Sunday, 2 June 2024

మొదటి నెల వేతనంతో మొక్కు తీర్చుకున్న కొండూరు వర్ష !!

 
చదువుల తల్లి, జ్ఞానప్రదాత, కొలువుల కల్పవల్లికి నివేదన!!
నందివనపర్తి గ్రామ వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ కొండూరు కవిత అంజయ్య గారి కుమార్తె కొండూరు వర్ష INOVALON INDIA PVT. LTD. కంపెనీలో Software Engineer* గా ఉద్యోగం సంపాదించారు.

నందివనపర్తిలో  కొలువుల కల్పవల్లిగా విరాజిల్లుతున్న జ్ఞానసరస్వతి అమ్మవారి అనుగ్రహముతో ఉద్యోగం పొందానని, ఉద్యోగం వచ్చాక అమ్మవారిని దర్శించుకొని తన మొదటి నెల వేతనం ₹41,735/- రూ.ను తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ సభ్యులకు అందించారు. ఆలయ సభ్యులు వర్ష గారిని అభినందించారు.

వర్ష గారికి శుభాభినందనలు..

వర్ష గారు జీవితoలో ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని అందరం ఆశిద్దాం. ఆశీర్వదిద్దాం.

~ జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్
~ జ్ఞానసరస్వతి సంస్థాన్

No comments:

Post a Comment