*శ్రీశ్రీశ్రీ సరస్వతి దేవాలయం, నoదివనపర్తి.*
*అక్షర శ్రీకారం రోజునే చిన్నారి ఎదుగుదలకు సంకల్పం జరగాలనే తల్లిదండ్రుల, బoదు మిత్రుల ఆకాంక్షకు అనుగుణంగా జరిగే చిన్నారి అక్షరాభ్యాస కార్యక్రమ వేడుకకు సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చిన భక్తులకు, శ్రేయోభలాషులకూ శుభాకాంక్షలు, శుభాభినందనలు.*
ఈ అక్షరాబ్యాస వేడుకకు నిలయంగా సంకల్ప భవన్ రూపొందించబడింది.*అంతరాలు లేని అక్షరజ్ఞానం అందరికీ అందిస్తూ అక్షర చైతన్యo ద్వారా తాము ఎదుగుతూ, దేశ ఉన్నతికి దోహదపడే నేటితరం విద్యార్థుల సంకల్పానికి వేదికగా ఈ సంకల్ప భవన్ నిలవాలి, నిలుస్తుంది.*
మొక్కై వంగనిది మ్రానై వంగదు. కావున విద్యార్థికి పాఠశాల స్థాయిలోనే చదువుతో పాటు సంస్కారం మరియు సామాజిక బాధ్యతను నేర్పే శిక్షణ మరియు ప్రేరణ కేంద్రంగా సంకల్ప భవన్ నిర్మాణం జరిగింది.
అటువంటి సంకల్ప భవన్ లో *శ్రీశ్రీజగద్గురు శంకరాచార్యులు శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థాన పీఠాధీశులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ* *కరకమలములచే చిన్నారులకు అక్షర శ్రీకారం చేయించడం మనందరి అదృష్టం.. వారికి శిరసా ప్రణామాలు🙏*
తమ చిన్నారులకు అక్షర శ్రీకారం చేయించుకోవడానికి వివిధ జిల్లాల నుండి, సుదూర ప్రాంతాల నుండి ఆలయానికి వచ్చిన భక్తులకు శుభాకాంక్షలు💐.
*ఈ ఆలయం మరో బాసరగా వెలుగొoదుతున్నది అని అoదరు అంటున్నా*....
*బాసరకి బాసటగా ఉన్న గోదావరమ్మను తప్పా... మిగతా అన్ని ఏర్పాట్లు చేయడానికి శతవిధాలుగా ప్రయత్నం జరుగుతున్నది.*
రాబోవు రోజుల్లో అన్ని వసతులు పూర్తి చేస్తాం.
*వసంత పంచమి - 2024 మహోత్సవానికి వచ్చిన భక్తులకు ఏవైనా అసౌకర్యాలు కలిగింటే అన్యదా బావించకూడదు అని మనవి చేస్తున్నాం.*
*ఈ ఉత్సవ నిర్వహణలో తమ సమయ సమర్పణ ద్వారా ప్రత్యక్ష సేవలో ఉన్న ప్రతి కార్యకర్తకు మనందరి తరపున శుభాకాంక్షలు💐.*
*ఉత్సవ నిర్వహణకు సంపద సమర్పణ చేసి నిర్వహణలో బాగస్తులైన సేవా తత్పరులకు ఆలయం ద్వారా శుభాభినందనలు.*
ఆలయ పరిసరాలు శుభ్రతకు సహకరించిన నందినాథక్షేత్ర గ్రామ పంచాయతి సిబ్బందికి శుభాభినందనలు..
*అమ్మవారి ఉత్సవ ఊరేగింపు, పల్లకీ సేవలో పాల్గొన్న చిన్నారులకు శుభాశీస్సులు.*
నిరంతర క్రతువుగా సాగుతున్న ఈ విద్య మహా యజ్ఞంలో అందరం బాగస్తులo అవుదాం, మన వంతు సహకారం అందిద్దాం...
*దైవకార్యంలో, ధర్మ కార్యంలో అoదరు సమానులే, అందరూ సామాన్యులే ఆచరిద్దాం*.
:~ భవదీయ
సదా వెంకట్,
*Founder & Managing Trustee*.
*ఙ్ఞానసరస్వతి సంస్థాన్*