|| ఫిబ్రవరి 22వ తేదీ రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బలిదాన దివసం.||
ఝాన్సీ లక్ష్మీబాయి తాంత్యాతోపే వంటి వీరులు నిర్వహించిన 1857వ సం. పోరాటానికి 10 సంవత్సరాల ముందే ఆంగ్లేయులను తరిమి వేయడానికి కత్తిపట్టిన వీరుడు "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి".
బ్రిటన్ నుండి వచ్చిన ఆంగ్ల అధికారులతో సహా కిరాయి సైనికులను కలుపుకొని నరసింహారెడ్డి కత్తికి బలైన వారి సంఖ్య 700 కు పైగానే ఉంటుంది.
శత్రువులను ఊచకోత కోసిన వీరి పౌరుషానికి పరాక్రమానికి హాడలిపోయిన ఆంగ్లేయులు 173 సంవత్సరాల క్రితం అనగా 22 ఫిబ్రవరి 1847 సం. నాడు కుట్రతో వెన్నుపోటు పొడిచి బంధించి తదుపరి ఉరితీశారు. వీరి వెంట ఉన్న స్వాతంత్ర వీరులను అనేకమందిని అంగవికలురుగా చేశారు ఎంతోమందిని ద్వీపాంతర వాస శిక్ష కోసం ఎక్కడికో ఓడల పైన పంపించారు. ఆ తదుపరి వారి జాడ తెలియలేదు.
*ఉరి తీయబడిన వారి శరీరాన్ని దహనం చేయడానికి అనుమతినివ్వక కోవెలకుంట్ల కోట గుమ్మానికి అలాగే వేలాడదీసి ఉంచారు. శరీరం అంతా శిథిలమైపోగా వారి తలను 30 సం.లు వ్రేలాడతీసారు, ఇలా చావు భయంతో భయపెట్టి స్వాతంత్ర్య పోరాటాన్ని అపవచ్చనుకున్న తెల్లోడి ఆశలు అడియాశలే అయ్యాయి*...
ఈ 30 సంవత్సరాల కాలంలో వ్రేలాడుతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తలను దర్శించుకోవడం కోసం దేశంలోని నలుమూలల నుండి దేశభక్తులు వచ్చేవారు. ముఖ్యంగా బెంగాల్ నుండి అనేకమంది వచ్చి దర్శించుకుని ప్రేరణ పొందేవారనీ హిందీ సాహిత్యకారులు వ్రాశారు.
ఇలా దేశంకోసం మనధర్మ కోసం పోరాటం చేసి బలిదానమయి అజ్ఞాతంగా ఉండిపోయిన అనేకమంది వీరుల యొక్క త్యాగాన్ని ఇప్పటి తరానికి తెలుపడం ద్వారా గుర్తు చేసుకుందాం, వారికి కోటి కోటి ప్రణామాలు అర్పించుకుందాం.
సేకరణ Keshavaraju Aakarapu ji post