Wednesday, 16 August 2023

విగ్రహ దాతలకు ఆహ్వానం

*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*.

*విద్యాధనం శ్రేష్టధనం _ విద్యా దానం మహత్తరo.*

*సేవాతత్పరులకు, విద్యాభిమానులకు సాదర స్వాగతం*..


*గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్జ్వలమవ్వాలి అనే ఆశయ స్ఫూర్తితో అన్ని స్థాయిల విద్యాసంస్థలలో చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు చేయాలని సంకల్పం జరిగింది.*
 
 చదువుతో పాటు విద్యార్థికి  సంస్కారం అందాలని, అందుకు  విద్యాలయాలే వేదికలుగా, రేపటి తరానికి చైతన్య కేంద్రాలుగా నిలవాలని ఈ నిశ్శబ్ద విద్యా మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టింది  సేవాసమితి ట్రస్ట్.
 
ఏ తారతమ్యం చూపక అందరినీ విగ్రహ దాతలుగా స్వీకరణ & అడిగిన విద్యాసంస్థలకు ఉచితంగా అమ్మవారి విగ్రహాలు అందించడo జ్ఞానసరస్వతి సేవాసమితి ఉద్దేశ్యం.

*మొదటి విడతగా 2018, జనవరిలో శ్రీ సరస్వతీ మహాయజ్ఞం నిర్వహించి తెలంగాణలోని 108 విద్యాసంస్థలకు అందించిన విషయం మనందరికీ విధితమే*. 
*ఈ విద్యా మహాయజ్ఞం నిరంతరం కొనసాగించాలానే లక్ష్యంతో ఇప్పటి వరకు 200 పైగా అమ్మవారి విగ్రహాలు వివిధ విద్యాసంస్థలకు అందించబడ్డాయి*.
*ఈ విద్యా మహాయజ్ఞానికి స్పందించిన అనేక విద్యా సంస్థలు అమ్మవారి ప్రతిమల ఏర్పాటుకోసం అభ్యర్థిస్తున్నారు.*
అందుకు మనం సిద్ధపడాలి.

కావున ఈ మహాయజ్ఞంలో భాగంగా *ఆశ్వీయుజ మాసం _ 2023,అక్టోబర్ లో జరిగే ""దసరా శరన్నవరాత్రి"" ఉత్సవాలలో శ్రీ సరస్వతీ హోమం నిర్వహించి  అమ్మవారి విగ్రహాలను విద్యాసంస్థలకు అందివ్వాలని ట్రస్ట్ నిర్ణయం.* 

అందుకోసం *ఏ తారతమ్యం చూపక సేవాతత్పరులను, విద్యాభిమానులను  విగ్రహ దాతలుగా ఆహ్వానిస్తోంది జ్ఞాన సరస్వతి సేవాసమితి*.
(విగ్రహ దాతలకు... 
*శ్రీ జగద్గురు శంకరచార్య హంపీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్తాన పీఠాధీశులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ* కరమలములచే  ఆశీపూర్వక అభినందన ప్రశంసా పత్రం అందివ్వబడును.)

*విగ్రహ దాతలుగా ఉండాలనుకునే వారు మరియు విగ్రహాలు కావాల్సిన విద్యాసంస్థల వారు సేవాసమితి సభ్యులను సంప్రదించగలరు*.

*9963163330, 9963263330*

*విద్యాధనం శ్రేష్ఠ ధనం_ విద్యాధనం మహాదానం.* 

భవదీయ...

సదా వెంకట్, 
ఫౌండర్ & మేనేజింగ్ ట్రస్టీ,
*జ్ఞానసరస్వతి సంస్థాన్* & 
*జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్*.

No comments:

Post a Comment