Wednesday, 30 November 2022

కళాశాల విద్యార్థుల విరాళంకోసం


Activity of 01.12.2015

అమ్మాదీవించు - కదిలాము సేవాదళమై...
కాళేజి పిల్లల పైసలడగటానికై 
నీ ముంగిట ద్వజస్థంభమే నిలపటానికై....
అమ్మా దీవించు - కదిలాము సేవాదళమై
అడగటానికి మేమైతే సిగ్గుపడటం లేదు..
అనుగ్రహించు వారిని.. ఇచ్చి ఎదగడానికి
అమ్మాదీవించు - కదిలాము సేవాదళమై...
ద్వజస్థంభమే కాదది స్ఫూర్తికేంద్రమవ్వాలని,
పల్యాణిముత్యాల ఆసరకై శ్రద్దకేంద్రమవ్వాలని..
అమ్మాదీవించు - కదిలాము సేవాదళమై...
( సంకల్పం... జ్ఞానసరస్వతీ దేవాలయంలో ప్రతిస్థించే ద్వజస్థంభం కళాశాల విద్యార్థుల విరాళాలతో సమకూర్చాలనేది సంకల్పం.. 2015 జనవరి, వసంతపంచమి రోజున ప్రతిష్ఠా మహోత్సవం జరపాలని నిర్ణయించబడింది. విరాళాలకోసం కళాశాలకు బయలుదేరే ముందు అమ్మదీవెనలు.. పెద్దల ఆశీస్సులు కోరుతూ ... బయలుదేరుదాం... దీవించు - కదిలాము సేవాదళమై!

మహాయజ్ఞ స్థల పరిశీలన @01.12.2017


శ్రీ సరస్వతీ మహాయజ్ఞ నిర్వహణకోసం యజ్ఞశాల, వేదిక , భోజనశాల మరియు ఇతర ఏర్పాట్ల పరిశీలన.. యజ్ఞం జరిగే ప్రాంతంలో స్థల యజమానులచే పూజా కార్యక్రమం...
మహాయజ్ఞ తేదీలు. 2018, జనవరి 20,21 & 22.
యజ్ఞ స్థలం : నందీశ్వర దేవాలయ ప్రాంగణం, నందివనపర్తి..

కార్యకర్తల సమావేశం @ 01.12.2019.



మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి మన #ఆలయాలు, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే ఆశయ స్ఫూర్తితో దేవాలయ వ్యవస్థలో  కొనసాగుతున్న #జ్ఞానసరస్వతిసేవాసమితి సభ్యుల

#ఆత్మీయసమావేశం 

*జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై...
దేవాలయాల సంకల్పo, నిర్మాణ విధానం పై మరియు రాబోయే కార్యక్రమాలపై వ్యవస్థాపకులు_సదా వెంకట్ గారిచే క్లుప్త వివరణ..

#జ్ఞానసరస్వతిసేవాసమితి అధ్యక్షులు ఐలపురం జలంధర్ రెడ్డి గారిచే దేవాలయ వ్యవస్థ కోసం ఏర్పాటు చేసిన వివిధ మండలీల పరిచయం..

దేవాలయ వ్యవస్ధపై ముఖ్య అతిథి - 
మాన్యశ్రీ అమర లింగన్న గారి ప్రేరణాత్మకమైన
సందేశంలోని కొన్ని ముఖ్య విషయాలు.
1. సమాజ కార్యక్రమంలో అందరం సమానమే మరియు అందరం కార్యకర్తలమే..

2. ప్రపంచంలోని అనేక దేశాలలో ఇస్లాం, క్రైస్తవం ద్వారా అనేక రకాల దాడులు జరిగినా, జరుగుతున్నా  భారతదేశం ఇంకా హిందు దేశంగా ఇంత పటిష్టం గా ఉండడానికి కాలానుగుణంగా వ్యక్తుల నిర్మాణం చేసారు మన పూర్వులు. ద్ధర్మ స్థాపన కోసం వారి త్యాగం అమోఘం.

3. సంస్కారం పరంగా అందరం సమానమే అది దేవాలయం ద్వారా జరగాలి.

4. సమాజంలో మంచి కోసం ఏమైనా చేయాలనే ఆలోచన చేయాలని అందరిలో రావాలి.
దేవాలయం ద్వారా జరిగే కార్యక్రమాలకు సందపను సమర్పణ చేయడం చాలా గొప్పకార్యం.

5. దేవాలయం కేంద్రంగా వ్యక్తి నిర్మాణం మరియు వ్యవస్థ పటిష్టం జరగాలి.

6. మానవ సంస్కార నిలయాలు అమ్మఒడి, బడి, గుడి ద్వారా అందే సంస్కారం వల్ల వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకుంటాడు.

7.ఇక్కడ జ్ఞానసరస్వతి దేవాలయం కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యార్థులను బాగస్థులను చేసే కార్యక్రమాల ద్వారా రేపటి భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది.

8.రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇది ఒక గొప్ప క్షేత్రం అవుతుంది.
అందుకోసం సమయ సమర్పణ చేస్తున్న కార్యకర్తలు ధన్యులు.నేను మీలో ఒక కార్యకర్తను.
సేవాసమితి ద్వారా జరిగే రాబోయే కార్యక్రమాలు..

1.  వ్యవస్థ పటిష్టత కోసం ఏర్పాటు చేసుకున్న  మండలీల పటిష్టం చేయడం.

2. సేవాసమితి నిర్ణయం ప్రకారం  జనవరి 29న సంకల్ప భవన్ ప్రారంభం, 30న వసంత పంచమి తో పాటు 3 రోజుల కార్యక్రమాలు..

3. 1008 మంది మాతృమూర్తులు, 108 రోజుల పాటు ప్రతి రోజు పిడికెడు బియ్యం తో అమ్మవారికి #అన్నపూజాకార్యక్రమ..

4. పోషక మండలి పటిష్టం( దేవాలయ నిత్య పూజా కార్యక్రమాలకై సమర్పణ చేస్తున్న వారు)

5. 15 సం. లోపు చిన్నారులకు #సంకల్పభవన్ లో పుట్టిన రోజు వేడుకలు మరియు #బాలసంస్కారకేంద్రo నిర్వహణ.

6. #నిత్యాన్నదాన కార్యక్రమం..

సేవాసమితి సమన్వయ మండలి సభ్యులచే మాన్యశ్రీ అమర లింగన్న గారికి సన్మానం..

భజన మండలి సబ్యులకు చిరు సన్మానం.
#వందనసమర్పణ తో పూర్తి.