Thursday, 24 June 2021

జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి -- శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ జన్మతిథి

https://youtu.be/E2IfANDUE1M

జ్యేష్ట శుద్ద ఫౌర్ణమి*....

*శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపీ విరూపాక్ష  విద్యారణ్య మహాసంస్థాన 46వ పీఠాధీశులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ జన్మతిథి సందర్బంగా యావత్ సమాజం తరపున ప్రణామలు🙏🏼🙏🏼🙏🏼*.
********************

  *విద్యారణ్యుడు*

*విద్యారణ్యుడు లేదా మాధవాచార్యుడు శృంగేరి శారదా మఠానికి 12వ పీఠాధిపతి*.

శంకరాచార్యుల తరువాత ఐదు శతాబ్ధాలకు (1380-1386) శారదా పీఠాన్ని అధిరోహించాడు.
*విజయనగర సామ్రాజ్య స్థాపనకు మూల ప్రేరకునిగా ప్రసిద్ధి చెందాడు. ప్రజలలో అధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి అవతరించిన మూర్తిగా విద్యారణ్యుడిని భావిస్తారు*.

సన్యాసం స్వీకరణ సవరించు
సన్యాస స్వీకారానికి ముందు విద్యారణ్యుని పేరు మాధవ.
ఈ మాధవ ఇప్పటి వరంగల్లు (ఏలశిలా నగరం) లోని ఇద్దరు పేద నియోగి బ్రాహ్మణ సోదర బ్రహ్మచారులలో పెద్దవాడు. వీరిలో చిన్నవాడు జ్ఞానార్జన కోసం దేశాటన జరుపుతూ శృంగేరి చేరుకొంటాడు. అప్పటి శృంగేరి పీఠాధిపతి అయిన విద్యాశంకర తీర్థస్వామి ఆ బాలకునిలో ఉండే అధ్యాత్మిక భావానికి ముచ్చట చెంది, వానిలో ఉన్న ప్రతిభను గుర్తించి వాడికి సన్యాసం ఇస్తాడు. సన్యాసం ఇచ్చాక ఆయన పేరుని భారతీకృష్ణ తీర్థ స్వామిగా మారుస్తారు. ఇది ఇలా ఉండగా తన తమ్ముని వెదుక్కుంటూ మాధవ శృంగేరి చేరుతాడు. తన తమ్ముడు సన్యాసం తీసుకోవడం, భారతీకృష్ణ తీర్థగా మారడం తెలుసుకొంటాడు, తానూ సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు అతని తమ్ముడైన భారతీతీర్థ తన గురువైన అప్పటి పీఠాధిపతి అయిన విద్యాశంకరస్వామిని ఒప్పించి మాధవకు సన్యాసం ఇప్పిస్తాడు.  *విద్యాశంకర స్వామి మాధవకు క్రీ.శ. 1331 సంవత్సరంలో సన్యాసం ఇచ్చి విద్యారణ్య అని నామకరణం చేస్తారు. విద్యారణ్య అంటే అరణ్యం వంటి జ్ఞానం కలవాడు అని అర్థం*.

వయస్సులో చిన్నవాడైనప్పటికీ సన్యాసం ముందు స్వీకరించడంవల్ల భారతీకృష్ణ తీర్థ ముందు పీఠాధిపత్యం చేయగా, ఆ తరువాత, ఆయన తరువాత సన్యాసం తీసుకొన్న విద్యారణ్యుడు శృంగేరి శారదా పీఠాన్ని అధిరోహిస్తాడు.

దేశాటన సవరించు
సన్యాసం తీసుకొన్నాక, విద్యారణ్యుడు కాశీ, బదరీకి తీర్థయాత్రకు వెడతాడు. అక్కడ నుండి వేదవ్యాసుల మార్గదర్శకత్వములో బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ శ్రీ విద్య గ్రహిస్తాడు.
ఉత్తర భారత యాత్ర పూర్తి చేశాక తిరిగి దక్షిణ భారత దేశానికి వచ్చి హంపి సమీపంలో ఉన్న మాతంగ పర్వతం వద్ద యోగ నిష్ఠలో కొంత కాలం గడిపాడు. అలా కాలం గడుపుతున్న సమయములో ఒక రోజు భారద్వాజస గోత్రీకుడైన మయన కుమారులు మాధవ, సాయనలు విద్యారణ్యుడి దర్శనం చేసుకొంటారు. అప్పుడు విద్యారణ్యుడు తాను అసంపూర్తిగా రచించి వదిలి పెట్టిన వేదభాష్యాలను పూర్తి చేయమని వారితో చెబుతాడు. ఆ వేదభాష్యాలకు వారి పేర్లు పెట్టమనికూడా చెబుతాడు.ఆవిధంగా అవి సాయనీయం, మాధవీయం అని ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ తరువాతి కాలంలో వీరు హరిహరరాయలు, బుక్క రాయలు ఆస్థానంలో మంత్రులుగా పనిచేశారు.
విద్యారణ్య తిరిగి కాశీ యాత్ర వెళ్ళారు.

*విజయనగర సామ్రాజ్య స్థాపన సవరించు అప్పటి ఢిల్లీ సుల్తాను దక్షిణ భారతదేశం పై యుద్ధం చేసి హరిహర రాయలు, బుక్కరాయలు లను బందీచేసి, ఖైదుగా ఢిల్లీ తీసుకెళ్ళుతాడు*. బుక్కరాయలు, హరిహర రాయలలను ఇస్లాం మతం తీసుకోవాలని బలవంత పెడుతాడు. కాని వారు ససేమిరా అని నిరాకరించడముతో ఢిల్లీ సుల్తాను వారిరువురి విక్రమ, ప్రరాక్రమాలను చూసి వారిద్దరినీ దక్షిణభారతదేశంలో దండయాత్రలు నిరోధించడానికి సేనాధిపతులగా చేసి పంపుతాడు*.  వారిరువురు ఇదే అవకాశంగా తీసుకొని తమకు తాము స్వాతంత్ర్యం ప్రకటించుకొని తమకు స్వప్నములో వచ్చిన మార్గదర్శకత్వం ప్రకారం మతంగ పర్వతం మీద తపస్సు చేసుకొంటున్న విద్యారణ్యుని వద్దకు వెళ్ళి తమ గురించి చెబుతారు. విద్యారణ్యుడు వారిద్దరిని ఆశీర్వదించి, తుంగభద్ర నదికి కుడి వైపు సామ్రాజ్యస్థాపన చెయ్యమని సూచిస్తాడు.*
ఆ తరువాత వారు సామ్రాజ్యాన్ని తుంగభద్రానదికి ఎడమ వైపుకు కూడా విస్తరిస్తారు. రాజ్యం ఎడమ వైపుకు విస్తరణ జరిగినప్పుడు విద్యారణ్యుని గౌరవార్థంగా రాజధానికి విద్యానగరం అని పేరు పెడతారు. విద్యారణ్యుడు వారికోసం హంపినగరం రూపానికి శ్రీచక్రము ఆధారంగా ప్రణాళిక తయారుచేస్తాడు. నగర మద్యంలో విరూపాక్ష దేవాలయము ఉండేలాగ, కోటకు 9 గుమ్మాలతో నగరాన్ని నిర్మిస్తాడు. ఆ సామ్రాజ్యానికి రాజధాని పేరు క్రమంగా విజయనగరం (విజయాన్ని ప్రసాదించే నగరం కాబట్టి) గా మారుతుంది. క్రీ.శ.1336 రాగి ఫలకం ఆధారంగా *"విద్యారణ్యుడి ఆధ్వర్యములో హరిహర రాయలు సింహాసనం అధిష్టించాడు" అని తెలుస్తోంది*.
విద్యారణ్యుడు హరిహరునికి ఆత్మ విద్య బోధించి "శ్రీమద్రాజాధిరాజ పరమేశ్వర అపరిమిత ప్రతాపవీర నరపతి" అనే బిరుదాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు శృంగేరీ శారదా పీఠం పీఠాధిపతి బిరుదులలో "కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య" కూడా చేర్చి చెబుతారు.

జగద్గురువుల గొప్పతనం సవరించు
విజయ నగర సామ్రాజ్య ప్రతిష్ఠాపన జరిగిన తరువాత విద్యారణ్యుడు తీర్థయాత్రలకు కాశీ వెళ్ళాడు. అదే సమయంలో విద్యాతీర్థస్వామి లంభిక యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు. తన గురువైన విద్యాతీర్థ స్వామి సమాధిపై బ్రహ్మాండమైన విద్యాశంకర దేవాలయం నిర్మాణాన్ని భారతీకృష్ణతీర్థ స్వామి ప్రారంభించాడు. *బుక్కరాయలు, హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ, అజేయులుగా ఒక విజయం తరువాత మరో విజయాన్ని పొందుతారు.*
హరిహర బుక్కరాయలు విజయ పరంపరలో 1345 సంవత్సరం శృంగేరి చేరి భారతీకృష్ణుల ఆశీర్వచనాలు పొందారు. 1346 సంవత్సరములో శృంగేరికి వెళ్లి, భారతీకృష్ణతీర్థ స్వామి దర్శనం చేసుకొని కొంత భూమిని శ్రీపాదులకు దానంగా ఇచ్చారు.

విద్యారణ్యుడు కాశీలో ఉన్నందున, ఇక్కడ శృంగేరిలోని విషయాలు అన్నీ అతనికి, భారతీతీర్థ ఆజ్ఞతో శ్రీముఖంగా పంపిస్తారు. *విద్యారణ్యుడు తన యాత్ర త్వరగా ముగించుకొని శృంగేరికి వస్తూ హంపిలో బస చేస్తాడు. అప్పుడు బుక్క రాయలు విద్యారణ్యుడితో పాటు ఉండి, అక్కడ విద్యారణ్యుడి కోసం విరూపాక్ష దేవాలయానికి ప్రక్కన మఠాన్ని ఏర్పాటు చేస్తాడు*.   భారతీతీర్థుడు విదేహ ముక్తి పొందిన తరువాత విద్యారణ్యుడు శృంగేరీ శారదా మఠం పీఠం అధిరోహించి, జగద్గురువుగా 1380 నుంచి 1386 వరకు ఆరు సంవత్సరాలు నిర్వహణ బాధ్యతలు చేబడతాడు.

విద్యారణ్యుడి గురించి సవరించు
భారతీకృష్ణ తీర్థ శృంగేరి మఠాన్ని అధిరోహించి క్రీ.శ. 1333 నుండి 1380 వరకు పరిపాలించారు. భారతీకృష్ణ తీర్థ స్వామి గురువుగారు సమాధిచెందిన ప్రదేశంలో శ్రీ విద్యాశంకర దేవాలయం నిర్మించడం మొదలుపెట్టారు. శృంగేరీ శారదామఠానికి పీఠాధిపతిగా 6 సంవత్సరాలు 1380-1386 వరకు ఉండి 1386 లో విదేహ ముక్తి పొందుతాడు. హరిహర రాయలు విద్యారణ్యుడి విదేహ ముక్తి విషయాన్ని తెలుసుకొని విద్యారణ్యపురం అనే పేరుతో ఒక అగ్రహారాన్ని శృంగేరి మఠానికి దానం ఇస్తాడు. విద్యారణ్యుడు గొప్ప విద్వాంసుడు, గొప్ప యోగి, శంకరుల కాలము తరువాత శంకరులంతటి వానిగా వర్ణించబడ్డాడు.

హరిహర రాయలు, బుక్క రాయలు విద్యారణ్యుడి గురించి రాగి ఫలకాలమీద చెప్పిన మాటలు

విద్యారణ్యుడు బ్రహ్మయా? కాని నాలుగు ముఖాలు కనిపించడం లేదే. విష్ణువా? నాలుగు చేతులు కనిపించడం లేదే. శివుడా? మూడో నేత్రం కనిపించడం లేదే. ఈ ప్రశ్నలు మమ్మల్ని వేధించగా మేము తెలుసుకొన్నది విద్యారణ్యుడు భగవంతుడు పంపిన ఒక అద్వితీya శక్తి అని.
(శృంగేరి ఫలకం హరిహర రాయలు II మే 1386).

భారతీతీర్థులు ప్రారంభించిన మఠాలు విద్యారణ్యుడి ఆద్వర్యములో చక్రవర్తుల దానములవలన సిరులతో తులతూగాయి . దక్షిణ భారతదేశం నలుమూలల శృంగేరి శారద మఠానికి అనుబంధంగా ఉప మఠాలుగా వెలశాయి. శృంగేరికి 6 మైళ్ళ దూరంలో ఉన్న హరిహరపురంలో ఒక మఠం ప్రారంభించబడింది. దానికి శ్రీరామచంద్ర సరస్వతి మొదటి పీఠాదిపతి. తిరుమట్టురు మఠం ( తీర్థహళ్ళి తాలూకా, తరువాత కూడాలి మఠం తర్వాతి కాలములో శృంగేరి మఠం ఆధ్వర్యంలో ప్రారంభించబడ్డాయి. హరిహర రాయలు శృంగపుర, విద్యారణ్యపురాలను అగ్రహారాలుగా ఇచ్చాడు. రాకుమారుడు చినరాయలు (విరుపాక్ష రాయలు) సత్యతీర్థుని ముణియూరు మఠానికి ఉదారంగా విరాళాలు ఇచ్చి ఆదరించాడు.
*హంపి పీఠం యొక్క పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి మహా స్వామి....

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు విద్యారణ్య భారతి స్వామీజీ హంపి శ్రీ విరుపాక్ష విద్యారణ్య మహాసంస్థానం యొక్క ప్రస్తుత పీఠాధిపతులు.

స్వామీజీ, శ్రీ విద్యారణ్య వంశంలో నుండి (12 వ పీఠాధిపతి) 46 వ స్థానంలో మరియు ఆదిశంకరాచార్యుడి నుండి 57 వ స్థానంలో ఉన్నారు..

స్వామిజీ తన గురువు శ్రీ అభినవోదండ నృసింహ భారతి స్వామీజీ నుండి 1997 ఫిబ్రవరిలో బెంగళూరులో సన్యాస దీక్షను తీసుకున్నారు మరియు తమ గురూజీ శ్రీ శ్రీ అభినవోదండ నృసింహ భారతి స్వామీజీ తరువాత హంపి మహాపీఠాన్ని అధిరోహించారు..
ఇప్పుడు స్వామీజీ, విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం యొక్క 46వ జగద్గురు శంకరాచార్యులుగా కొనసాగుతున్నారు. హంపి మఠం సేవలను విస్తరించే ప్రక్రియలో వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు..

స్వామీజీ జగద్గురు శంకరాచార్యుల యొక్క సాంప్రదాయాలను రక్షించి, ప్రచారం చేసి, దానిని తరువాతి తరాలకు అందిస్తున్నారు.

శ్రీ విరుపాక్షవిద్యారణ్య మహాసంస్థానం, హంపి మఠం ఒక వేద పాఠశాలను ప్రారంభించింది. మరియు నిరుపేద విద్యార్థుల కోసం పుస్తకాల పంపిణీ, నిత్య అన్నసంతర్పన, గోసంరక్షణ, ఉచిత వైద్య శిబిరాలు మరియు పురాతన గ్రంధాల యొక్క సంరక్షణ మరియు డిజిటలైజేషన్ వంటి అనేక విద్యా మరియు సామాజిక సేవలను అమలు చేసింది..

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు విద్యారణ్య భారతి స్వామీజీ కుల / మతం / లింగం / సంబంధం లేకుండా వేలాది మంది భక్తులను ఆశీర్వదిస్తున్న ఆధ్యాత్మిక గురువు మరియు తత్వవేత్త.
***********************

ప్రణామాలతో..
జ్ఞానసరస్వతి సేవాసంస్థలు

వీరపట్నం అఖండహరివర అఖండక్షేత్రo

తెలంగాణ.

Tuesday, 22 June 2021

సేవే సంకల్పం Article

 పదకొండేoడ్ల కింది విషయం. 
 అప్పుడప్పుడే ఆశయాన్ని అర్ధం చేసుకుని ఆదరణ ప్రారంభమయిన సమయం...  2010లో ఈనాడు వ్యాసం ఇది..  
అప్పటికే గుడి పనికి_ బడిపనికి స్పష్టమైన విదివిదానాలు ఉన్నాయి... రెండు వేరువేరు trusts.రెంటికీ వేరు వేరు పనులు. రెండిoటికి teams వేరు వేరు...   అయినా ఇంకా ఇప్పటికీ కొందరికి అర్థం కాలేదు...  అన్నీ కలిపి కలకూర కంపలాగా చేస్తారు😀😀..

Friday, 18 June 2021

జన్మదిన శుభాకాంక్షలు

*దేశం బాగుండాలి అంటే ఊర్లు బాగుండాలి.. ఊర్లు బాగుండాలి అంటే ఊర్లో గుడి, బడి బాగుండాలి అని నమ్మి*

*ఊరి కోసం దేశం కోసం తన జీవితాన్ని సమర్పించిన ధన్యజీవి...*

ఎంతోమంది యువకులకు మార్గ నిర్దేశం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహాత్ముడు...
నమ్మిన సిద్దాంతం కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లే వీరుడు..  

దేశం కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడు ..

*తానొక్కడే కాకుండా తనతో పాటు వందలాది కార్యకర్తలను తయారు చేసిన కార్యోన్ముుకుడు...*

*పుట్టింది తన కోసం కాదు సమాజం కోసం..*

కాలం తయారు చేసుకున్న కారణ జన్మునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...

*ఆలయాలు కేవలం పూజలు, యజ్ఞాలు, యాగాల నిర్వహణకే కాదు, అవి ఆపన్న హస్తాలు, నిత్య చైతన్య కేంద్రాలు,  సేవా కార్యక్రమాలకు నిలయాలు*  అన్నీ కలిపి *ఆలయాలు మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే స్ఫూర్తితో    *దేవాలయం కేంద్రంగా విద్యా, వైద్య రంగాలలో అవసరార్ధులకు సరైన సమయంలో ఆసరా అందివాలనే మహాసంకల్పంతో.*జ్ఞాన సరస్వతి సేవా సేవాసంస్థలు ప్రారంభించి @ (జ్ఞాన సరస్వతి సేవాసమితి ట్రస్ట్, జ్ఞానసరస్వతి సంస్థాన్ మరియు జ్ఞానసరస్వతి పౌండేషన్) వాటి తరఫున* సమాజ హితంకోసం నిరంతర సేవలో కొనసాగుతున్న
*సదా వెంకట్* గారికి సేవాసంస్థల తరపున జన్మదిన శుభాకాంక్షలు...

Tuesday, 8 June 2021

ఆలయ పుష్కర కుంభాభిషేక మహోత్సవం మరియు నూతన దేవాతా వాహనాల ప్రతిష్టా కార్యక్రమాలు సంపూర్ణం.

*జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*..


ఆలయ శ్రేయోభిలాషులందరికీ శుభాబినందనలు, శుభాకాంక్షలు...

*ఆలయ పుష్కర కుంభాబిషేక మహోత్సవం  మరియూ నూతవ దేవతా వాహనాల ప్రతిష్ట కార్యక్రమాలు  సంపూర్ణమయినాయి*..

*ఈ ఉత్సవాల నిర్వహణలో ప్రత్యక్షంగా బాగస్తులయిన సేవాసమితి సభ్యులకు, సహకరించిన వారికి మనందరి తరపున ప్రత్యేక శుభాకాంక్షలు*.

ఆలయ శ్రేయోభిలాషులు, భక్తుల ఆగమనంలో ఎంతో వైభవంగా నిర్వహించాలనుకున్న పుష్కర కుంభాబిషేక మహోత్సవం ఈ కరోనా మహమ్మారి కారణంగా కుదించబడిoది.
  వ్యవస్థలో తప్పనిసరిగా పాల్గొనాల్సిన అతి కొద్దిమందితో ఈ ఉత్సవాలు పూర్తయినాయి..  
*అమ్మవారి అనుగ్రహం, పూజ్య విద్యారణ్య స్వామీజి ఆశీస్సులతో ఈ ఉత్సవాలు ఉన్నకొద్దిలో చాలా బగా నిర్వహించబడ్డాయి*.
 సమయానుకూలంగా ఆలయ శ్రేయోభిలాషులకు ఉత్సవ సంబందిత వీడియోలు అందుతాయి...

*అలయ నిర్మాణానికి, నిర్వహణకు సహకరిస్తున్న ధర్మకర్తల మండలి సభ్యులకు, పోషక మండకి సభ్యులకు ప్రత్యేక శుభాబినందనలు*..

*సమయ సమర్పణలో ఆలయ నిర్మాణ, నిర్వహణ పనుల్లో  నిస్వార్థంగా నిరంతర సేవలో ఉన్న కొంతమంది కార్యకర్తలకు మనందరి తరవున శుభాభినందలు*..

*ఆలయాలు కేవలం పూజలు, యజ్ఞాలు, యాగాల నిర్వహణకే కాదు, అవి ఆపన్న హస్తాలు, నిత్య చైతన్య కేంద్రాలు,  సేవా కార్యక్రమాలకు నిలయాలు*.. 
అన్నీ కలిపి ఆలయాలు మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లినవి, ఆ పరంపరను కొనసాగిద్దాం అనే స్ఫూర్తితో *ఈ దేవాలయం కేంద్రంగా విద్యా, వైద్య రంగాలలో అవసరార్ధులకు సరైన సమయంలో ఆసరా అందివాలనే ఆలోచనతో కొన్ని కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది*. త్వరలో అన్ని విషయాలు తెలుపబడుతాయు.  అవకాశం ఉన్న అందరం బాగస్వాములం అవుదాం...

*కృతజ్ఞతాపూర్వక దాన్యవాదాలతో*...

*సదా వెంకట్*,
*ఫౌండర్, జ్ఞానసరస్వతి సేవాసమితి & జ్ఞానసరస్వతి సంస్థాన్*.