Wednesday, 5 April 2023

HELPING HANDS to NEEDY


FACEBOOK Post of 06.04.2022
Thanks to Everyone Who Involving in the CAUSE @ #HELPINGHANDS to #NEEDY_ #CARONA CRISIS TIME*.
Our Efforts are going on. 
Join us Convenient.

 With the help of Local Officials_ #MRO, #MPDO, #POLICE Dept. and #PublicLeaders we will Distribute the Daily Need KITs for NEEDY in Near by Villages of Gnana Saraswathi Temple,NandhiWanaparthy, Yacharam Mndl, RR Dist.

_____________________________
సమాజంలో స్పందించే గుణం అమోఘం..అదే భారతీయం.
ఆపదలో ఉన్న తోటివారిని ఆదుకునే విషయంలో భారతీయులు అప్పటి నుండి ఇప్పటి వరకు.. ఎప్పటికీ విజేయులే...
అందులో ఆలయాలది అగ్రేసర పాత్రే.. 
  ఆనాటి నుండి నేటి వరకు  ఆలయాల ద్వారా మానవునికి  అందిన సంస్కారం, సహకారం అద్వితీయం.. అది గుణించలేనిది.
ఆలయాలు కేవలం యజ్ఞ_యాగాదులు, పూజా_ప్రసాదాలకే పరిమితం కాలేదు.
మనిషి నిత్య జీవితానికి కావలసిన చైతన్యాన్ని అందించాయి, సామాజిక కట్టుబాట్లను తెలిపాయి, అవుసరమైతే సంఘటిత శక్తులుగా నిలిచాయి... సమాజం అందకారంలో ఉన్నప్పుడు జ్ఞానజ్యోతులు వెలిగించాయి, ఆపదలో ఉన్నప్పుడు ఆపన్న హస్తాలయినాయి. అందుకే ఆలయాలు మానవ వికాస కేంద్రాలయినాయి..
ఇప్పుడు మనం అదే స్ఫూర్తిని కొనసాగిద్దాం. ఆపదలో ఉన్న తోటివారికి  మన పరిదిలో మనం అండగా నిలబడదాం. ఆ పరంపరను కొనసాగిద్దాం. అది మన సామాజిక భాద్యత కూడా.

_____________________________
భారతీయ సమాజం చాలా విశాలమైనది, దృడమైనది...
కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎన్నిటినో ఎదుర్కొన్నది..తిరిగి అంతే తీవ్రతగా కోలుకుని నిలబడ్డది...ఇప్పటికీ అదే స్థితిని కొనసాగిస్తున్నది. యావత్తు ప్రపంచం ఈ కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవడానికి అన్ని శక్తులను ఒడ్డి కూడా ఆ మహమ్మారి తీవ్రతను తట్టుకోలేకున్నది. 
కానీ భారతంలో పరిస్థితులు అందుకు కొంత బిన్నంగా కనిపిస్తున్నాయి... 130 కోట్ల జనాభా కలిగి ఉండి కూడా, ఆశించిన స్థాయిలో వసతులు ఏమీ లేకున్నా సంఘటిత శక్తిద్వారా కరోనా మహమ్మారిని నిలువరింపజేస్తున్న ప్రయత్నాలు అమోఘం. అందుకు సహకరిస్తున్న భారతీయుల క్రమశిక్షణ గొప్పది...
  అందరం కలిసి చేస్తున్న ఈ ప్రయత్నానికి ప్రకృతి ప్రసాదంగా, కాలం తయారుచేసి పంపిన నాయకత్వ పటిమ కూడా  గొప్ప మార్గదర్శనం చేస్తున్నది. మనందరి సామూహిక మరియు సంఘటిత క్రమశిక్షణ ఈ కరోనా మహమ్మారి నుండి తప్పక తప్పిస్తుంది.. అజేయులుగా నిలుపిస్తుంది.
ఇంతటి సంఘటిత క్రమశిక్షణను  ఇంకొన్నాల్లు అనుసరిస్తే మనం తప్పక విజయం సాదిస్తాం.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02rPi724D7d5q7pd1vN1KLLQwuxsBUiq7rY7tpFxFXt3J6TpD5EqYHFGQDWf6UBTZRl&id=100006723364953&mibextid=Nif5oz

భారత్ మాతాకీ జై.
:~ సదా వెంకట్.
GSSTrust.

No comments:

Post a Comment