Friday, 16 February 2024

పాఠశాలకు అమ్మవారి విగ్రహాలు - 2024

బోలో సరస్వతీ మాతాకి జయ్ .. 
   
గుణ సంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్జ్వలమవ్వాలి అనే ఆశయ స్ఫూర్తితో...
జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి ద్వారా అన్ని విద్యా స్థాయిల విద్యాసంస్థలకు జ్ఞానప్రదాత, చదువుల తల్లి శ్రీ సరస్వతిమాత విగ్రహాలను అందివ్వాలనే సంకల్పo జరిగింది.
2018 సంవత్సరం నుండి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో  సుమారు 200 విద్యా సంస్థలకు అమ్మవారి విగ్రహాలు  అందించబడ్డాయి.

 అందులో భాగంగా
వసంత పంచమి -2024 సందర్భంలో..

ZPHS, మజీద్ పూర్, రంగారెడ్డి జిల్లా* మరియు ZPHS, కొమ్ముగూడెం, భద్రాద్రి జిల్లా లో ఆవిష్కరణ జరిగిన విగ్రహాలు.

ఆ పాఠశాలల్లో అమ్మవారి అనుగ్రహంతో నిత్య చైతన్యం జరగాలని ఆశిస్తూ..

:~ సదా వెంకట్,
 జ్ఞానసరస్వతి సంస్థాన్ & జ్ఞానసరస్వతి సేవాసమితి.

No comments:

Post a Comment