Post of 22.07.2018
శ్రీమాత్రే నమః..
గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశభవిష్యత్తు ఉజ్వలమవ్వాలి అనే ఆశయసాధనతో అన్ని స్థాయిల విద్యాసంస్థలలో చదువులతల్లి, జ్ఞానప్రధాత శ్రీ సరస్వతి మాత ప్రతిమలు ఉండాలని సంకల్పిoచిoది "జ్ఞానసరస్వతి సేవాసమితి" ట్రస్ట్.
2018, జనవరి 20,21& 22 తేదీలలో 108 హోమగుండాలు - 108 సరస్వతి మాత విగ్రహాలతో "సరస్వతీ మహాయజ్ఞం" నిర్వహించి దేశ చరిత్రలో మొదటిసారిగా 2018, ఫిబ్రవరి 21, ఉదయం 08:55 ని.కు తెలంగాణలోని 108 విద్యాసంస్థలలో విగ్రహ ఏర్పాట్లను పూర్తి చేసింది జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్ ..
ఇలా ఒకే ముహూర్తానికి 108 స్థలాల్లో 108 విగ్రహాలు ఏర్పాటు చేయడం దేశచరిత్రలో ఒక మహత్తర ఘట్టం అని భావించిన TELUGU BOOK OF RECORDS & TELANGANA BOOK OF RECORDS సంస్థలు GSS ట్రస్ట్ కు
తమ సంస్థల దృవీకరణ పత్రాలు అందజేసాయి.
ఆ సంస్థల ప్రతినిధి శ్రీ చింతపట్ల వెంకటాచారి గారు ప్రశంసా ధ్రువీకరణ పత్రాన్ని
శ్రీ విద్యారణ్య భారతి స్వామిజి చేతుల మీదుగా జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్ Founder & Managing Trustee
శ్రీ సదావెంకట్ గారికి సేవాసమితి
సమన్వయమండలి సభ్యుల సమక్షంలో అందజేశారు.
రానున్న రోజుల్లో అన్ని విద్యాసంస్థలలో విగ్రహాల ఏర్పాటు జరగాలని శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామిజి మరియు Telugu Book Of Records ప్రతినిధి వెంకటాచారి గారు ఆంక్షించారు.
GSS తరపున నిరంతర క్రతువుగా ఈ కార్యక్రమo కొనసాగుతుందని సేవాసమితి సభ్యులు తెలిపారు.
సరస్వతి మాతాకి జై ..