Sunday, 28 August 2022

సరస్వతి మాతా విగ్రహదాతలకు ఆహ్వానం

సేవాతత్పరులందరికీ సాదర స్వాగతం..

సరస్వతిమాతా  విగ్రహదాతలకు ఆహ్వానం.
శ్రీమాత్రే నమః.

గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్జ్వలమవ్వాలి అనే ఆశయ స్ఫూర్తితో.. అన్ని స్థాయిల విద్యాసంస్థలలో చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు చేయాలని సంకల్పం. 

చదువుతో పాటు విద్యార్థికి  సంస్కారం అందాలని, అందుకు  విద్యాలయాలే వేదికలు , రేపటి తరానికి చైతన్య కేంద్రాలుగా నిలవాలని ఈ నిశ్శబ్ద విద్యా మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది సేవాసమితి ట్రస్ట్.
 
ఏ తారతమ్యం చూపక అందరినీ విగ్రహ దాతలుగా స్వీకరణ & అడిగిన విద్యాసంస్థలకు ఉచితంగా అమ్మవారి విగ్రహాలు అందించడo జ్ఞానసరస్వతి సేవాసమితి ఉద్దేశ్యం.

మొదటి విడతగా 2018 జనవరిలో శ్రీ సరస్వతి మహాయజ్ఞం నిర్వహించి తెలంగాణలోని 108 విద్యాసంస్థలకు అందించిన విషయం మనందరికీ విదితమే. తరువాత 2019 శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 54 విగ్రహాలను విద్యాసంస్థలకు అందించడం జరిగింది.

ఆ తరువాత 2022 మాఘ శుద్ధ పంచమి కి శ్రీ సరస్వతి మహా హోమం నిర్వహించి 18 విద్యాసంస్థలకు 18 సరస్వతి విగ్రహాలు అందించడం జరిగింది.

అదే విధంగా 2022 శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో మరో 9 విద్యా సంస్థలకు 9 సరస్వతి మాత విగ్రహాలను అందించాలనేది జ్ఞానసరస్వతి సేవాసమితి సంకల్పము.

ఈ విద్యామహాయజ్ఞం నిరంతరం కొనసాగించాలని జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్ సంకల్పం.

✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

అందులో భాగంగా 2022, శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో శ్రీ సరస్వతి మహా హోమం నిర్వహించి 09 అమ్మవారి విగ్రహాలను - 09 విద్యాసంస్థలకు అందివ్వాలని ట్రస్ట్ నిర్ణయం.
✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

ఏ తారతమ్యం చూపక అందరినీ విగ్రహ దాతలుగా ఆహ్వానిస్తోంది ట్రస్ట్. అదేవిధంగా,  అనుకూలతను బట్టి, ట్రస్ట్ నియమాలకు అనుగుణంగా అడిగిన విద్యాసంస్థలకు ఉచితంగా అమ్మవారి విగ్రహాలను అందిస్తుంది. కావున ఈ విద్యామహాయజ్ఞంలో అందరం బాగస్వాములం అవుదాం_మన వంతు సహకారం అందిద్దాం.

విగ్రహ దాతలుగా ఉండాలనుకునేవారు సేవాసమితి సభ్యులను సంప్రదించగలరు ::  9963163330 & 9963263330.

విద్యాధనం శ్రేష్ఠధనం - విద్యాదానం మహాదానం.

భవదీయ..
జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్
జ్ఞానసరస్వతి సంస్థాన్

No comments:

Post a Comment