Wednesday, 15 October 2025

హంస వాహన tms GOOGEL MEET

*జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.*
హంస వాహన team Incharges GOOGLE MEET* 
*అమ్మవారి హంస వాహనం కోసం విద్యార్థుల విరాళాల భాగస్వామ్యం ఆశిస్తూ*
మండల వారిగా సంప్రదించిన బృందాల వివరాలు

1. *వారాహి మాత* బృందం నుండి యాచారం మండలం నుండి ఇప్పటివరకు వెళ్లిన పాఠశాలలు :: 20

Private Schools - 05
Govt. Schools - 15

*విద్యార్థులకు అందించిన stickers :: 3108/-*


02. *వరదాయిని వాణి* బృందం నుండి కందుకూరు మండలం మరియు హైదరాబాద్ లో ఇప్పటివరకు వెళ్లిన పాఠశాలలు :: 31

Private Schools - 07
Govt. Schools - 24

*విద్యార్థులకు అందించిన Stickers :: 4545*

3. *వాగ్దేవి మాత* బృందం నుండి ఇప్పటివరకు వెళ్లిన పాఠశాలలు :: 08

Private Schools - 04
Govt. Schools - 04

*విద్యార్థులకు అందించిన stickers :: 2100*


*ఇప్పటివరకు 3 బృందాలు కలిపి విద్యార్థులకు అందించిన stickers - 9753*

మిగతా బృందాలు Oct చివరి వరకు తమ మండలాలలో పూర్తి చేయాలని నిర్ణయం.

*అదే విధంగా వివిధ ప్రైవేటు పాఠశాలలు, Corporate పాఠశాలకు వెళ్లేందుకు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయం*.

* *హంస వాహన సంకల్పంలో సుమారు 30 వేలకు పైగా పాఠశాల విద్యార్థులను బ్యాగులను చేసే ప్రయత్నంలో హంస వాహన  బృందాలు* 
* భక్తులు,ఆలయ  శ్రేయోభిలాషులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు ఇతర ప్రముకులు తమకు అనుకూలంగా ఉన్న విద్యాసంస్థలకు ఈ సంకల్పాన్ని చేర వేసేందుకు మీ వంతుగా సహకరించగలరని ఆశిస్తున్నాము.
* వివరాలకు: జలంధర్ +919177000412.
:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్*

Tuesday, 14 October 2025

హంస వాహన _ వాగ్దేవి మాత బృందం

*జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.*
అమ్మవారి హంస వాహనం కోసం విద్యార్థుల విరాళాల భాగస్వామ్యం ఆశిస్తూ...    

#వాగ్దేవిమాత బృందం నుండి 

1. Rose Buds High School, బాగాంబర్ పేట్
2. రాంచంద్ Girls High School
3. సత్యసాయి విద్యావిహార్, DD కాలనీ
4. Navya High School, అంబర్ పేట్
పాఠశాలలకు వెళ్లడం జరిగింది. విద్యా సంస్థలకు CONCEPT  వివరించి, విద్యార్థులకు 520 హంస వాహన Stickers ఇవ్వడం జరిగింది.
:~ #జ్ఞానసరస్వతిసంస్థాన్.

హంసవాహన_వారాహిమాత బృందం

ఈరోజు వారాహి మాత టీం నుండి
1)ZPHS, చింతపట్ల
2)MPUPS, మంతన్ గౌరెల్లి
3)MPUPS, మొండి గౌరెల్లి
4)MPUPS, తక్కళ్ళపల్లి
5)MPUPS, తమ్మలోనిగూడ
6)MPUPS, తాటిపర్తి
వెళ్లడం జరిగింది..
ఈరోజు మొత్తము 410 stickers ఇవ్వడం జరిగింది
ఈరోజు తో యాచారం మండలం పూర్తి అయింది.🙏🙏🙏

Sunday, 12 October 2025

శరన్నవరాత్రి ఉత్సవాల సమీక్ష

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై మండలి సభ్యుల సమీక్షా సమావేశం* 
on 12.10.2025, ఆదివారం @ సంకల్ప భవన్.
దేవి శరన్నవరాత్రులు - 2025  నిర్వహణపై మండలీలు  మరియు వివిధ విభాగాల జరిగిన పనిని సమీక్ష చేయడం జరిగింది.*
ఉత్సవ నిర్వహణకు సహకరించన వ్యవస్థలకు, వ్యక్తులకు ఆలయం ద్వారా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు💐.
ఈ శరన్నవరాత్రులలో జరిగిన లోటుపాట్లను గుర్తించి  మాఘ మాసంలో ప్రారంభమయ్యే శ్యామలా నవరాత్రులను విద్యార్థుల కార్యక్రమాలతో నిరహించే విధంగా మండలీలలను పటిష్ట పరచడం చేయాలని నిర్భయం జరిగింది.

* దేవాలయ నిత్య పూజలు,ఆలయ నిర్వహణ కోసం పోషక మండలి సభ్యులను పెంచాలనే నిర్ణయంతో పాటు...
15 సంవత్సరాల  లోపు చిన్నారులకు సాoప్రదాయబద్దంగా పుట్టినరోజు వేడుకల నిర్వహించడం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది.
ఉత్సవ వ్యవస్థలో పాల్గొన్న వివిధ మండలీల సభ్యుల సంఖ్య - 67. 
  :~ *జ్ఞానసరస్వతి సంస్థాన్*

Monday, 6 October 2025

ధర్మకర్తల మండలి సభ్యులు

*శ్రీ శ్రీ శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*.
*నూతన ధర్మకర్తల మండలి సభ్యులుగా  శ్రీమతి & శ్రీ సాయి ప్రియ హరీష్ గారు*.
శ్రీమతి & శ్రీ కొంగళ్ళ సరస్వతి విష్ణు వర్ధన్ రెడ్డి* గారి కుమార్తె  అల్లుడు, మిర్యాలగూడ వాస్తవ్యులు *శ్రీమతి & శ్రీ సాయిప్రియ హరీష్* గారు ₹ 1,11,116/-  చెల్లించి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులుగా చేరారు.  వారి దాతృత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలతో💐.  ఆలయ ధర్మకర్తల మండలిలోకి సాదరంగా ఆహ్వానం పలుకుదాం.
:~*జ్ఞానసరస్వతి సంస్థాన్*

ఆలయానికి మొదటి వేతనం

కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న  చదువులతల్లికి హృదయ నీరాజనం..  
ఆరుట్ల వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ తాడూరి భార్గవి వెంకట్ రెడ్డి (గౌతమి విద్యాలయం, నందివనపర్తి) గార్ల కుమార్తె తేజస్వి గారు QUADYSTER (United States Of America) లో Software Engineer గా ఉద్యోగం పొందారు. ఉద్యోగం రాగానే తేజస్వి గారు వారి కుటుంబ సభ్యుల ద్వారా తన మొదటి నెల వేతనం నుండి 1,01,116/- ఆలయ అభివృద్ధి కోసం సేవాసమితి సభ్యులకు అందజేయడం జరిగింది.

M.S, USA లో పూర్తయ్యాక ఉద్యోగం రావాలని కోరుకున్న వెంటనే అమ్మవారి అనుగ్రహంతో ఉద్యోగం పొందాను. అందుకే నా మొదటి వేతనం నుండి 1,01,116/- ను దేవాలయ అభివృద్ధికి అందించాలని మా  తల్లిదండ్రుల ద్వారా అమ్మవారి మొక్కు తీర్చుకుంటూ హృదయపూర్వకంగా సమర్పిస్తున్నాను.
కృషి, పట్టుదలతో  చదివి అమ్మవారి అనుగ్రహం తోడై ఉద్యోగం పొంది కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్ధతుతో ఉదారంగా, వినమ్రతతో తన మొదటి వేతనం నుండి కొంత భాగాన్ని అమ్మవారి ఆలయానికి సమర్పించిన తేజస్వి గారికి జ్ఞానసరస్వతి సంస్థాన్ తరపున శుభాభినందనలు ..  
తేజస్వి గారు జీవితంలో ఇంకా ఉన్నతస్థాయికి ఎదగాలని కావాలని అందరం ఆశిద్దాం .. ఆశీర్వదిద్దాం..
జ్ఞానసరస్వతి సంస్థాన్