Friday, 23 June 2023

ప్రొద్దుటూులో విగ్రహం

బోలో సరస్వతీ మాతాకి జై..   

  గుణ సంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్జ్వలమవ్వాలి అనే ఆశయ స్ఫూర్తితో...
జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి ద్వారా అన్ని విద్యా స్థాయిల విద్యాసంస్థలకు జ్ఞానప్రదాత, చదువుల తల్లి శ్రీ సరస్వతి మాత ప్రతిమలను అందివ్వాలనే సంకల్పo జరిగింది.
ఇప్పటి వరకు *రెండు తెలుగు రాష్ట్రాలలో  సుమారు 200 విద్యా సంస్థలకు అమ్మవారి ప్రతిమలు  అందించబడ్డాయి*. అందులోబాగంగా
*కడప జిల్లా పొద్దుటూరు లోని YVS Municipal బాలికల ఉన్నత పాఠశాలలో పూజ్యశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ కరకమలములచే జూన్ 21 వ తేదీన జ్ఞానసరస్వతి అమ్మవారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది*..
సుమారు 1100 పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలో అమ్మవారి అనుగ్రహంతో నిత్య చైతన్యం జరగాలని ఆశిస్తూ..
విగ్రహ ఏర్పాటుకు సమన్వయ కర్తగా ఉన్న శ్రీ మేకం సురేష్ బాబు గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ కాశీ ప్రసాద్ రెడ్డి గారికి, ఉపాధ్యాయులకు మరియు ప్రొద్దుటూరు గ్రామస్తులకు శుభాకాంక్షలు💐.. శుభాభినందలు.
:~ సదా వెంకట్,
 *జ్ఞానసరస్వతి సంస్థాన్ & జ్ఞానసరస్వతి సేవాసమితి.*

Monday, 19 June 2023

సంకల్ప భవన్ నిర్మాణం

Activity of 20.06
2018
శ్రీ మాత్రేనమహ....

బోలో సరస్వతీ మాతాకి జై..

అక్షయమైన అక్షరజ్ఞానం చిన్నారులకు అందిస్తూ...
 ఏ తారతమ్యం చూపని ఆ చదువులమ్మ చల్లని ఆశీస్సులు అతి బీదలకు కూడా చేరవేయాలనీ...
అక్షర స్వీకారం జరిగిన నాడే ఆ పసిబిడ్డ జీవితానికి మెండైన భరోసా కలగేలా తల్లిదండ్రు మరియు పెద్దల సంకల్పం జరగానీ...

ఆ""వేడుకకు వేదికగా"" నిలవాలని నిర్మించతలపెట్టిన "సంకల్ప భవన్" నిర్మాణం పనులు ప్రారంభం కావడం శుభసూచకం.
ఈ మహాకార్యంలో ప్రత్యక్ష బాగస్థులకు,  సహృదయ దాతలకు, సేవా తత్పరులకు  మరియు సహకరిస్తున్న వారందరికీ "జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్" తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
( ఆలయ అభివృద్ది పనులలో అందరం బాగస్వాములం అవుదాం _ మన వంతు సహకారం అందిద్దాం)..

~ జ్ఞానసరస్వతి సేవాసమితి.
(జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి)

విగ్రహాల కోసం విద్యాసంస్థల సంపర్కం

GSS_విద్యాసంస్థల సమన్యయ కమిటీ సబ్యులందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. 
సంస్కారవంతమైన సమానవిద్య అందరికీ సమానంగా అందాలి_ గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి , తద్వార దేశ భవిష్యత్తు ఉజ్వలమవ్వాలి అనే ఆశయ స్పూర్తితో అన్ని స్థాయిల  విద్యా సంస్థలలో "చదువుల తల్లి, జ్ఞానప్రధాత "సరస్వతి మాత ప్రతిమల" ఏర్పాటుకు సంకల్పించింది జ్ఞానసరస్వతి దేవాలయం,నందివనపర్తి. అందులో భాగంగా 2018లో ఒకే ముహుర్తానికి 108 అమ్మవారి ప్రతిమలు "108 విద్యాసంస్థలలో"   ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తోంది. దేవాలయం కేంద్రంగా 9 మండలాలలోని అన్ని విద్యాసంస్థలను సంప్రదించే కార్యక్రమం ప్రారంభం. శుభారంభం. ఈ రోజు  యాచారం మండలంలోని  ప్రబుత్వ, ప్రైవేటు పాఠశాలలు (15) సంప్రదించడం పూర్తి.  సహకరించిన  ఆయా విద్యా సంస్థలు యాజమాన్యాలకు దేవాలయం తరపున ధన్యవాదాలు.
**  విగ్రహ దాతలు మరియు అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేయగోరే  విద్యాసంస్థలు సంప్రదించవచ్చు.

Friday, 9 June 2023

*బాలకుల సమర్పణ*


FB post of 10.06
2017.
కేవలం పాఠశాల స్థాయి విద్యార్థుల విరాళాలతోనే అమ్మవారికి అలంకరణ అభరణాల సమీకరణ ఆన్న 
ఆలయ ఆశయాన్ని అందుకుని, 108 రోజుల పాటు రోజు 5 రూ. పొదుపు చేసి అమ్మవారి ఆలయంలో అందించిన చర్ల రిషిక్ రెడ్డి. S/O రుద్ర సురెందర్ రెడ్డి.  అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆశిస్తూ అందరం ఆశీర్వదిద్దాం.
________________________________
విద్యార్థుల వికాసం కోసం - విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మితమవుతున్న శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.

 సంకల్పం: "పసిపిల్లల పైసలతో చదువులమ్మకు ఆభరణాలు" 

పసిపిల్లలన్నా, చదువుతున్న పిల్లలన్నా చదువులమ్మ సరస్వతీ దేవికి ఎనలేని ప్రీతి. ఆమె అనుగ్రహమే వారి ఎదుగుదల/ ఉన్నతి. 
** ఆలయ నిర్మాణానికి సంకల్పించిన నాడే..ఆలయంలో ప్రతిష్టించే అమ్మవారి మూలవిరాట్టు మరియు అమ్మవారి అలంకరణ ఆభరణాలు కేవలం పాఠశాల స్థాయి (14సం.రాల లోపు) పిల్లల విరాళాలతో సమకూర్చాలనేది సంకల్పం. 2009 స. లో ప్రతిష్టించిన అమ్మవారి మూలవిరాట్టు అలానే పూర్తిచేయబడింది. 
ఆభరణాల కోసం: పాఠశాల స్థాయి పిల్లల విరాళాలతోనే ఆభరణాల సమీకరణ అమ్మవారి ఆభరణాలకోసం విరాళం అనే భావన పిల్లల్లో కలిగించి, పొదుపుచేసి సమర్పించిన విరాళాలు మాత్రమే స్వీకరించబడును. ప్రతిరోజు 5 రూపాయలకు తగ్గకుండా 108 రోజులు జమ చేసిన తరువాత ఆ డబ్బులను దేవాలయ కమిటీకి అందించడం.. అన్ని విరాళాలు కలిపి దేవాలయం వారే ఆభరణాలు తయారు చేయిస్తారు. ధనిక, బీద, ఉన్నత, నిమ్న భావనను దరిచేరనీక అందరినీ దీవించి కరునించె ఆ కరుణామూర్తికి కానుకగా ఆ పసిపిల్లచే ఆభరణాలు అందిద్దాం. అవకాశం ఉన్న అందరం బాగస్వాములం అవుదాం. పిల్లలను ప్రోత్సహిదాం- అమ్మవారి అనుగ్రహం పొందుదాం. 

ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశ్యంతో దేవాలయం తరపున స్టిక్కర్స్ పంపిణి చేయడం జరుగుతుంది..

స్టిక్కర్స్ కోసం సంప్రదించవలసినవారు..

రాఘవేంద్రశర్మ - 9618518609,  
నిఖిల్ - 9885858916..

Thursday, 8 June 2023

ఆలయ పుష్కర కుంభాభిషేక మహోత్సవం

ఆలయ శ్రేయోభిలాషులందరికీ శుభాబినందనలు, శుభాకాంక్షలు...
ఆలయ #పుష్కరకుంభాబిషేకమహోత్సవం  మరియూ నూతవ #దేవతావాహనాలప్రతిష్ట కార్యక్రమాలు  సంపూర్ణమయినాయి.

ఈ ఉత్సవాల నిర్వహణలో ప్రత్యక్షంగా బాగస్తులయిన  #సేవాసమితి సభ్యులకు, సహకరించిన వారికి మనందరి తరపున ప్రత్యేక శుభాకాంక్షలు.

ఆలయ శ్రేయోభిలాషులు, భక్తుల ఆగమనంలో ఎంతో వైభవంగా నిర్వహించాలనుకున్న #పుష్కరకుంభాబిషేకమహోత్సవం ఈ కరోనా మహమ్మారి కారణంగా కుదించబడిoది.

వ్యవస్థలో తప్పనిసరిగా పాల్గొనాల్సిన అతి కొద్దిమందితో ఈ ఉత్సవాలు పూర్తయినాయి..  

అమ్మవారి అనుగ్రహం, 
పూజ్యశ్రీ #విద్యారణ్యభారతిస్వామీజి ఆశీస్సులతో ఈ ఉత్సవాలు ఉన్నకొద్దిలో చాలా బగా నిర్వహించబడ్డాయి.
 
సమయానుకూలంగా ఆలయ శ్రేయోభిలాషులకు ఉత్సవ సంబందిత వీడియోలు అందుతాయి...

ఆలయ #నిర్మాణానికి, #నిర్వహణకు సహకరిస్తున్న #ధర్మకర్తలమండలి సభ్యులకు, #పోషకమండలి సభ్యులకు ప్రత్యేక శుభాబినందనలు.

#సమయసమర్పణలో ఆలయ నిర్మాణ, నిర్వహణ పనుల్లో  నిస్వార్థంగా నిరంతర సేవలో ఉన్న కొంతమంది కార్యకర్తలకు మనందరి తరవున శుభాభినందలు.

ఆలయాలు కేవలం పూజలు, యజ్ఞాలు, యాగాల నిర్వహణకే కాదు, అవి #ఆపన్నహస్తాలు, #సామాజికసమరసతానిలయాలు
#నిత్యచైతన్యకేంద్రాలు, 
#సేవాకార్యక్రమాలకునిలయాలు అన్నీ కలిపి 

"ఆలయాలు #మానవవికాసకేంద్రాలు గా విలసిల్లినవి, ఆ పరంపరను కొనసాగిద్దాం" 
అనే స్ఫూర్తితో  ఈ దేవాలయం కేంద్రంగా #విద్యా, #వైద్య రంగాలలో అవసరార్ధులకు సరైన సమయంలో ఆసరా అందివ్వాలనే ఆలోచనతో కొన్ని కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. త్వరలో అన్ని విషయాలు తెలుపబడుతాయు.  అవకాశం ఉన్న అందరం బాగస్వాములం అవుదాం...

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0LkETLnu8ZQ4CZT18ejsmSDGkDKJ3LhofKCAHiiEKAALArR5nJLkKojc3mScQ5LdHl&id=100006723364953&mibextid=Nif5oz

కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలతో...

#సదావెంకట్,
#ఫౌండర్, #జ్ఞానసరస్వతిసేవాసమితి & #జ్ఞానసరస్వతిసంస్థాన్