Facebook post of 06.04.2020
శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి..
దేవాలయం స్ఫూర్తిగా, సహృదయులయిన సేవాతాత్పరుల సహకారంతో,అపత్కాల సమయంలో ఆపదలో ఉన్న మనతోటి వారికి అందిస్తున్న ఈ సహకారం
ఎలాంటి తారతమ్యం చూపక
ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయం వద్దకు తీసుకోవాల్సిన వారిని పిలిచి నిత్యావసర వస్తువుల కిట్ ను అందించే ఏర్పాటు చేసుకుంది ట్రస్ట్.
దేవాలయ పరిసర గ్రామాలలో, స్థానిక అధికారుల ద్వారా సమాచారం సేకరించి, అవసరాలలో ఉన్న కుటుంబాలకు సహకారం అందిస్తుంది.
వారు పేదవారు బీదవారు అనే ఉద్దేశ్యంతో కాకుండా, ఆపదలో ఉన్నారు, అత్యవసరాలలో ఉన్నారు అనే భావనతో, ఆ భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తూ*...
*నిండైన సమర్పణా భావంతో అందించాలని ట్రస్ట్ సందేశం.
గత 4 రోజులుగా కావాల్సిన సరుకులను తయారీ చేసుకుని, స్థానిక అధికారుల సమన్వయంతో ఈ రోజు ప్రారంబించిన నిత్యావుసర కిట్ ల పంపిణీ.
ప్రారంభ కార్యక్రమములో స్థానిక CI గారు, RI గారు, ఆలయ క్షేత్ర గ్రామ సర్పంచ్ గారు మరియు
ఆలయ వ్యవస్థాపకులు సదా వెంకట్ మరియు ఆలయ వివిద మండలీల సభ్యులు పాల్గొన్నారు.
ప్రారంభ రోజు : ఆలయ పరిసర గ్రామం నజ్దిక్ సింగారంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద, ఆ గ్రామ సర్పంచ్ గారు సమన్వయంతో 20 మంది అవసర దారులకు అందించారు GNANA SARASWATHI SEVASAMITHI Trust సభ్యులు.
:~ GSSTrust.
No comments:
Post a Comment