శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
""సేవాసమితి సబ్యులందరికి సూచనలు".
మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే ఆశయ స్ఫూర్తితో నిర్మితమైనది మన ఆలయమని మనందరికీ తెలిసిందే.
అమ్మవారి అనుగ్రహం, శ్రీ విద్యారణ్య స్వామీజి దిశ్య ఆశీస్సులతో ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుండి తమ పరిదిలో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నది సేవాసమితి.
ఎన్నికల సమయం...రాజకీయాలు..విఐపి వ్యవస్థ
ఆద్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలు అందరికీ అందుబాటులో ఉండాలి, అక్కడ ఎలాంటి తారతమ్యాలకు, రాజకీయాలకు ఆస్కారం ఉండకూడదనే నియమాన్ని పాటిస్తుంది జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్.
ఇప్పుడు ఎన్నికల సమయం..
కావున ఆలయ నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసుకున్న వివిధ మండలీల సబ్యులందరం గుర్తెరిగి పని చేయాలి.
ఒక వ్యక్తికి గాని, ఒక కుటుంబానికి గాని, ఒక సామాజిక వర్గానికి గాని లేదా ఒక రాజకీయ పార్టీకి గాని ""దేవాలయం తరపున" లేదా "సేవాసమితి తరపున ప్రత్యేకించి మద్దతు ఉండదు".
ఆలయంలోని వివిద వ్యవస్థలలో, మండలీలలో ఉన్న వ్యక్తులు వారి అనుకూలతను బట్టి వ్యక్తిగతంగా ఎవరికైనా పని చేసుకోవచ్చు.... ఎవరికైనా మద్దతు తెలుపొచ్చు.
""ఆ దేవుడి ముందు ఏ స్తాయి వ్యక్తులైన, వ్యవస్థలైనా సమానమే""
.
ఆలయానికి వచ్చి ఆశీర్వాదం తీసుకునే వారందరికీ స్వాగతమే......
వారి వారి నిజాయితీని బట్టీ అమ్మవారి అనుగ్రహం ఉంటుందనేది మన విశ్వాసం.
కావున "జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్ ద్వారా వివిద మండలీలలో, వ్యవస్థలో ఉన్న సబ్యులందరం ఈ ఎన్నికల సమయంలో ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలి. వ్యక్తుల ద్వారా వ్యవస్తకు పరిపుష్టత రావాలి కానీ నష్టం జరగరాదు అనే విషయాన్ని మననం చేసుకుంటూ పనిలో బాగస్టులం కావాలి.
సదా వెంకట్,
Founder & Managing Trustee.
జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్.
ఆచరణీయం
ReplyDelete