బృహత్ సేవా మేళా - ప్రదర్శిని
HSSF ద్వారా నవంబర్ 8, 9&10వ తేదీలలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బృహత్ మేళా - సేవా ప్రదర్శిని ఈ రోజు సాయంత్రం ప్రారంభించబడింది.
శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామీజీ, స్వామి శితి కంఠానంద (RK Mutt), మానవీయ శ్రీ బాగయ్య గారు మరియు HSSF కార్యవర్గ సభ్యులతో పాటు అనేక మంది కుటుంబాలతో పాల్గొన్నారు.
ప్రతి రోజూ అధ్బుతమైన సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలుర్వహించబడుతాయి.సామాజికవేత్తలు, ఆధ్యాత్మిక ప్రముఖుల సందేశాలు ఉంటాయి.
సేవా ప్రదర్షిని మేళాలో తెలంగాణలోని వివిధ సేవా సంస్థల ద్వారా 200 Stalls ఏర్పాటు చేయబడ్డాయి.
అందులో వీరపట్నం ప్రాతం నుండి శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి తరపున (STALL NO E15) మరియు హరివర అఖండక్షేత్రం తరపున (STALL NO:E 17) రెండు వేరు వేరు Stalls ఏర్పాటు చేయబడుచున్నాయి.
సేవా మేళా ప్రదర్షిణి సందర్శన కోసం అందరికీ ఉచిత ప్రవేశం అందిస్తున్నారు. కావున కుటుంబ సమేతంగా మూడు రోజులలో జరిగే మేళాను సందర్శించి కార్యక్రమాలు తిలకించి, వివిధ సేవా సంస్థల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు తెలుసుకోవచ్చు.
:~ హరివర అఖండక్షేత్ర సమితి &
జ్ఞానసరస్వతి సంస్థాన్
No comments:
Post a Comment