శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
ఆలయ వ్యవస్థ పటిష్టత కోసం ఏర్పాటు చేయబడ్డ వివిధ మండలీలలో భాగంగా....
*GSS మాతృమండలి సభ్యుల సమావేశం*.
*ఆలయ వ్యవస్థ అవసరాలు మరియు సేవా కార్యక్రమాల దృష్ట్యా సేవాసమితి మాతృమండలి 3 విభాగాలుగా ఏర్పాటు*.
1. ఉత్సవ విభాగం
2. మూల నక్షత్ర హోమం నిర్వహణ విభాగం
3. లలితా పారాయణం & అన్నపూజ నిర్వహణ విభాగం.
ఏర్పడిన 03 విభాగాల మాతృమండలి సభ్యులు సంవత్సర కాలం పాటు బాధ్యతలలో ఉంటారు. ఎంపికైన సభ్యులకు ఆలయ వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు మండలీల విధులు, నిర్వహణ బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ సలహాలు_సూచనలు తెలిపారు.
*ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాల గురించి మండలి ఇంచార్జి మరియు సహాయక్ ద్వారా మండలిలో ఉన్న సభ్యులందరికీ పూర్తి అవగాహన కల్పించడం*.
*వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది, వ్యవస్థని వ్యక్తులే పటిష్టం చేయాలని.. వ్యవస్థ కోసం పని చేయాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత ప్రాధాన్యతపై ఎక్కువ శ్రద్ద చూపరాదు*..
*వ్యవస్థ కోసం సమయం ఇచ్చేవారిని మరియు సంపద ఇచ్చేవారిని గుర్తించి, తగు రీతిలో వారికి గౌరవం ఇవ్వాలని తెలిపారు*.
*ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన వారందరూ అన్ని తారతమ్యాలు @కుల, ధన, అధికార ప్రస్తావన లేకుండా సహృదయ సేవా భావనతో, నిస్వార్థంగా ఉత్సవాల వ్యవస్థలో భాగస్వామ్యం కావాలన్నారు*.
*రాబోయే రోజుల్లో కనీసంగా 108 మంది సభ్యులతో మాతృమండలిని ఏర్పాటు చేసుకుని అతి పెద్ద మాతృమండలిగా అన్ని రకాల సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలన్నారు*.
*వ్యవస్థలో కొత్తతరం యువతని భాగస్వామ్యం చేసి రాబోయే తరాలకు సేవా భావం పెంపొందించాలన్నారు*
ఆలయ ఉత్సవాలలో మండలి వారిగా పాల్గొనటకు పూర్వ తయారీ కోసం సమావేశాలు నిర్వహించుకుని, బాధ్యతల విభజన చేసుకోవాలి.
ఈ సమావేశంలో విభాగాల వారిగా పాల్గొన్న మాతృమoడలి సభ్యులు.
1. మూల నక్షత్ర నిర్వహణ విభాగం :: 14
2. లలితా పారాయణం & అన్నపూజ నిర్వహణ విభాగం :: 08
3. ఉత్సవాల నిర్వహణ :: 10
No comments:
Post a Comment