Wednesday, 18 October 2017

SEWA.....

తప్పక చెప్పాలనిపించి చెపుతున్నా..
ఎందరో మహనుభావులు అందరికీ వందనాలు...
పోజిషన్ ఏదైనా పోజులు కొట్టక,
వృత్తి ఏదైనా ప్రవృత్తిగా  ఎంతో కొంత సేవ చేసిన మహానుభావులే మనకు ఆదర్శం..
ఆస్తి_అంతస్తులు, సమాజంలో ఉన్న హోదా ఏది మన ప్రవృత్తికి అడ్డం రాదు అని నిరూపించిన పెద్దలెందరో....
ఇంకొదరైతే చేసేది సేవ కాదు, అది మన భాద్యతంటూ అందులోనే ఆనందం పొందారు..పొందుతున్నారు.  చేసిన, చేస్తున్న పనికి చప్పట్లు, తాళాలు, సన్మానాలు & ప్రచారాలకు ఆమడ దూరంలో ఉండి తమ పని కానిస్తారు. అలాంటి వాల్లే మనకు స్ఫూర్తి..ఆలాంటి నిశ్సబ్ద చైతన్యమే మనకు ప్రేరణ..  అలాంటి వారు ఈ రోజుల్లోను అక్కడక్కడ కొందరున్నారు.. ...
అవును అలాంటి నిశ్సబ్ద ప్రేరణ  మన జ్ఞానసరస్వతి ఆలయానికీ ఉంది..
అదే మన శివకుమార్.. ఆలయం లెక్కలకోసం పెన్ను పట్టినా ఆ లెక్కల పని కతమే, శుభ్రతకోసం జాడు పట్టినా అంతే. వృత్తి ఉపాద్యాయుడు.. ప్రవృత్తిగా మన ఆలయ నిర్వహణలో నిండా మునిగి, అది సేవ కాదు భాద్యత అని చెసే నైజం..
దిపావళి పండగ పూట మనందరం ఇండ్లల్లో  శుచి శుబ్రతల్లో  ఉంటే మన శివ, మిత్రబృందంతో ఆలయంలో శుభ్రం పనిలో.. ఎందుకో అలా తప్పక చెప్పాలనిపించి చెప్పాను...
~ సదా.

No comments:

Post a Comment