.
 ప్రతి ఒక్కరు సేవా దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ విభాగ్ సేవా ప్రముఖ్ 
సిద్ది రాఘవేందర్ గారు , మహేశ్వరం బాగ్ సహకార్యవాహ రమేష్ గారు , జిల్లా సహ బౌద్ధిక్ ప్రముఖ్ భాస్కర్ గారు, #జ్ఞానసరస్వతిసేవాసమితి ట్రస్ట్ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి మరియు ఆయా మండలాల సేవాప్రముక్ లు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త కరోనా ఆపత్కాలంలో అవసరార్థులను గుర్తించి ఆదుకోవడంలో తాము గొప్ప అనుభూతిని పొందామనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
;~ #జ్ఞానసరస్వతిసేవాసమితి & #సేవాభారతి_వీరపట్నం*

No comments:

Post a Comment