Congratulations & Blessings to LAKSHMI MANASWINI & LAKSHMI THAPASWINI for their Donation to Ammavari Ornaments...
Thax to their Parents for encouragement @CAUSE
Post of 09.07.2017
విద్యార్థుల వికాసం కోసం - విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మితమవుతున్న శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి. సంకల్పం: "పసిపిల్లల పైసలతో చదువులమ్మకు ఆభరణాలు" .
పసిపిల్లలన్నా, చదువుతున్న పిల్లలన్నా చదువులమ్మ సరస్వతీ దేవికి ఎనలేని ప్రీతి. ఆమె అనుగ్రహమే వారి ఎదుగుదల/ ఉన్నతి.
** ఆలయ నిర్మాణానికి సంకల్పించిన నాడే..ఆలయంలో ప్రతిష్టించే అమ్మవారి మూలవిరాట్టు మరియు అమ్మవారి అలంకరణ ఆభరణాలు కేవలం పాఠశాల స్థాయి (14సం.రాల లోపు) పిల్లల విరాళాలతో సమకూర్చాలనేది సంకల్పం. 2009 స. లో ప్రతిష్టించిన అమ్మవారి మూలవిరాట్టు అలానే పూర్తిచేయబడింది. ఆభరణాల కోసం: పాఠశాల స్థాయి పిల్లల విరాళాలతోనే ఆభరణాల సమీకరణ అమ్మవారి ఆభరణాలకోసం విరాళం అనే భావన పిల్లల్లో కలిగించి, పొదుపుచేసి సమర్పించిన విరాళాలు మాత్రమే స్వీకరించబడును. ప్రతిరోజు 5 రూపాయలకు తగ్గకుండా 108 రోజులు జమ చేసిన తరువాత ఆ డబ్బులను దేవాలయ కమిటీకి అందించడం.. అన్ని విరాళాలు కలిపి దేవాలయం వారే ఆభరణాలు తయారు చేయిస్తారు. ధనిక, బీద, ఉన్నత, నిమ్న భావనను దరిచేరనీక అందరినీ దీవించి కరునించె ఆ కరుణామూర్తికి కానుకగా ఆ పసిపిల్లచే ఆభరణాలు అందిద్దాం. అవకాశం ఉన్న అందరం బాగస్వాములం అవుదాం. పిల్లలను ప్రోత్సహిదాం- అమ్మవారి అనుగ్రహం పొందుదాం. కేవలం పాఠశాల స్థాయి విద్యార్థుల విరాళాలతోనే అమ్మవారికి అలంకరణ అభరణాల సమీకరణ ఆన్న ఆలయ ఆశయాన్ని అందుకుని, 108 రోజుల పాటు రోజు 5 రూ. పొదుపు చేసి అమ్మవారి ఆలయంలో అందించిన నందివనపర్తి గ్రామానికి చెందిన కొండూరి సుధ రామనాథం గార్ల అమ్మాయిలు లక్ష్మి మనస్విని మరియు లక్ష్మి తపస్విని..
చిన్నారులకు అమ్మవారి ఆశీస్సులు కలగాలని ప్రార్థిద్దాం.
No comments:
Post a Comment