Friday, 23 June 2023

ప్రొద్దుటూులో విగ్రహం

బోలో సరస్వతీ మాతాకి జై..   

  గుణ సంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్జ్వలమవ్వాలి అనే ఆశయ స్ఫూర్తితో...
జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి ద్వారా అన్ని విద్యా స్థాయిల విద్యాసంస్థలకు జ్ఞానప్రదాత, చదువుల తల్లి శ్రీ సరస్వతి మాత ప్రతిమలను అందివ్వాలనే సంకల్పo జరిగింది.
ఇప్పటి వరకు *రెండు తెలుగు రాష్ట్రాలలో  సుమారు 200 విద్యా సంస్థలకు అమ్మవారి ప్రతిమలు  అందించబడ్డాయి*. అందులోబాగంగా
*కడప జిల్లా పొద్దుటూరు లోని YVS Municipal బాలికల ఉన్నత పాఠశాలలో పూజ్యశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ కరకమలములచే జూన్ 21 వ తేదీన జ్ఞానసరస్వతి అమ్మవారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది*..
సుమారు 1100 పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలో అమ్మవారి అనుగ్రహంతో నిత్య చైతన్యం జరగాలని ఆశిస్తూ..
విగ్రహ ఏర్పాటుకు సమన్వయ కర్తగా ఉన్న శ్రీ మేకం సురేష్ బాబు గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ కాశీ ప్రసాద్ రెడ్డి గారికి, ఉపాధ్యాయులకు మరియు ప్రొద్దుటూరు గ్రామస్తులకు శుభాకాంక్షలు💐.. శుభాభినందలు.
:~ సదా వెంకట్,
 *జ్ఞానసరస్వతి సంస్థాన్ & జ్ఞానసరస్వతి సేవాసమితి.*

No comments:

Post a Comment