*అమ్మవారి అనుగ్రహానికి ధన్యులం🙏*..
ఒరిస్సా పూరి జగన్నాథ క్షేత్రం నుండి అమ్మవారి వనపర్తి క్షేత్రానికి సమయానికి క్షేమంగా చేరిన అమ్మవారి విగ్రహాలు..
విద్యాసంస్థలకు అమ్మవారి ప్రతిమలు వితరణ చేయాలన్న సంకల్పానికి సహకరించిన ప్రకృతికి కృతజ్ఞతలు..
*గుణసంపద వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి,తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్జ్వలమవ్వాలి అనే సదాశయoతో అన్ని స్థాయిల విద్యాసంస్థలలో చదువుల తల్లి, జ్ఞానప్రదాత సరస్వతి మాత ప్రతిమలు ఉండాలని సంకల్పం మనద్వారా జరిగింది..*
సంకల్పానుసారం అమ్మవారి అనుగ్రహo, పూజ్య విద్యారణ్య భారతి స్వామిజీ ఆశీస్సులతో *2018లో 108 అమ్మవారి ప్రతిమలతో శ్రీ సరస్వతి మహాయజ్ఞo నిర్వహించి తెలంగాణలోని వివిధ జిల్లాలలో 108 విద్యాసంస్థలలో ఒకే ముహూర్తానికి ఏర్పాటు చేయబడ్డాయి*.
ఆ తరువాత సంవత్సరాలలో కూడా అడిగిన విద్యాసంస్థలకు ఉచితంగా ప్రతిమలు అందించి మొత్తంగా సుమారు 170వరకు అందించబడ్డాయి...
కరోనా మహమ్మారి కారణంగా గత రెoడు సంవత్సరాలుగా ఆ ప్రయతఁ జరగలేదు..
*ఈ 2022 సంవత్సరం వసంతపంచమికి ఇవ్వాలనే ప్రయత్నానికి అమ్మవారి అనుగ్రహoతో కొన్ని ఇబ్బందులు అయినా అనుకున్న సమయానికి క్షేత్రానికి చేరిన అమ్మవారి ప్రతిమలు*. సహకరించిన అందరికీ సేవాసమితి తరపున శుభాభినందనలు.
ఎన్నో విద్యాసంస్థలు అమ్మవారి ప్రతిమలను కావాలని కోరినా కూడా *సేవాసమితి నియమ, నిబంధనలు పాటించిన వారికి GSS విద్యాసంస్థల సమన్వయ మండలి ద్వారా ఉచితంగా అందించడతాయి*.
ఈ రెండు రోజులు(Feb 5, 6 తేదీలు) విగ్రహాలకు పూజాది కార్యక్రమాలు నిర్వహిoచి ఆ తరువాత విద్యాసంస్థలకు అందిస్తారు.
*విగ్రహదాతగా, విద్యాసంస్థగా ఈ విద్యామహా యజ్ఞంలో అందరూ బాగస్తులు కావచ్చు*.
:~ సదా వెంకట్.
No comments:
Post a Comment