Tuesday, 30 January 2024

సంకల్పభవన్ లో కార్యకర్తల సమావేశం

సంకల్ప భవన్ లో  కార్యకర్తల సమావేశం
( GSS_వివిధ మండలీల సభ్యులు)

తేదీ: 30.01.2024, మంగళవారం.

సమావేశంలో శ్రీ అమర లింగన్న, ధర్మ జాగరణ సంస్థ, క్షేత్ర ప్రముఖ్ (కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు) గారి మార్గదర్శనం..

1. పూర్వం దేవాలయం కేంద్రంగా విద్య, వైద్యం, న్యాయం, భోజన వ్యవస్థ జరిగేదని, ఆ వ్యవస్థను ఆదర్శంగా తీసుకుని ఈ దేవాలయం ద్వారా విద్య - వైద్యం కోసం పనిచేయాలనే సంకల్పం గొప్పదన్నారు.

  2. శ్రీరాముడే మనకు ఆదర్శం అన్నారు ఆయన జీవితం ఆధారంగా కుటుంబ వ్యవస్థ కోసం ప్రపంచం మొత్తం భారత దేశం వైపు చూస్తున్నది.
అలాంటి వ్యవస్థ నిర్మాణం కోసం అనేక మంది నిస్వార్థoగా పనిచేశారు. అలాంటి ఆదర్శం తీసుకుని ఈ దేవాలయం పనిచేయడం అభినందనీయం.

3. సమాజంలో జరుగుతున్న మంచి చెడును తల్లిదండ్రులు వారి పిల్లలకు వివరించాలన్నారు. అలాoటి సంస్కార వంతమైన విషయాలు దేవాలయం కేంద్రంగా జరిగితే అద్భుతంగా ఉంటుంది.

ఆలయ ఫౌండర్ సదావెంకట్ గారు

1. దేవాలయం కేంద్రంగా సేవాసమితి ద్వారా ఏర్పడిన 14 మండలీలను ఇంకా పటిష్టం చేసుకొని అన్ని తార తమ్యాలు మరిచి పనిలో ఉండాలి.
వచ్చే వసంత పంచమి రోజున పూజ్య స్వామీజీ ద్వారా అన్ని మండలీల సభ్యులకు ఆశీస్సులు ఉంటాయి.
2.  వ్యవస్థ కోసం అన్ని స్థాయిలు పనిచేసే విధంగా కార్యకర్తలు నిలబడాలి.  ఈ మండలీల సభ్యులు  ఒక సంవత్సరం కాలం పాటు అదే మండలీలలో పనిలో ఉంటారు.
సమాజహితం కాంక్షిస్తూ ఆలయం కేంద్రంగా కొన్ని సామాజిక కార్యక్రమాల నిర్వహణకు సేవాసమితి యోజన చేసింది.

1. సంకల్ప భవన్లో 14 సం. లోపు చిన్నారులకు పుట్టినరోజు వేడుకలు.

2. దేవాలయం కేంద్రంగా తల్లిదండ్రులకు పాద పూజ.

3. బాల సంస్కార కేంద్రం ఏర్పాటు.

:~ జ్ఞానసరస్వతి సంస్థాన్

No comments:

Post a Comment