శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
ఆలయ శ్రేయోభిలాషులకు, భక్తులకు మరియు సేవాతత్పరులకు శుభ సమాచారం.. అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యానికి ఆహ్వానం..
మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే ఆశయ స్ఫూర్తితో నిర్మితమై, నిస్వార్థసేవతో ఆలయ నిర్వహణ జరుగుతున్న విషయం మనందరి తెలిసినదే..
ఆలయ నిర్మాణం జరిగిన పుష్కర కాలంగా వివిధ ప్రదేశాల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో ఆలయ వ్యవస్థ నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉన్నది.
ప్రతి సంవత్సరం అవసరాలను, అనుకూలతలను బట్టి ఆలయ అభివృధి పనులు జరుగుచున్నాయి.
గత సంవత్సరం పుష్కర బ్రహ్మోత్సవాలు పూర్తయిన సందర్బంగా కొన్ని విశేష కార్యక్రమాల నిర్వహణకు సంకల్పం జరిగి ఈసారి నిర్వహించబడుచున్నాయి.
ఆ సందర్భంలో భక్తులకు కలిగే అసౌకర్యాలలో కొన్ని ముఖ్య విషయాల గమనించబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి, వివిధ ప్రాంతాల నుండి వచ్చే భకులకు ముఖ్యంగా మాతృ మూర్తులకు శౌచలయాలు (Bothrooms) బాగా ఇబ్బంది అనిపించింది..
కావున అలాంటి అసౌకర్యాలు పూర్తి చేసి తగిన వసతులను ఏర్పాటు చేయాలనే నిర్ణయం ట్రస్ట్ ద్వారా జరిగింది.
వచ్చే సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గామాత మాలధారణ వేసే భక్తుల కోసం సంకల్ప భవనం పైన
3 శౌచాయాలు(Bothrooms )మరియు అందరి అవసరాల కోసం మరో
8 శౌచలయాలు(Bothrooms)ఆలయ స్థలంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఆలయ అభివృద్ధిి పనులలో అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో సేవాసమితి ద్వారా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం.
కావున భక్తులు, సేవాతత్పరులు, విద్యాభిమానులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
భక్తులు సమర్పణ చేసే సంపదకు తగిన విధంగా @ మహా ధర్మకర్తలు, ధర్మకర్తలు, మహారాజ పోషకులు, రాజపోషకులు, సభ్యులుగా గుర్తింపు ఉంటుంది.
వివరాలకు:
9963263330
9963163330,
9885920685.
మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం.
భవదీయ:
సదా వెంకట్,
Founder & Managing Trustee
:~ జ్ఞానసరస్వతి సంస్థాన్ & జ్ఞానసరస్వతి సేవాసమితి.
No comments:
Post a Comment