Tuesday, 30 January 2024

సంకల్పభవన్ లో కార్యకర్తల సమావేశం

సంకల్ప భవన్ లో  కార్యకర్తల సమావేశం
( GSS_వివిధ మండలీల సభ్యులు)

తేదీ: 30.01.2024, మంగళవారం.

సమావేశంలో శ్రీ అమర లింగన్న, ధర్మ జాగరణ సంస్థ, క్షేత్ర ప్రముఖ్ (కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు) గారి మార్గదర్శనం..

1. పూర్వం దేవాలయం కేంద్రంగా విద్య, వైద్యం, న్యాయం, భోజన వ్యవస్థ జరిగేదని, ఆ వ్యవస్థను ఆదర్శంగా తీసుకుని ఈ దేవాలయం ద్వారా విద్య - వైద్యం కోసం పనిచేయాలనే సంకల్పం గొప్పదన్నారు.

  2. శ్రీరాముడే మనకు ఆదర్శం అన్నారు ఆయన జీవితం ఆధారంగా కుటుంబ వ్యవస్థ కోసం ప్రపంచం మొత్తం భారత దేశం వైపు చూస్తున్నది.
అలాంటి వ్యవస్థ నిర్మాణం కోసం అనేక మంది నిస్వార్థoగా పనిచేశారు. అలాంటి ఆదర్శం తీసుకుని ఈ దేవాలయం పనిచేయడం అభినందనీయం.

3. సమాజంలో జరుగుతున్న మంచి చెడును తల్లిదండ్రులు వారి పిల్లలకు వివరించాలన్నారు. అలాoటి సంస్కార వంతమైన విషయాలు దేవాలయం కేంద్రంగా జరిగితే అద్భుతంగా ఉంటుంది.

ఆలయ ఫౌండర్ సదావెంకట్ గారు

1. దేవాలయం కేంద్రంగా సేవాసమితి ద్వారా ఏర్పడిన 14 మండలీలను ఇంకా పటిష్టం చేసుకొని అన్ని తార తమ్యాలు మరిచి పనిలో ఉండాలి.
వచ్చే వసంత పంచమి రోజున పూజ్య స్వామీజీ ద్వారా అన్ని మండలీల సభ్యులకు ఆశీస్సులు ఉంటాయి.
2.  వ్యవస్థ కోసం అన్ని స్థాయిలు పనిచేసే విధంగా కార్యకర్తలు నిలబడాలి.  ఈ మండలీల సభ్యులు  ఒక సంవత్సరం కాలం పాటు అదే మండలీలలో పనిలో ఉంటారు.
సమాజహితం కాంక్షిస్తూ ఆలయం కేంద్రంగా కొన్ని సామాజిక కార్యక్రమాల నిర్వహణకు సేవాసమితి యోజన చేసింది.

1. సంకల్ప భవన్లో 14 సం. లోపు చిన్నారులకు పుట్టినరోజు వేడుకలు.

2. దేవాలయం కేంద్రంగా తల్లిదండ్రులకు పాద పూజ.

3. బాల సంస్కార కేంద్రం ఏర్పాటు.

:~ జ్ఞానసరస్వతి సంస్థాన్

Sunday, 7 January 2024

ఆలయ వ్యవస్థ పటిష్టత కోసం ఏర్పాటు చేయబడ్డ వివిధ మండలీలలో భాగంగా....GSS మాతృమండలి సభ్యుల సమావేశం.

శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.

ఆలయ వ్యవస్థ పటిష్టత కోసం ఏర్పాటు చేయబడ్డ వివిధ మండలీలలో భాగంగా....

*GSS మాతృమండలి సభ్యుల సమావేశం*.

*ఆలయ వ్యవస్థ అవసరాలు మరియు సేవా కార్యక్రమాల దృష్ట్యా సేవాసమితి మాతృమండలి 3 విభాగాలుగా ఏర్పాటు*.

1. ఉత్సవ విభాగం 
2. మూల నక్షత్ర హోమం నిర్వహణ విభాగం
3. లలితా పారాయణం & అన్నపూజ నిర్వహణ విభాగం.

ఏర్పడిన 03 విభాగాల మాతృమండలి సభ్యులు సంవత్సర కాలం పాటు బాధ్యతలలో ఉంటారు.  ఎంపికైన సభ్యులకు ఆలయ వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు మండలీల విధులు, నిర్వహణ బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ సలహాలు_సూచనలు తెలిపారు.

*ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాల  గురించి మండలి ఇంచార్జి మరియు సహాయక్ ద్వారా మండలిలో ఉన్న సభ్యులందరికీ పూర్తి అవగాహన కల్పించడం*.

*వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది,  వ్యవస్థని వ్యక్తులే పటిష్టం చేయాలని.. వ్యవస్థ కోసం పని చేయాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత ప్రాధాన్యతపై ఎక్కువ శ్రద్ద చూపరాదు*..

*వ్యవస్థ కోసం సమయం ఇచ్చేవారిని మరియు సంపద ఇచ్చేవారిని గుర్తించి, తగు రీతిలో వారికి  గౌరవం ఇవ్వాలని తెలిపారు*.

*ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన వారందరూ అన్ని తారతమ్యాలు  @కుల, ధన, అధికార ప్రస్తావన  లేకుండా సహృదయ సేవా భావనతో, నిస్వార్థంగా ఉత్సవాల వ్యవస్థలో భాగస్వామ్యం కావాలన్నారు*.

*రాబోయే రోజుల్లో కనీసంగా 108 మంది సభ్యులతో మాతృమండలిని ఏర్పాటు చేసుకుని  అతి పెద్ద మాతృమండలిగా అన్ని రకాల సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలన్నారు*.

*వ్యవస్థలో కొత్తతరం యువతని భాగస్వామ్యం చేసి రాబోయే తరాలకు సేవా భావం పెంపొందించాలన్నారు*

ఆలయ ఉత్సవాలలో మండలి వారిగా పాల్గొనటకు పూర్వ తయారీ కోసం సమావేశాలు నిర్వహించుకుని, బాధ్యతల విభజన చేసుకోవాలి.

ఈ సమావేశంలో విభాగాల వారిగా పాల్గొన్న మాతృమoడలి సభ్యులు.

1. మూల నక్షత్ర నిర్వహణ విభాగం :: 14
2. లలితా పారాయణం & అన్నపూజ నిర్వహణ విభాగం :: 08
3. ఉత్సవాల నిర్వహణ :: 10