Sunday, 24 September 2023

శరన్నవరాత్రి ఉత్సవాలు _2023

*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం,  నందివనపర్తి*
*శ్రీమాత్రే నమ:* 
               
*సమన్వయ మండలి సభ్యుల ఈ రోజు సమావేశంలో చర్చించిన విషయాలు* 
 
*October 15 నుండి 23 వరకు జరిగే శ్రీశ్రీశ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై  రెండవ సమీక్ష సంపూర్ణం..* 

*నవరాత్రులలో జరిగే విశేష కార్యక్రమాలు*

1) *సామూహిక లలితా సహస్రనామ పారాయణం*,
                                                                             2) *సామూహిక బతుకమ్మ మహోత్సవం,*

 3) *శ్రీ చండి & శ్రీ సరస్వతీ హోమం*

 4) *మాతా జాగరణ భజనలు*

 5) *ఆయుధ పూజ & మహిషాసుర  దహన ఉత్సవాలకు మండలీల వారిగా పని విభజన, బాధ్యతలు*.

*108 మంది ఉత్సవ సేవా దీక్షలో ఉండేవిధంగా  ప్రయత్నం*

 *విగ్రహ దాతలు, నిత్య ప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ కోసం నిధి సమీకరణపై సమీక్ష*.

:~  *జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్*

Saturday, 16 September 2023

నవరాత్రుల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ @ శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.

శ్రీమాత్రే నమః!!             

GSS మండలి సభ్యుల సమావేశం..

చర్చించిన అంశాలు:

అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 23 వరకు నవరాత్రులో జరిగే ముఖ్య విభాగపు మండలీలు @ 500 మాతృ మూర్తులతో  సామూహిక లలితా సహస్రనామ పారాయణం, సామూహిక బతుకమ్మ,  మరియు మహిషాసుర  దహనం పై సమీక్ష. 

నవరాత్రుల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

:~ జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్.

Tuesday, 12 September 2023

సేవాతత్పరులకు, విద్యాభిమానులకు సాదర స్వాగతం!!

*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*.

*విద్యాధనం శ్రేష్టధనం _ విద్యా దానం మహత్తరo.*

*సేవాతత్పరులకు, విద్యాభిమానులకు సాదర స్వాగతం*

..


*గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్జ్వలమవ్వాలి అనే ఆశయ స్ఫూర్తితో అన్ని స్థాయిల విద్యాసంస్థలలో చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు చేయాలని సంకల్పం జరిగింది.*
 
 చదువుతో పాటు విద్యార్థికి  సంస్కారం అందాలని, అందుకు  విద్యాలయాలే వేదికలుగా, రేపటి తరానికి చైతన్య కేంద్రాలుగా నిలవాలని ఈ నిశ్శబ్ద విద్యా మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టింది  సేవాసమితి ట్రస్ట్.
 
ఏ తారతమ్యం చూపక అందరినీ విగ్రహ దాతలుగా స్వీకరణ & అడిగిన విద్యాసంస్థలకు ఉచితంగా అమ్మవారి విగ్రహాలు అందించడo జ్ఞానసరస్వతి సేవాసమితి ఉద్దేశ్యం.

*మొదటి విడతగా 2018, జనవరిలో శ్రీ సరస్వతీ మహాయజ్ఞం నిర్వహించి తెలంగాణలోని 108 విద్యాసంస్థలకు అందించిన విషయం మనందరికీ విధితమే*. 
*ఈ విద్యా మహాయజ్ఞం నిరంతరం కొనసాగించాలానే లక్ష్యంతో ఇప్పటి వరకు 200 పైగా అమ్మవారి విగ్రహాలు వివిధ విద్యాసంస్థలకు అందించబడ్డాయి*.
*ఈ విద్యా మహాయజ్ఞానికి స్పందించిన అనేక విద్యా సంస్థలు అమ్మవారి ప్రతిమల ఏర్పాటుకోసం అభ్యర్థిస్తున్నారు.*
అందుకు మనం సిద్ధపడాలి.

కావున ఈ మహాయజ్ఞంలో భాగంగా *ఆశ్వీయుజ మాసం _ 2023,అక్టోబర్ లో జరిగే ""దసరా శరన్నవరాత్రి"" ఉత్సవాలలో శ్రీ సరస్వతీ హోమం నిర్వహించి  అమ్మవారి విగ్రహాలను విద్యాసంస్థలకు అందివ్వాలని ట్రస్ట్ నిర్ణయం.* 

అందుకోసం *ఏ తారతమ్యం చూపక సేవాతత్పరులను, విద్యాభిమానులను  విగ్రహ దాతలుగా ఆహ్వానిస్తోంది జ్ఞాన సరస్వతి సేవాసమితి*.
(విగ్రహ దాతలకు... 
*శ్రీ జగద్గురు శంకరచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్తాన పీఠాధీశులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ* కరమలములచే  ఆశీపూర్వక అభినందన ప్రశంసా పత్రం అందివ్వబడును.)

*విగ్రహ దాతలుగా ఉండాలనుకునే వారు మరియు విగ్రహాలు కావాల్సిన విద్యాసంస్థల వారు సేవాసమితి సభ్యులను సంప్రదించగలరు*.

*9963163330, 9963263330*

*విద్యాధనం శ్రేష్ఠ ధనం_ విద్యాధనం మహాదానం.* 

భవదీయ...

సదా వెంకట్, 
ఫౌండర్ & మేనేజింగ్ ట్రస్టీ,
*జ్ఞానసరస్వతి సంస్థాన్* & 
*జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్*.

Friday, 1 September 2023

సరస్వతి మహాయజ్ఞ కమిటీ సమావేశం


 GSS_Saraswathi Maha Yagna Samanvaya Committee.

శ్రీ మాత్రే నమః... 
 శ్రీ సరస్వతీ మహయజ్ఞ సమన్వయ కమిటీ  సమావేశం on  02.09.2017,శనివారం (బక్రీద్).
9 కమిటీల అద్యక్షులు మరియు సహాయకులతో సమవేశము.. 02.09.18 రోజున ఉ. 9 గ.లకు. అయ్యప్ప దేవాలయం, కర్మన్ ఘాట్.   కమిటీల ద్వారా  జరిన పనులను చర్చించి  జరగబోయే కార్యక్రమ స్వరూపాన్ని నిర్ణయించిన సమావేశం. 
మాన్యులు శ్రీ అప్పాల ప్రసాద్ జి (సామాజిక సమరసత రాష్ట్ర అద్యక్షులు) మరియు ఇతర పెద్దలు   సమావేశంలో ఉన్నారు.. అన్ని స్థాయిలు మరిచి సమిష్టిగా, సమన్వయంతో సరస్వతి మహాయజ్ఞం సంపూర్ణం చేయాలని సంకల్పం.🙏🙏