Sunday, 14 September 2025

దేవి శరన్నవరాత్రులు - 2025 నిర్వహణ కోసం సన్నాహక సమావేశం

*శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రులు - 2025  నిర్వహణ కోసం మండలీల సభ్యులతో చివరి సన్నాహక సమావేశం
విభాగాల వారిగా పని విభజన*
ఆలయం ప్రాంగణంలో శుభ్రత + అలంకరణ*
*శివకుమార్ & టీం*
అమ్మవారి అలoకరణ, పూజా విభాగం & పూజారుల సమన్వయం*.
రాఘవేందర్ శర్మ &  టీం

ఆలయం బయట శుచి శుభ్రత* + *అలంకరణ*
రామనాథం +
సామ సంతోష్ & టీమ్ 
 (అలంకరణ: మామిడాకులు + అరటి + పూల దండలు + ధ్వజాలు + లైటింగ్)
సామూహిక బతుకమ్మ &  హారతి :: రుద్రమ్మ గారు & టీమ్ + సామ సంతోష్ & టీమ్* 
(బతుకమ్మ సేకరణ, పూలు, అలంకరణ, క్షేత్రంలోని ప్రతి గడపకు  సమాచారం, వేదిక ఏర్పాటు, సౌండ్ సిస్టమ్, గ్రౌండ్ క్లీనింగ్, పార్కింగ్ వ్యవస్థ, టెక్నికల్ సమన్వయం, విద్యార్థుల నృత్య ప్రదర్శన, మంచి నీరు, ప్రసాద వితరణ).
*లలితా పారాయణం + అన్నపూజ :: దీపికా రాణి గారు & టీం + మూలనక్షత్ర నిర్వహణ/ఉత్సవ మండలి సభ్యుల సమన్వయంతో* 
(పూజా సామగ్రి + సీటింగ్ arrangement + sound system + మంచి నీరు + భోజన వ్యవస్థ)

*చండి హోమం + చీరల వేలం + అక్షరాభ్యాసం* ::
అనురాధ గారు & టీం, సంగెం గణేష్ గారు
హోమంలో పాల్గొనే వారి వివరాలు + హోమ గుండాలు ఏర్పాట్లు + అలంకరణ + హోమ సామాగ్రి  + మంచి నీటి వ్యవస్థ + పార్కింగ్)

*అక్షరాభ్యాసం:* enrolment, Kit, Seating system etc.

*భోజన వ్యవస్థ*:   
*వంట : సురేందర్ రెడ్డి & టీం* 
*వడ్డన : విజయ్ కుమార్ & టీం*
*మాతా జాగరణ* :
భజన మండలి:: 

భజన మండలీలకు సమాచారం + భోజన వ్యవస్థ + sound system 

వాహన పూజలు :: రాఘవేందర్ శర్మ గారు

*ప్రచార విభాగం, సంకల్ప ధ్వజారోహణ* 
నిరంతర సమాచారం, పాత్రికేయుల సమన్వయం, ప్రోమోస్, పోస్టర్స్ etc.
నిఖిల్ & టీం*

*ఆయుధ పూజ :: సమన్వయ మండలి + యువజన మండలి :: ఆయుధాల సేకరణ + అలంకరణ* 

*రాక్షస సంహారం : సమన్వయ మండలి + యువజన మండలి*

*స్వాగత విభాగం : మూడేడ్ల వెంకట్ రెడ్డి గారు & టీం + సంగేం గణేష్ గారు*
అమ్మవారి విగ్రహాల సేకరణ & రవాణ వ్యవస్థ*.
సదా వెంకట్ + సుదర్శన్ రెడ్డి 

:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్*

Friday, 12 September 2025

వరదాయిని బృందం @ హంస వాహనం

జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
అమ్మవారి #హంసవాహనం కోసం విద్యార్థుల విరాళాల భాగస్వామ్యం ఆశిస్తూ...   11.09.2025 రోజున  * #వరదాయిని వాణి బృందం నుండి  

1. Noble High Scool, కందుకూరు
2. ZPHS, నేదునూరు
3. PMSRI TGMS, నేదునూరు
4. ZPHS, పులిమామిడి

పాఠశాలలకు వెళ్లడం జరిగింది. విద్యా సంస్థలకు CONCEPT  వివరించి, విద్యార్థులకు 779 #హంసవాహన Stickers ఇవ్వడం జరిగింది.

:~ #జ్ఞానసరస్వతిసంస్థాన్.

హంస వాహిని - వారాహి బృందం

జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
అమ్మవారి #హంసవాహనం కోసం విద్యార్థుల విరాళాల భాగస్వామ్యం ఆశిస్తూ... 10.09.2025 రోజున  #వారాహిమాత టీం నుండి  

1)ZPHS గున్గల్
2)మోడల్ స్కూల్, గున్గల్ వెళ్లడం జరిగింది. 

విద్యా సంస్థలకు CONCEPT  వివరించి,  497 మంది విద్యార్థులకు #హంసవాహన #Stickers ఇవ్వడం జరిగింది.*
:~ #జ్ఞానసరస్వతిసంస్థాన్.

Thursday, 11 September 2025

హంస వాహిని - వరదాయిని బృందం

జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
అమ్మవారి #హంసవాహనం కోసం విద్యార్థుల విరాళాల భాగస్వామ్యం ఆశిస్తూ...   02.09.2025 రోజున  * #వరదాయిని వాణి బృందం నుండి  
1. Edusmart Scool, మునగనూర్
2. Varuns Nextgen School, మునగనూర్
3. Varuns High School, హయత్ నగర్
4. Indra Public School, మునగనూర్
5. Sai Chaithanya School, హయత్ నగర్
6. Vyas Model School, పెద్ద అంబర్ పేట్

పాఠశాలలకు వెళ్లడం జరిగింది. విద్యా సంస్థలకు #CONCEPT  వివరించి, విద్యార్థులకు 1500 హంస వాహన Stickers ఇవ్వడం జరిగింది.
:~ #జ్ఞానసరస్వతిసంస్థాన్

హంస వాహిని -.వారాహి మాత టీమ్

జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
అమ్మవారి హంస వాహనం కోసం విద్యార్థుల విరాళాల భాగస్వామ్యం ఆశిస్తూ...   01.09.2025 రోజున  *వారాహి మాత టీం* నుండి  1)ZPHS కురిమిద్ద 
2)ZPHS మాల్ 
3)ZPHS కొత్తపల్లి 
4)ZPHS నల్లవెళ్లి 
5)కృష్ణవేణి టాలెంట్ స్కూల్, మాల్  వెళ్లడం జరిగింది. విద్యా సంస్థలకు CONCEPT  చెప్పి,  690 మంది విద్యార్థులకు *హంస వాహన Stickers ఇవ్వడం జరిగింది.*
:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్*

Friday, 29 August 2025

పాఠశాలలకు హంస వాహన బృందాలు

*శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.*
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంలో 
శుభ సూచకం🕉️..
పాఠశాల విద్యార్థుల👫 విరాళాలతో💰 మాత్రమే అమ్మవారికి🙏 
#హంసవాహనం(రథం) అనే సంకల్ప సాకార పనుల్లో బాగంగా విద్యా సంస్థలను సందర్శించి, యాజమాన్యాలతో విషయ చెప్పి, విద్యార్థులకు #STICKERS అందించే పనిలో హంస వాహన బృందాలు🤝.
ఒక చారిత్రాత్మక విషయం కోసం సమయ సమర్పణ చేస్తూ సేవలో బాగస్తులవుతున్న ఆలయ 
#సేవాసమితి సభ్యులు, అందుకు సహకరిస్తున్న విద్యా సంస్థలకు, ఆ సంకల్పంలో ప్రత్యక్ష బాగస్తులవుతున్న చిన్నారులకు, వారిని ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులకు 
#జ్ఞానసరస్వతిసంస్థాన్ తరపున శుభాకాంక్షలు💐, శుభాభినందనలు🪷..
:~ #జ్ఞానసరస్వతిసంస్థాన్

Sunday, 3 August 2025

అమ్మవారి హంస వాహనం కోసం విద్యార్థుల విరాళం

*విద్యార్థుల వికాసం కోసం - విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మితమైన శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం* నందివనపర్తి.

*విషయం చిన్నదే అయినా.. పవిత్రమైనది, శక్తివంతమైనది.. చరిత్ర లో నిలిచేది.*

*అమ్మవారికి హంస వాహనం (రథం)* కోసం
*10 వేల మంది పైగా  చిన్నారులను (పాఠశాల  విద్యార్థులు) భాగస్తులను చేసే మరో అద్భుత కార్యానికి జ్ఞానసరస్వతి సంస్థాన్  ద్వారా నిర్ణయం జరిగింది.* 
నందినాథ క్షేత్రానికి 50kms  పరిధిలోని అన్ని రకాల పాఠశాలను సందర్శించి, ఆయా విద్యాసంస్థల యాజమాన్యాల సమన్వయంతో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతో జ్ఞానసరస్వతి సంస్థాన్  కార్యాచరణ సిద్ధం చేసుకున్నది. సంస్థాన్  తరపున పాఠశాలకు వెళ్ళాలిన బృందాలకు సంకల్ప భవన్ లో సంస్థాన్ వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు  Orientation నిర్వహించారు..

*అమ్మవారికి హంస వాహనం*  కోసం 6 నుండి 10వ తరగతి విద్యార్థులు   
 *రోజూ శ్లోకం - రోజుకో రూపాయి* అనే నినాదం తో 108 రోజుల పాటు విద్యార్థులు పొదుపు చేసి అందించిన విరాళాలతో మాత్రమే అమ్మవారికి *హంస వాహనం(రథం)*  సమకూర్చుతామని  తెలిపారు.
అదేవిధంగా ప్రతీ నెలా విద్యార్థులతో నిర్వహించే మూలా నక్షత్రం హోమంలో పాల్గొనేలా ఆయా విద్యాసంస్థలను ఆహ్వానిస్తారు, 
అడిగిన విద్యాసంస్థలకు సరస్వతి మాత విగ్రహం ఉచితంగా ఆలయం తరపున అందిస్తామనే విషయాలు సంస్థాన్ తరపున హంస వాహన బృందాలు విద్యాసంస్థలకు తెలియజేస్తాయి.
ఈ మహా కార్యం ద్వారా విద్యార్థులకు చిన్నతనంలోనే సమాజ కార్యంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం, పొదుపు చేసే గుణం, సమర్పణ భావనతో పాటు క్రమ శిక్షణ అలవడుతాయని సదా వెంకట్ గారు తెలిపారు.

సుమారు 108 మందితో 10 బృందాలు, 10 మండలాల్లో కనీసం 108 విద్యాసంస్థలను ఆగస్టు / సెప్టెంబర్ మాసాలలో కలిచేలా కార్యాచరణ ఉంటుందని తెలిపారు. కావున ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలను, విద్యార్థుల తల్లి దండ్రులను ఈ మహా కార్యంలో తమ పిల్లలను పాల్గొనేలా ప్రోత్సహించాలని సంస్థాన్ తరపున అభ్యర్థన చేశారు.

:*జ్ఞానసరస్వతి సంస్థాన్*