Sunday, 8 January 2023

శ్యామలా నవరాత్రి ఉత్సవాలు-2023


*శ్రీ శ్యామలా నవరాత్రుల పత్రిక ఆవిష్కరణ*.
మహారాష్ట్ర నుండి పూజ్య విద్యారణ్య స్వామీజి కరకమలములచే Virutal గా

 & జ్ఞానసరస్వతి దేవాలయ సమన్వయ మండలి సభ్యులచే @శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*.

మహారాష్ట్ర నుండి పూజ్య విద్యారణ్య స్వామీజి
కరకమలములచే virutal గా..

విద్యార్థుల వికాసం కోసం- విద్యార్థుల బాగస్వామ్యoతో....

*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం*
(ఆలయం చిన్నది-ఆశయం గొప్పది)
*నందివనపర్తి, యాచారం, రoగారెడ్డి జిల్లా*..

*శ్రీమాత్రే నమః*

*శ్రీ శ్యామలా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభోత్సవం-2023.*

హిందూ సనాతన సంప్రదాయం ప్రకారం సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి.

అవి
1. చైత్ర మాసం లో వసంత నవరాత్రులు

2.ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు

3.ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు

4.మాఘ మాసంలో శ్యామలా లేదా మాతంగి నవరాత్రులు.

వారాహి మరియు శ్యామలా నవరాత్రుల ను గుప్త నవరాత్రులు అంటారు.

 ఉత్తర భారతదేశంలో చాలా దేవాలయాల్లో  జరుపుతారు.
*శ్యామలా నవరాత్రులు*:
ప్రతి సంవత్సరం *మాఘ శుక్ల పాడ్యమి మొదలు నవమి వరకు శ్యామల నవరాత్రులని జరపాలని దేవీ భాగవత మహిమ మానస ఉత్తరఖండ సూద పురాణంలో ప్రస్తావించ బడింది.*
*శ్యామలా దేవి తిరుగాడుతూ ఉండే ఈ విశేష  రోజుల్లో చేసే పూజల వల్ల ముఖ్యంగా విద్యార్థులకు అపారమైన జ్ఞాపకశక్తి, సద్భుద్ది కటాక్షిస్తుంది*.

*సమాజ హితాన్ని కాంక్షిస్తూ చేసే పనికి లక్షరెట్లు తోడ్పాటు అంది అద్భుతమైన విజయం  సిద్ధిస్తుంది కుటుంబ వృద్ది జరుగుతుంది. దశ మహా విద్యల్లో మాతంగినిగా ఈ అమ్మవారిని పూజిస్తారు.*

*శ్రీ చక్రంలో సప్తావరనాత్మకమైన  గేయచక్రం లో కొలువై ఉంటుంది ఈ అమ్మవారు*.

*అమ్మవారి అవతారాలు:*
1..లఘు శ్యామల
2 వాగ్వాధిని శ్యామల
3.నకుల శ్యామల
4..హసంతి శ్యామల
5.సర్వసిద్ది మాతంగి
6.వాస్య మాతంగి
7. సారిక శ్యామల
8.సుఖ శ్యామల
9.రాజ మాతంగి/ రాజ శ్యామల
పూజా విధానం:
నిత్య పూజ తో పాటు అమ్మవారిని మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడస నామాలతో పాటు (హృదయం, కవచం, సహస్ర నామావళి, దేవి ఖద్గమాల), కుంకుమార్చన చేయాలి. అమ్మవారికి ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు చీరలను మాత్రమే ధరింప చేస్తూ  రోజూ ప్రసాదంగా పాయసం నివేదించాలి.
*రాజ మాతంగి హోమం చండీ సహిత రుద్రహోమం, మాతంగి చండీ హోమం శ్రీ చక్ర ఉపాసన వేద పండితులు శాస్త్ర బద్దం గా జరిపిస్తారు*. దేవాలయంలో గుప్తంగా ఈ పూజలు జరుపుకోవడం వల్ల గుప్త నవరాత్రులు అని పేరు.

*ఆలయాల ఉత్సవాలలో నూతన ఒరవడి తో విద్యార్థుల భాగస్వామ్యంతో శారద నవరాత్రి ఉత్సవాలు-2023.*

*విద్యార్థుల వికాసం కోసం_విద్యార్థుల భాగస్వామ్యంతో  నిర్మితమైన శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందినాథ క్షేత్రంలో  శ్రీశ్రీశ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామీజీ దివ్య ఆశీస్సులతో  మొట్టమొదటి సారిగా శ్యామలా నవరాత్రి ఉత్సవాలను ఈ 2023 సంవత్సరం నుండి నిర్వహించ సంకల్పించారు  దేవాలయ వ్యవస్థాపకులు శ్రీ సదా వెంకట్ గారు.*

మాతా...! మరకత శ్యామా! మాతంగీ మధుశాలినీ!
కుర్యాత్కటాక్షం కళ్యాణీ! కదంబ వనవాసినీ...!
జయ మాతంగ తనయే...! జయ నీలోత్పలద్యుతే!
జయ సంగీత రసికే!  జయ లీలా శుకప్రియే//

 *ఆ శారదా దేవి సన్నిధిలో విద్యార్థుల సమగ్ర వికాసాన్ని కాంక్షిస్తూ పరిసర ప్రాంతాలలో ఉన్న   విద్యార్థుల భాగస్వామ్యంతోనే  అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సంకల్పించారు.*

అందులో భాగంగా *2023 జనవరి 22 నుండి 30 వరకు పిల్లల పండుగగా ...కన్నుల పండుగగా...ఉత్సవాలు నిర్వహించ బడతాయి*.

*నందినాథ క్షేత్ర పరిసర ప్రాంతంలోని 108 విద్యాసంస్థలకు  శ్రీ శ్యామలా నవరాత్రులకు ఆహ్వానించబడతుoది*

*అన్ని స్థాయిల విద్యార్థులకు (@ KG to PG) ప్రత్యేక దర్శన ఏర్పాట్లతో పాటు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు/ప్రదర్శనకు జ్ఞానసరస్వతి సేవాసమితి అవకాశం కల్పిస్తుంది. అమ్మవారిని దర్శించుకున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా *exam pads*, *pen* మరియు *ఇతర విద్యార్థులకు *pen* అమ్మవారి ప్రసాదంగా అందజేయబడుతాయి.

*విశేషంగా వసంతపంచమి- జనవరి, 26 రోజున చిన్నారులకు పూజ్య విద్యారణ్య భారతి స్వామీజీ కరకమలములచే అక్షరాభ్యాసం మరియు విద్యార్థులచే మహా సరస్వతి హోమం నిర్వహణ*.

*విశేషంగా రథసప్తమి 28/01/2022 రోజున విద్యార్థులతో ప్రత్యేకంగా శ్రీ మాతంగి చండి సహిత రుద్రహోమం*.జరుగుతుంది.

ఆలయంలో మొట్టమొదటి సారి నిర్వహించబడుచున్న *శ్రీ శ్యామలా నవరాత్రి ఉత్సవాలలో అందరం పాల్గొందాం*. ముఖ్యంగా విద్యార్థులను ప్రోత్సాహద్దాo.

*విద్యార్థుల సాంస్కృతిక కళా ప్రదర్శనలకు ఆలయ సంకల్పభవన్ లో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. కావున దేశభక్తి పాటలు,  భగవద్గీత శ్లోకాలు, వేమన/సుమతి శతకాల పద్యాలు, యోగ, కూచిపూడి నృత్యం, తబలా, డోలక్ వంటి అంశాలలో విద్యార్థుల ప్రదర్శనకు ప్రోత్సాహకాలు ఉంటాయి.. విద్యార్థులను గుర్తించి, ప్రోత్సాహిద్దాం*.
:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్ & *జ్ఞానసరస్వతి సేవా సమితి*

No comments:

Post a Comment