Wednesday, 30 November 2022

కార్యకర్తల సమావేశం @ 01.12.2019.



మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన #ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే ఆశయ స్ఫూర్తితో దేవాలయ వ్యవస్థలో  కొనసాగుతున్న #జ్ఞానసరస్వతిసేవాసమితి సభ్యుల

#ఆత్మీయసమావేశం 

*జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై...
దేవాలయాల సంకల్పo, నిర్మాణ విధానం పై మరియు రాబోయే కార్యక్రమాలపై వ్యవస్థాపకులు_సదా వెంకట్ గారిచే క్లుప్త వివరణ..

#జ్ఞానసరస్వతిసేవాసమితి అధ్యక్షులు ఐలపురం జలంధర్ రెడ్డి గారిచే దేవాలయ వ్యవస్థ కోసం ఏర్పాటు చేసిన వివిధ మండలీల పరిచయం..

దేవాలయ వ్యవస్ధపై ముఖ్య అతిథి - 
మాన్యశ్రీ అమర లింగన్న గారి ప్రేరణాత్మకమైన
సందేశంలోని కొన్ని ముఖ్య విషయాలు.
1. సమాజ కార్యక్రమంలో అందరం సమానమే మరియు అందరం కార్యకర్తలమే..

2. ప్రపంచంలోని అనేక దేశాలలో ఇస్లాం, క్రైస్తవం ద్వారా అనేక రకాల దాడులు జరిగినా, జరుగుతున్నా  భారతదేశం ఇంకా హిందు దేశంగా ఇంత పటిష్టం గా ఉండడానికి కాలానుగుణంగా వ్యక్తుల నిర్మాణం చేసారు మన పూర్వులు. ద్ధర్మ స్థాపన కోసం వారి త్యాగం అమోఘం.

3. సంస్కారం పరంగా అందరం సమానమే అది దేవాలయం ద్వారా జరగాలి.

4. సమాజంలో మంచి కోసం ఏమైనా చేయాలనే ఆలోచన చేయాలని అందరిలో రావాలి.
దేవాలయం ద్వారా జరిగే కార్యక్రమాలకు సందపను సమర్పణ చేయడం చాలా గొప్పకార్యం.

5. దేవాలయం కేంద్రంగా వ్యక్తి నిర్మాణం మరియు వ్యవస్థ పటిష్టం జరగాలి.

6. మానవ సంస్కార నిలయాలు అమ్మఒడి, బడి, గుడి ద్వారా అందే సంస్కారం వల్ల వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకుంటాడు.

7.ఇక్కడ జ్ఞానసరస్వతి దేవాలయం కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యార్థులను బాగస్థులను చేసే కార్యక్రమాల ద్వారా రేపటి భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది.

8.రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇది ఒక గొప్ప క్షేత్రం అవుతుంది.
అందుకోసం సమయ సమర్పణ చేస్తున్న కార్యకర్తలు ధన్యులు.నేను మీలో ఒక కార్యకర్తను.
సేవాసమితి ద్వారా జరిగే రాబోయే కార్యక్రమాలు..

1.  వ్యవస్థ పటిష్టత కోసం ఏర్పాటు చేసుకున్న  మండలీల పటిష్టం చేయడం.

2. సేవాసమితి నిర్ణయం ప్రకారం  జనవరి 29న సంకల్ప భవన్ ప్రారంభం, 30న వసంత పంచమి తో పాటు 3 రోజుల కార్యక్రమాలు..

3. 1008 మంది మాతృమూర్తులు, 108 రోజుల పాటు ప్రతి రోజు పిడికెడు బియ్యం తో అమ్మవారికి #అన్నపూజాకార్యక్రమ..

4. పోషక మండలి పటిష్టం( దేవాలయ నిత్య పూజా కార్యక్రమాలకై సమర్పణ చేస్తున్న వారు)

5. 15 సం. లోపు చిన్నారులకు #సంకల్పభవన్ లో పుట్టిన రోజు వేడుకలు మరియు #బాలసంస్కారకేంద్రo నిర్వహణ.

6. #నిత్యాన్నదాన కార్యక్రమం..

సేవాసమితి సమన్వయ మండలి సభ్యులచే మాన్యశ్రీ అమర లింగన్న గారికి సన్మానం..

భజన మండలి సబ్యులకు చిరు సన్మానం.
#వందనసమర్పణ తో పూర్తి.

No comments:

Post a Comment