Sunday, 19 November 2017

పాదయాత్ర

.శ్రీమాత్రే నమః  2018, జనవరి 20,21 &22 తేదీలలో జరిగే   శ్రీ సరస్వతి మహాయజ్ఞ పనుల్ని పర్యవేక్షించిన  శ్రీ విద్యారణ్య భారతి స్వామిజి.  అమ్మవారి మూలవిరాట్టును దర్శించుకున్న అనంతరం 2018 జనవరి, నందివనపర్తిలొ జరిగే  మహాయజ్ఞ కోసం స్వామిజి గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు.

పాదయాత్ర అనంతరం స్వామిజి సమక్షంలో నందీశ్వరాలయంలో మహాయజ్ఞ  సభ్యులు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.  9 కమిటీల  అధ్యక్షులు ఇప్పటివరకి జరిగిన పనుల్ని  మరియు జరగబోయే పనుల్ని సభ్యులకు వివరించడం జరిగింది. అదే విధంగా మహాయజ్ఞ సమర్ధ నిర్వహణకోసం ఏర్పాటు చేసిన 18 ముఖ్య కమిటీలలో కొన్నింటికి పర్యవేక్షకులుగా నియమించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో మహాయజ్ఞ సమన్వయ కమిటీ అధ్యక్షులు శ్రీ ఇడుకుల్ల యాదయ్య,  విద్యాసంస్థల కమిటీ అధ్యక్షులు భ్రహ్మ చారి, ప్రవీణ్,  విగ్రహ సంస్థల కమిటీ అధ్యక్షులు జలంధర్ రెడ్డి గారు, మాత్రు మండలి సభ్యులు లక్ష్మికళ గారు,మారొజు కళమ్మ గారు, రుద్రమ్మ, అంజమ్మ, సరస్వతి గారు,....  ఆహ్వాన కమిటి సభ్యులు కొంగల్ల విష్ణువర్ధన్ రెడ్డి, రామ్మొహన్ రెడ్డి, హంపీపీఠ కార్యదర్శి  శ్రీ బసవరాజు శ్రీనివాస్ గారు, జ్ఞాన సరస్వతి సేవాసమితి వ్యవస్థాపకులు శ్రీ సదావెంకట్ గారు, సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ మల్లికార్జున్ గారు,  ప్రచార కమిటి సభ్యులు జయెందర్, నిఖిల్ కుమార్ రెడ్డి, చందు ఆర్ధిక కమిటి సభ్యులు గణేష్, శివ, నిర్వహణ కమిటి సభ్యులు రాజు నాయక్, పాండురంగారెడ్డి రథయాత్ర కమిటీ సభ్యులు నరెడ్ల వెంకట్ రెడ్డి, మూడెడ్ల  వెంకట్ రెడ్డి, దామోదర్, వెంకటెష్ సేవాదళ్ కమిటి అద్ష్యక్షులు రాఘవెందర్, రామనాథం, మహెందర్తో గ్రామ పెద్దలు, యువకులు ఈ సమావేశంలో   పాల్గొన్నారు.  యాచారం సర్పంచ్ శ్రీమతి కలమ్మ శ్రీనివాస్ గారిని యాచారం మండల గ్రామాల సమన్వయకర్తగా, సింగారం సర్పంచ్ శ్రీ పాండురంగారెడ్డిని హోమం ఇంఛార్జీ గా, శ్రీ వన్నవాడ నర్సిరెడ్డి ని భోజన విభాగం ఇంఛార్జీ గా, శ్రీ జోగిరెడ్డిని జల విభాగం ఇంఛార్జీగా, వనపర్తి సర్పంచ్  శ్రీ రాజునాయక్ & రామ్మోహన్ రెడ్డి గార్లను అతిథుల వ్యవస్థ & శుభ్రత విభాగాలకు ఇంఛార్జీలుగా నియమించబడ్డారు. సలహా కమిటీలో గ్రామ పూర్వ సర్పంచులు మరియు గ్రామ పెద్దలను నియమించారు.
అన్ని  కమిటీల అధ్యక్షులు కలిపి  మహాయజ్ఞ ఆర్థిక లావాదేవీల కమిటీలో ఉంటారు.

సమీక్ష సమావేశం అనంతరం
మహాయజ్ఞ స్థలాన్ని వర్యవేక్షించి స్వామిజి చేతుల మీదుగా అంకురార్పణ జరిగింది.


-శ్రీమాత్రే నమః

Wednesday, 8 November 2017

శ్రీసరస్వతి మహాయజ్ఞ చైతన్య రథయాత్ర..

కొనసాగుతున్న శ్రీసరస్వతి మహాయజ్ఞ చైతన్య రథయాత్ర..
(3 రథాలు, 108 గ్రామాలు, 12 మండలాలు)





ఆదరించి స్వాగతాలు పలుకుతున్న పల్లె హ్రదయాలకు మహాయజ్ఞ సమన్వయ కమిటీ తరపున ధన్యవాదాలు.. శుభాకాంక్షలు.
రథయాత్ర ఇంఛార్జీ, సమన్వయకర్తలకు, రథాల ఇంఛార్జీలకు మరియు ఆయా మండలాల సమన్వయకర్తలకు శుభాభినందనలు..

Sunday, 5 November 2017

మహాయజ్ఞ చైతన్య రథయాత్ర

జనవరిలో జరిగే  ""శ్రీసరస్వతి మహాయజ్ఞం""లో 108 గ్రామాల ప్రజలను భాగస్వామ్యులను చేయాలనే ఉద్దేశ్యంతో "మహాయజ్ఞ చైతన్య రథయాత్ర" ఈ  రోజు   ఉ. 10:00 గo. లకు  శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం నుండి ప్రారంభం జరిగింది.




నందివనపర్తి సరస్వతి దేవాలయం కేంద్రంగా 50 కి. మీటర్ల పరిధిలోని 108 పరిసర గ్రామాలలో ఈ రథ యాత్ర కొనసాగుతుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహాయజ్ఞ మాతృమండలి సభ్యుల మంగళ  హారతులతో మొదలు అయ్యింది.. ఈ కార్యక్రమంలో అట్టహాసంగా ప్రారంభం అయిన మహయజ్ఞ చైతన్య రథయాత్ర..


ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు సదావెంకట్ రెడ్డి గారు, ఇడుకుల్ల యాదయ్యగారు, బ్రహ్మచారి గారు, జోగిరెడ్డి గారు, జలంధర్ రెడ్డి గారు, వెంకట్ రెడ్డి గారు, రాజు నాయక్, రామనాథం, గణేష్, పాండురంగారెడ్డి, దామోదర్, జయేందర్, రాఘవేంద్ర శర్మ, శివకుమార్, నిఖిల్, మహెందర్ మాత్రు మండలి సభ్యులు ప్రమోద, రుద్ర, సరస్వతి, రేణుక, అంజమ్మ, రాధిక తదితరులు ఫాల్గొన్నారు


~ మహాయజ్ఞ సమన్వయ కమిటీ.