Saturday, 22 July 2023

మొదటినెల వేతనం ఆలయానికి సమర్పణ

కొలువుల కల్పవల్లి కి హ్రదయ నీరాజనం.
మొదటి నెల జీతంతో మొక్కు తీర్చుకున్న శ్రీమతి మారోజు దివ్య శివకిషోర్ గారు.
నజ్దిక్ సింగారం గ్రామ వాస్తవ్యులు శ్రీ మారోజు శంకర్శన్ గారి కోడలు శ్రీమతి శ్రీ దివ్య శివ కిషోర్ గారు కొలువుల కల్పవల్లిగా విరాజిల్లుతున్న జ్ఞానసరస్వతి  అమ్మవారిని దర్శించుకుని ఉద్యోగం కోసం అనుగ్రహించమని  అమ్మవారిని మొక్కకోవడం జరిగింది.

ఉద్యోగం వచ్చాక కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని, తన మొదటి నెల వేతనం $900 (73,791/- రూ) ను సేవాసమితి సభ్యులకు అందించారు. 

 దివ్య గారు Chase Bank, Texas, USA లో "Software Engineer" గా నియమితులయ్యారు.
దివ్య గారికి శుభాకాంక్షలు.. శుభాభినందనలు. దివ్య గారు జీవితoలో ఇంకా ఉన్నత స్థానానికి ఎదిగి కీర్తిమంతురాలు కావాలని,ఆలయ సభ్యులు సన్మానించి ఆశీర్వదించారు.
అందరం అభినందనలు తెలుపుదాం, ఆశీర్వదిద్దాం.

:~జ్ఞానసరస్వతి సంస్థాన్ & జ్ఞానసరస్వతి సేవాసమితి*

No comments:

Post a Comment