శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
ఆలయ శ్రేయోభిలాషుల సలహాలు కోరుతూ...
విద్యార్థుల వికాసం కోసం_విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మితమై, అబివృద్ది చెందుతూ నిరంతర సేవాకార్యక్రమాలతో నిత్యచైతన్య కేంద్రంగా విరాజిల్లుతుంది జ్ఞానసరస్వతి దేవాలయం.
మున్ముందు అమ్మవారి అనుగ్రహంతో, ఎక్కువ శక్తితో తన పరిదిని విస్తృత పరుచుకోవాలని ఆశిద్దాం.
మంచి ఆలోచనతో, మంచి ఒరవడికి నాంది పలుకుతూ..
రెండు విశిష్ట కార్యక్రమాలను ఆలయం ద్వారా గొప్పగా నిర్వహించాలని ఆశిస్తూ.. అందరి సలహాలు కోరుతుంది సేవాసమితి.
1. అక్షరాబ్యాస మహోత్సవం :: అక్షర శ్రీకారం జరిగిన రోజే ఆ చిన్నారి ఎదుగుదలకు సంకల్పం జరగాలనే తల్లిదండ్రుల, బంధుమిత్రల ఆకాంక్షకు అనుగుణంగా జరిగే వేడుకకు మన ఆలయం వేదిక కావాలని ఆశిస్తున్నాం.
కావున, అక్షరాబ్యాస కార్యక్రమ నిర్వహణ జరిగే విధానం పై మీకు ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలు ఆలయం వారికి తెలపగలరు.
2 .ఆయుష్మాన్ భవ:: పుట్టినరోజు వేడుక::
పెద్దల చెప్పినట్టుగా మొక్కై వంగనిది, మ్రానై వంగదు..
15 సం.రాల లోపు పిల్లలకు అందిన సంస్కారాలు, సంకల్పాలు వారు ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడతాయి.
ఏ తారతమ్యాలు చూపక,
5 సం.రాల నుండి 15 సం.రాల వయసులో ఉన్న చిన్నారుల పుట్టినరోజు వేడుకను
"ఆయుష్మాన్ భవ" అనే కార్యక్రమం ద్వారా నిర్వహించి, వారు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆశీర్వదిస్తూ , వారిచే సంకల్పాన్ని చేయించే వేడుకకు వేదికగా మన ఆలయం నిలవాలని ఆశిస్తున్నాం.
కావున ఈ రెండు ఉత్సవాల నిర్వహణకు ఉపయోగపడే ఆలోచనలు, ఆభిప్రాయాలు తెలుపగలరు.
అన్ని అభిప్రాయాలు, ఆలోచనలు సమీక్షించి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజి ఆశీస్సులతో,
ఒక చక్కటి ప్రణాళికతో ఆ రెండు ఉత్సవాలను సామూహిక ఉత్సవాలుగా నిర్వహిద్దాం_ సామాజిక చైతన్యాన్ని చాటుదాం.
:~ జ్ఞానసరస్వతి సేవాసమితి,