Sunday, 11 August 2024

ప్రచార మండలి సమావేశం

*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*.
మానవ వికాస కేంద్రాలుగా విలస్లిలినవి మన ఆలయాలు, ఆ పరపరను కొనసాగిద్దాం అనే ఆశయ స్ఫూర్తితో.. ఏర్పడిన జ్ఞానసరస్వతి దేవాలయ నిర్వహణ కోసం ఏర్పడిన మండలీల పటిష్టత కోసం...

*GSS ప్రచార మండలి సభ్యులకు ఆలయ ఫౌండర్ శ్రీ సదావెంకట్ గారి మార్గదర్శనం*

*మానవ సంస్కార కేంద్రాలు అమ్మ ఒడి, గుడి మరియు బడి అని..* ఆ సంస్కార కేంద్రాల ద్వారా జరిగే మానవతా వికాస కార్యాల కోసం నిస్వార్థంగా, నిజాయితీగా పనిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది.

*ప్రతీ వ్యవస్థకు సమయం మరియు సంపదను రెండూ ముఖ్య మూలా భూమికలు... ఆ రెండు వ్యక్తిగతంగా అందరూ సమర్పణా భావంతో ఇవ్వాలని, అది మంచి కార్యకర్త లక్షణమని అది అందరూ అలవరచుకోవాలన్నారు.*

*వ్యవస్థలో ఉన్న వ్యక్తులందరూ సమానమని.. కుల, వర్గ, రాజకీయాలకు అతీతంగా  సేవలో ఉండాలని తెలిపారు. అందుకోసం  పురాతన ఆలయాల వ్యవస్థను, సంస్ధలను దగ్గరగా పరిశీలన చేయాలి.. స్థాయి మరిచి సేవలో పాల్గొనే అమృత్ సర్ స్వర్ణ దేవాలయం సేవకులు*.

* వ్యక్తిగతంగా అప్పజెప్పిన/ తీసుకున్న ప్రతీ పనిని పూర్తి చేయడానికి 100% బాధ్యతతో నిర్వర్తించాలని.. అందుకు వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్న 16 సం. వయసున్న ఖుధీరాం బోస్ జీవితాన్ని  తెలిపారు*.

*ఒక్కసారి వ్యవస్థలోకి వచ్చిన తర్వాత అందరితో  కలిసి పని చేయడం అలవర్చుకోవాలన్నారు*.

*మండలీలోని సభ్యులందరూ ఆలయంలో జరిగే ప్రతీ ఉత్సవానికి ముందు మరియు ఉత్సవం తరువాత జరిగే పనులను సమీక్షించుకుని, ఎవరెవరికి ఏ పనులపై ఆసక్తి ఉంటుందో చూస్కోని బాధ్యతలు నిర్వహించాలన్నారు*.

*ప్రచార మండలి పటిష్టత కోసం, మండలిలోని సభ్యుల సంఖ్య పెంచుకోవడం ప్రతి సభ్యుడు వ్యవస్థకు ఇంకొంతమందిని పరిచయం చేయాలి, మండలిలో ఉన్న సభ్యులందరికీ తమ మండలి యొక్క పనుల పట్ల పూర్తి అవగాహన ఉండాలన్నారు*.

:~ *జ్ఞానసరస్వతి సేవాసంస్థాన్*

No comments:

Post a Comment