నందివనపర్తి గ్రామంలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతి
మహాయజ్ఞం ప్రత్యేక పూజలను ప్రారంభించిన
శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష
విద్యారణ్య భారతి స్వామిజీ.
శ్రీ సరస్వతి మహయజ్ఞం కార్యక్రమంలో
పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం
ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి .MLC రామచంద్రయ్య
హంపి పీఠాధిపతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు
చేసిన కార్యక్రమంలో కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల
అభివృద్ధికి జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
మంత్రి మహేందర్ రెడ్డి, mla మంచిరెడ్డి కిషన్ రెడ్డి లు మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి
ఇలాంటి కార్యక్రమాలు ఎంతో తోడ్పడుతాయన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆసాంతం పర్యవేక్షించిన
కసిరెడ్డి వెంకట్ రెడ్డి ఆద్యంతం ఉతేజపరిచారు. కార్యక్రమంలో mlc లు జనార్ధన్ రెడ్డి,
రామచందర్ రావు, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జరిగిన సరస్వతీ మహ యజ్ఞ కార్యక్రమo
లో భాగంగా
మొదటి రోజు కార్యక్రమాలు
ఘనంగా ప్రారంభమయ్యాయి.నందీశ్వరాలయంలో ఉదయం 5 గంటలకే గణపతి హోమం,స్వస్తి వాచనంతో మొదలయ్యాయి.
సరస్వతీ దేవాలయం నుంచి అమ్మవారిని ఊరేగింపుగా యాగశాల దగ్గర హంపీ పీఠాధిపతి విద్యారణ్య
భారతి స్వామి ధ్వజారోహణ చేసి యాగశాలను ప్రారంభించారు.108 యజ్ఞకుండలలిల దగ్గర దంపతులు
కూర్చోని సరస్వతి హోమం నిర్వహించారు.స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దంపతులు
హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుడు రాజు శర్మ ఆద్వర్యంలో కొనసాగిన కార్యక్రమం
ఆద్యంతం భక్తి శ్రద్ధలతో కొనసాగింది .108 విగ్రహాలకు లక్ష పుష్పార్చన నిర్వహించారు.కార్యక్రమంలో
సేవా సమితి ట్రస్ట్ వ్యవస్థాపకులు సదా వెంకట్ , జడ్పీటీసి రమేష్ గౌడ్, మాజీ ఎంపిపి
రాచర్ల వెంకటేశ్వర్లు ,సర్పంచ్ రాజు నాయక్ ,ఎంపిటీసి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment