జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
శ్రీ మాత్రే నమ:
ఆలయ నిర్వహణలో అందరి భాగస్వామ్యం ఆశిస్తూ💐....
ఆలయ శ్రేయోభిలాషులకు విన్నపం🤝.
మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే ఆశయంతో నిర్మితమైన ""మన జ్ఞానసరస్వతి దేవాలయం"" నిత్య పూజలతో, ఉత్సవాలతో మరియు సేవాకార్యక్రమాలతో నిరంతర మహాయజ్ఞంలా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే..
సంకల్పానుసారం అలయ నిర్వహణలో ""అన్ని సేవలు ఉచితంగా"(రుసుము లేకుండా) నిర్వహించ బడుతున్నాయి.
అర్చనలు, అక్షరాబ్యాసం మరియు ఆలయంలో నిర్వహించే అన్ని కార్యాలకు "ఎలాంటి రుసుము లేదు". అన్నీ ఉచిత సేవలే..
""దైవ అనుగ్రహం అడుక్కోవాలి_కొనుక్కోరాదు" అని సనాతన ధర్మం చెప్పింది🙏.
పూర్వపు రోజుల్లో "పోషకులు" మనస్ఫూర్తిగా సమర్పణ చేసే విరాలాలతోనే ఆలయాలు నిర్వహించబడేవి. అందుకే నిత్యచైతన్య కేంద్రాలుగా విలసిల్లినవి👍. ఆ పరoపరను పునర్జీవింప చేయాలనేది మన ఆలయ ఉద్దేశ్యం.
మన ఆలయంలో కూడా భక్తులు మనస్పూర్తిగా సహకరించిన వాటితో ఆలయ నిర్వహణ, కార్యక్రమాలు మరియు అభివృద్ది పనులు జరుగుతున్నాయి✊.
**అలయ నిర్వహణలో భాగస్వామ్యo ఆశిస్తూ అభ్యర్ధన/అవకాశం.
ఆలయ ప్రారంభం నుండి నేటి వరకు కొంతమంది సభ్యుల సహకారంతో ""ప్రతినెలా నిర్వహణ"" జరుగుతుంది.
అమ్మవారి అనుగ్రహముతో🙏
ఇప్పుడు ఆలయానికి భక్తుల సందర్శన పెరగడంతో పాటు, నిర్వహణ స్థాయి పెరిగింది.
దూర ప్రాంతాలనుండి వచ్చే భక్తులకు, అక్షరాబ్యానికి వచ్చే కుటుంభాలకు వసతులు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
వచ్చే భక్తులకు ఏర్పాట్లతో పాటు, ఆలయంలో ఒక "వేద పండితుడైన పూజారి" ని ఏర్పాటు చేయాలని సేవాసమితి నిర్ణయించింది.
పూజారి గౌరవ వేతనంతో పాటు, నెలవారి ఖర్చులలో ఎక్కువ మందికి బాగస్వామ్యం కలిపించాలని సేవాసమితి ఉద్దేశ్యం.
కావున ఆలయ నిర్వహణలో భాగస్తులు కావాలని కోరుతూ, తారతమ్యాలు మరిచి అందరినీ అభ్యర్తిస్తుంది జ్ఞానసరస్వతి సేవాసమితి.
తమ తమ అనుకూలతను బట్టి ప్రతీ నెలా ధనరూపేన రూ.501/౼ 1001/౼, ఆపై గాని లేదా
ఆలయ నిర్వహణకు వస్తురూపేన సమర్పించి ఆలయ నిర్వహణలో భాగస్తులు కాగలరు🤝.
✊ఆలయం మనదే_బాధ్యతా మనదే✊:
బోలో సరస్వతీ మాతాకి జై🙏
వివరాలకు సంప్రదించగలరు: శివకుమార్_9885920685.
~: జ్ఞానసరస్వతి సేవాసమితి ట్రస్ట్.
No comments:
Post a Comment