Thursday, 11 September 2025

హంస వాహిని - వరదాయిని బృందం

జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
అమ్మవారి #హంసవాహనం కోసం విద్యార్థుల విరాళాల భాగస్వామ్యం ఆశిస్తూ...   02.09.2025 రోజున  * #వరదాయిని వాణి బృందం నుండి  
1. Edusmart Scool, మునగనూర్
2. Varuns Nextgen School, మునగనూర్
3. Varuns High School, హయత్ నగర్
4. Indra Public School, మునగనూర్
5. Sai Chaithanya School, హయత్ నగర్
6. Vyas Model School, పెద్ద అంబర్ పేట్

పాఠశాలలకు వెళ్లడం జరిగింది. విద్యా సంస్థలకు #CONCEPT  వివరించి, విద్యార్థులకు 1500 హంస వాహన Stickers ఇవ్వడం జరిగింది.
:~ #జ్ఞానసరస్వతిసంస్థాన్

హంస వాహిని -.వారాహి మాత టీమ్

జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.
అమ్మవారి హంస వాహనం కోసం విద్యార్థుల విరాళాల భాగస్వామ్యం ఆశిస్తూ...   01.09.2025 రోజున  *వారాహి మాత టీం* నుండి  1)ZPHS కురిమిద్ద 
2)ZPHS మాల్ 
3)ZPHS కొత్తపల్లి 
4)ZPHS నల్లవెళ్లి 
5)కృష్ణవేణి టాలెంట్ స్కూల్, మాల్  వెళ్లడం జరిగింది. విద్యా సంస్థలకు CONCEPT  చెప్పి,  690 మంది విద్యార్థులకు *హంస వాహన Stickers ఇవ్వడం జరిగింది.*
:~ *జ్ఞానసరస్వతి సంస్థాన్*

Friday, 29 August 2025

పాఠశాలలకు హంస వాహన బృందాలు

*శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.*
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంలో 
శుభ సూచకం🕉️..
పాఠశాల విద్యార్థుల👫 విరాళాలతో💰 మాత్రమే అమ్మవారికి🙏 
#హంసవాహనం(రథం) అనే సంకల్ప సాకార పనుల్లో బాగంగా విద్యా సంస్థలను సందర్శించి, యాజమాన్యాలతో విషయ చెప్పి, విద్యార్థులకు #STICKERS అందించే పనిలో హంస వాహన బృందాలు🤝.
ఒక చారిత్రాత్మక విషయం కోసం సమయ సమర్పణ చేస్తూ సేవలో బాగస్తులవుతున్న ఆలయ 
#సేవాసమితి సభ్యులు, అందుకు సహకరిస్తున్న విద్యా సంస్థలకు, ఆ సంకల్పంలో ప్రత్యక్ష బాగస్తులవుతున్న చిన్నారులకు, వారిని ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులకు 
#జ్ఞానసరస్వతిసంస్థాన్ తరపున శుభాకాంక్షలు💐, శుభాభినందనలు🪷..
:~ #జ్ఞానసరస్వతిసంస్థాన్

Sunday, 3 August 2025

అమ్మవారి హంస వాహనం కోసం విద్యార్థుల విరాళం

*విద్యార్థుల వికాసం కోసం - విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మితమైన శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం* నందివనపర్తి.

*విషయం చిన్నదే అయినా.. పవిత్రమైనది, శక్తివంతమైనది.. చరిత్ర లో నిలిచేది.*

*అమ్మవారికి హంస వాహనం (రథం)* కోసం
*10 వేల మంది పైగా  చిన్నారులను (పాఠశాల  విద్యార్థులు) భాగస్తులను చేసే మరో అద్భుత కార్యానికి జ్ఞానసరస్వతి సంస్థాన్  ద్వారా నిర్ణయం జరిగింది.* 
నందినాథ క్షేత్రానికి 50kms  పరిధిలోని అన్ని రకాల పాఠశాలను సందర్శించి, ఆయా విద్యాసంస్థల యాజమాన్యాల సమన్వయంతో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతో జ్ఞానసరస్వతి సంస్థాన్  కార్యాచరణ సిద్ధం చేసుకున్నది. సంస్థాన్  తరపున పాఠశాలకు వెళ్ళాలిన బృందాలకు సంకల్ప భవన్ లో సంస్థాన్ వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు  Orientation నిర్వహించారు..

*అమ్మవారికి హంస వాహనం*  కోసం 6 నుండి 10వ తరగతి విద్యార్థులు   
 *రోజూ శ్లోకం - రోజుకో రూపాయి* అనే నినాదం తో 108 రోజుల పాటు విద్యార్థులు పొదుపు చేసి అందించిన విరాళాలతో మాత్రమే అమ్మవారికి *హంస వాహనం(రథం)*  సమకూర్చుతామని  తెలిపారు.
అదేవిధంగా ప్రతీ నెలా విద్యార్థులతో నిర్వహించే మూలా నక్షత్రం హోమంలో పాల్గొనేలా ఆయా విద్యాసంస్థలను ఆహ్వానిస్తారు, 
అడిగిన విద్యాసంస్థలకు సరస్వతి మాత విగ్రహం ఉచితంగా ఆలయం తరపున అందిస్తామనే విషయాలు సంస్థాన్ తరపున హంస వాహన బృందాలు విద్యాసంస్థలకు తెలియజేస్తాయి.
ఈ మహా కార్యం ద్వారా విద్యార్థులకు చిన్నతనంలోనే సమాజ కార్యంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం, పొదుపు చేసే గుణం, సమర్పణ భావనతో పాటు క్రమ శిక్షణ అలవడుతాయని సదా వెంకట్ గారు తెలిపారు.

సుమారు 108 మందితో 10 బృందాలు, 10 మండలాల్లో కనీసం 108 విద్యాసంస్థలను ఆగస్టు / సెప్టెంబర్ మాసాలలో కలిచేలా కార్యాచరణ ఉంటుందని తెలిపారు. కావున ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలను, విద్యార్థుల తల్లి దండ్రులను ఈ మహా కార్యంలో తమ పిల్లలను పాల్గొనేలా ప్రోత్సహించాలని సంస్థాన్ తరపున అభ్యర్థన చేశారు.

:*జ్ఞానసరస్వతి సంస్థాన్*

Saturday, 19 July 2025

అమ్మవారికి మొదటి వేతనం

కొలువుల కల్పవల్లిగా విలసిల్లుతున్న  #చదువులతల్లికి హృదయ నీరాజనం..
#నజ్దిక్_సింగారం వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ చింతపల్లి మంజుల రాంరెడ్డి గార్ల కుమారుడు ప్రభాత్ కిరణ్ గారు #Infosys లో #SoftwareEngineer గా ఉద్యోగం పొందారు.

ఉద్యోగం రాగానే తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని తన మొదటి నెల వేతనాన్ని ఆలయ అభివృద్ధి కోసం #సేవాసమితి సభ్యులకు అందజేయడం జరిగింది.

#BTech పూర్తయ్యాక ఉద్యోగం రావాలని కోరుకున్న వెంటనే అమ్మవారి అనుగ్రహంతో #Infosys లో ఉద్యోగం పొందాను. అందుకే నా మొదటి వేతనాన్ని దేవాలయ అభివృద్ధికి అందించాలని మా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి మొక్కు తీర్చుకుంటూ నా మొదటి నెల వేతనాన్ని(68,000/-) హృదయ పూర్వకంగా సమర్పిస్తున్నాను.

పట్టుదలతో  చదివి అమ్మవారి అనుగ్రహం తోడై ఉద్యోగం పొంది కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్ధతుతో ఉదారంగా, వినమ్రతతో తన మొదటి నెల వేతనాన్ని అమ్మవారి ఆలయానికి సమర్పించిన ప్రభాత్ కిరణ్ గారికి జ్ఞానసరస్వతి సంస్థాన్ తరపున శుభాభినందనలు ..

#ప్రభాత్_కిరణ్ గారు జీవితంలో ఇంకా ఉన్నతస్థాయికి ఎదిగి కీర్తిమంతుడు కావాలని అందరం ఆశిద్దాం .. ఆశీర్వదిద్దాం..
#జ్ఞానసరస్వతిసంస్థాన్.

Sunday, 6 July 2025

అమ్మవారికి హంస వాహనం

*సామాజిక కార్యానికి సాదర స్వాగతం💐*
*పూర్తిగా చదివితేనే📖 విషయం అర్దం అవుతుంది*

*🕉️అమ్మవారికి హంస🦢 వాహనo* అనే మహా సంకల్పంలో ప్రత్యక్ష భాగస్వామ్యం ఆశిస్తూ..
*10వేల మoది పాఠశాల👬 విద్యార్థులను కలిసే మహాకార్యంలో పాల్గొనాలని సాదర ఆహ్వానం🤝.*


*విద్యార్థుల వికాసం కోసం 👫 విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మితమైన 🚩 శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం* భక్తులకు, శ్రేయోభిలాషులకు మరియు ఆలయ నిర్మాణ, నిర్వహణలో బాగస్తులవుతున్న సమర్పకులకు విన్నపం🤚..

ఆలయ నిర్మాణానికి సంకల్పం జరిగినప్పుడే కొన్ని అద్భుత కార్యాలకు సంకల్పం జరిగింది✊. *అమ్మవారి అనుగ్రహంతో🙇🏻‍♂️, పూజ్య విద్యారణ్య భారతి స్వామీజీ దివ్య ఆశీసులతో🙏 ఒక్కొక్కటిగా సంకల్పాలు సాకారం జరిగినాయి.*
 అందులో ముఖ్యంగా
 1) *అమ్మవారి మూల విరాట్టు🕉️ కేవలం 14 ఏండ్ల లోపు చిన్నారుల విరాళాలతో💰 తేవాలని సంకల్పించి పూర్తి చేశాం🤝*,

 2) *ఆలయంలో ధ్వజ స్తంభం🚩 కేవలం కళాశాల విద్యార్థుల🎯 ద్వారా సేకరించాలన్న  సంకల్పం పూర్తి చేసుకున్నాం*

3) *అమ్మవారి అలంకరణ సామాగ్రి🎯 అంతా 14ఏండ్ల చిన్నారుల విరాళాలతో సమకూర్చుకోవాలని సంకల్పించి అది కొంతవరకు పూర్తి చేసుకున్నాం🕉️*..

4) *విద్యార్థుల వికాసం కోసం ప్రతి నెలా మూలా నక్షత్రం రోజుల విద్యార్థుల వికాసంకోసం హోమం చేయాలని సంకల్పించి, నిరంతరంగా కొనసాగుతున్నది🤝.*

5)  *అన్ని స్థాయిల విద్యా సంస్థలలో సరస్వతి మాత విగ్రహం ఉండాలని సంకల్పించి అడిగిన విద్యా సంస్థలకు ఉచితంగా అమ్మవారి విగ్రహాలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు 250 విద్యా సంస్థలకు అందించాం🙇🏻‍♂️*.. ఇది నిరంతరంగా కొనసాగుతున్నది. 

6) *అంతరాలను చూపకుండా అందరికీ సమానంగా  ఉచితంగా అక్షరాభ్యాసం నిర్వహించాలని నిరంతంగా కొనసాగిస్తున్నాం.*

 7) *ఆలయంలో ఎలాంటి రుసుము లేకుండా అందరికీ ఉచితంగా అన్ని సేవలు అందించాలని సంకల్పానుసరాం కొనసాగుతున్నాం*..
8) *సరస్వతి మాత జన్మతిథి వసంత పంచమి రోజున కేవలం విద్యార్థులతో శ్రీ సరస్వతి హోమం మరియు అమ్మవారి ఉత్సవ ఊరేగింపు కూడా 10వ తరగతి విద్యార్థుల నిర్వహణలో నిర్వహిస్తున్నాం*.
*************************
పూర్తి చేయాల్సిన సంకల్పాలలో బాగంగా 

*14 ఏండ్ల చిన్నారుల పుట్టిన రోజు వేడుకలు🤹‍♂️ సాంప్రదాయబద్దంగా ఆలయ సంకల్ప భవన్ లో నిర్వహించాలి*

*అమ్మవారికి 🦢🪷హంస వాహనం*
*అమ్మవారికి ఉత్సవ ఊరేగింపు కోసం  హంస వాహనం (🚩రథం)*  కేవలం 10వ తరగతి లోపు విద్యార్థుల విరాళాలతో సమకూర్చాలని సంకల్పం..
*ఈ హంస వాహన సంకల్పంలో 10800 పాఠశాల విద్యార్థులను భాగస్వాములను చేయాలనే సదాశయంతో, సుమారు 108 పాఠశాలను సంప్రదించి విద్యార్థులకు విషయం తెలిపి, ఈ మహా కార్యంలో బాగస్తులను చేయాలని ఆశయంతో కార్యాచరణ సిద్ధం చేస్తున్న జ్ఞాన సరస్వతి సంస్థాన్*.

కావున ఈ *చారిత్రాత్మక  మహా సంకల్పంలో అందరూ బాగస్తులు కావాలని ఆహ్వానిస్తున్నాం🤝*.

*ఆలయం కేంద్రంగా సుమారు 100kms లోపల ఉన్న అన్ని పాఠశాలను సంప్రదించి,  ఈ సంకల్పంలో భాగం కావాలని ఆహ్వానిస్తాం.*   
కావున ఆహ్వాన సమితిలో సభ్యులుగా చేరి, సమయ సమర్పణ చేసి ఈ మహా కార్యంలో ప్రత్యక్ష  కార్యoలో బాగస్తులు కావాలని ఆహ్వానిస్తున్నాం.

*బృందాల వారిగా   జూలై/ ఆగస్టు మాసాలలో విద్యాసంస్థలను సంప్రదిస్తాం. 5 మందితో కూడిన ఒక్కో బృందానికి ఒక మండలం (15- 20 పాఠశాలకు) వెళ్లాల్సి ఉంటుంది.*  రెండు నెలల్లో సుమారు 5 రోజుల సమయం ఇస్తే సరిపోతుంది.
ఎంపికైన సభ్యులందరికీ త్వరలో సన్నాహక సమావేశం ఉంటుంది.

వివరాలకు; 
9963263330, 9963163330,
9177000412,
:~ భవదీయ 
సదా వెంకట్,
ఫౌండర్ & మేనేజింగ్ ట్రస్టీ,
*జ్ఞానసరస్వతి సంస్థాన్*.